త్వరలో మణల్‌కయిరు-2
మణల్‌కయిరు 1982 మే నెల ఏడో తేదీన విడుదలై శతదినోత్సవం జరుపుకున్న చిత్రం ఇది. ఆ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన దర్శకుడు విసు, నటుడు ఎస్వీ.శేఖర్, కురియఘోస్ రంగాముగ్గురు అదే పాత్రల్లో నటిస్తున్న చిత్రం మణల్‌కయిరు-2. శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అశ్విన్ శేఖర్, పూర్ణ నాయికీనాయకులుగా నటిస్తున్నారు.
కథ, కథనం సంభాషణల పర్యవేక్షణ బాధ్యతలను నటుడు ఎస్వీ.శేఖర్ నిర్వహించిన ఈ చిత్రానికి ఇంతకు ముందు మారడా మహేశ్ చిత్రాన్ని తెరకెక్కించిన మదన్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రం గురించి ఆయన తెలుపుతూ ఈ తరం అమ్మాయిలు పెళ్లి విషయంలో చాలా కలలు కంటున్నారన్నారు.పలు ప్రణాళికలను సిద్ధం చేసుకుని వాటిని నెరవేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.అదే విధంగా స్త్రీలకు సమాజంలో పలు హక్కులు కల్పిస్తున్నారని వాటిని సాధించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.
అయితే అలాంటివి స్థాయికి మించితే జరిగే పరిణామాలేమిటన్నది ఈ చిత్రంలో కథానాయకి పాత్ర ద్వారా తెలుపుతున్నట్లు చెప్పారు. ఇటీవల మరణించిన గీతరచయిత నా.ముత్తుకుమార్ చిత్రంలోని పాటలన్నీ రాశారని తెలిపారు. ధరణ్ సంగీతాన్ని అందించారని చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు మదన్‌కుమార్ వెల్లడించారు.