breaking news
DGP appointment
-
ఏపీ డీజీపీ నియామాకంపై నీలినీడలు
-
రాష్ట్ర పరిధిలోనే డీజీపీ నియామకం
సాక్షి, హైదరాబాద్: డీజీపీ నియామక అధికారం రాష్ట్ర పరిధిలో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తోంది. డీజీపీ నియామకంపై కేంద్రానికున్న అధికారాన్ని సవరిస్తూ ‘హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్సెస్ యాక్ట్–2018’ బిల్లును రూపొందిస్తోంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్న ఈ బిల్లుకు గతవారమే సాధారణ పరిపాలన శాఖ అనుమతివ్వగా న్యాయశాఖ తుది మెరుగులు దిద్దుతోంది. 8న జరిగే రాష్ట్ర కేబినెట్ భేటీలో బిల్లు ముసాయిదాపై చర్చించి ఆమోదించే అవకాశ ముంది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జేవీ రాముడు డీజీపీగా ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం ఇదే చట్టం చేసింది. ఆ తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకురానుంది. ప్రస్తుత విధానం ప్రకా రం డీజీపీని నియమించాలంటే డీజీపీ హోదా గల ఐపీఎస్ అధికారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీకి పంపిస్తుంది. అందులో ముగ్గురు సీనియర్ అధికారులతో కూడిన జాబితాను యూపీఎస్సీ, డీవోపీటీ రాష్ట్రానికి తిరిగి పంపుతాయి. అందులో ఒకరిని సీఎం విచక్షణాధికారం మేరకు డీజీపీగా నియమిస్తారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే యూపీఎస్సీ, కేంద్రంతో సంబంధం లేకుండా డీజీపీ హోదాగల ఐపీఎస్ అధికారుల్లో సీనియారిటీ ప్రకారం ముఖ్యమంత్రే నియమించవచ్చు. రేపు కేబినెట్ భేటీ 4 నెలల సుదీర్ఘ సమయం తర్వాత రాష్ట్ర మంత్రివర్గం గురువారం సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో 12 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల వ్యూహంపై చర్చించనున్నారు. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అలాగే పలు కీలక బిల్లులను ఆమోదించనుంది. కొత్త పంచాయతీరాజ్ చట్టం, మున్సిపల్ చట్ట సవరణ, ఉర్దూ పోస్టుల నియామకాలకు సవరణల చట్టం సవరణ బిల్లులను భేటీలో చర్చించనున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రకటన తర్వాత జరుగుతున్న తొలి కేబినెట్ భేటీ కావడంతో క్షేత్రస్థాయిలో రాజకీయ పరిణామాలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. తెలంగాణ పోలీస్ ఫోర్సెస్ యాక్ట్, భూముల రీ అసైన్‌మెంట్‌కు చట్ట సవరణ, వచ్చే విద్యా సంవత్సరం ఇంటర్ స్థాయి వరకు తెలుగును తప్పనిసరి చేసే బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. -
డీజీపీ రేసులో ఆరుగురు
* పూర్తిస్థాయి డీజీపీ నియామకం అనివార్యం * కొత్త బాస్ ఎవరంటూ పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ * యూపీఎస్సీకి జాబితా పంపనున్న సర్కారు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు విభాగానికి పూర్తిస్థాయి డీజీపీ నియామకంపై ప్రభుత్వం దృష్టిసారించింది. అఖిల భారత సర్వీసు అధికారుల విభజన కొలిక్కి వచ్చిన నేపథ్యంలో పూర్తిస్థాయి డీజీపీ నియామకం అనివార్యమైం ది. ఇందుకు అర్హులైన ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. డీజీపీ నియామక నియమావళిని అనుసరించి ఐదు లేదా ఆరుగురు అ ధికారుల పేర్లను సిఫారసు చేస్తూ యూపీఎస్సీ కి రాష్ట్ర ప్రభుత్వం జాబితా పంపనుంది. సీని యారిటీ ప్రాతిపదికన ఈ జాబితాలో అరుణా బహుగుణ, టి.పి.దాస్, ఎస్.ఎ.హుడా, దుర్గాప్రసాద్, ఎ.కె.ఖాన్, అనురాగ్ శర్మ పేర్లుండే అవకాశాలున్నాయి. జాబితాతో పాటు ఆయా అధికారుల సీనియారిటీ, మెరిట్, అనుభవం, నిర్వహించిన పోస్టులు, సాధించిన పతకాలు, సమర్థత, ఎదుర్కొన్న వివాదాలు, మిగిలున్న సర్వీసు కాలం తదితరాలతో కూడిన సమగ్ర నివేదికను యూపీఎస్సీ సెలక్షన్ కమిటీకి ప్రభుత్వం పంపుతుంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని జాబితా నుంచి ముగ్గురు అధికారుల పేర్లను యూపీఎస్సీ కమిటీ ఎంపిక చేసి రాష్ట్రానికి పంపుతుంది. ప్రభుత్వం తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఆ ముగ్గురిలో ఒకరిని డీజీపీగా నియమించనుంది. యూపీఎస్సీ సిఫార్సు చేయనున్న ముగ్గురు అధికారుల్లో ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేయవచ్చనే దానిపై రాష్ట్ర పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. డీజీపీల నియామకాల్లో సీనియారిటీ, ఇతర నిబంధనలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలు తమకు కావాల్సిన వారినే నియమిస్తుండడంతో దీనిపై ప్రతిసారీ న్యాయవివాదాలు తలెత్తుతున్నాయి. విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తాత్కాలిక డీజీపీల నియామకానికి మాత్రమే కేంద్రం అనుమతించడం తెలిసిందే. దాంతో తెలంగాణ రాష్ట్ర తాత్కాలిక డీజీపీగా 1982 బ్యాచ్ అధికారి అనురాగ్ శర్మను ప్రభుత్వం నియమించింది. అప్పటికి ఆయన కంటే సీనియర్ అధికారులు పలువురున్నారు. వారిలో కొంద రు శర్మ నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయపోరాటానికీ దిగారు. ఈ నేపథ్యంలో శర్మనే పూర్తిస్థాయి డీజీపీగా నిమిస్తా రా, లేదా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. 1979 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు అధికారుల్లో అరుణా బహుగుణ డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ డెరైక్టర్‌గా కీలక బాధ్యతల్లో ఉన్న ఆమె డీజీపీ పోస్టు కో సం రాష్ట్ర సర్వీసుకు తిరిగి రావాలంటే ఆ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉం టుంది. అదే బ్యాచ్‌కు చెందిన ఎస్.ఎ.హుడా, టి.పి.దాస్ గతంలో డీజీపీల నియామకాలను సవాలు చేస్తూ ట్రిబ్యునల్ ఆశ్రయించారు. దాస్ ఈ నవంబర్‌లో పదవి విరమణ చేయనున్నారు. ఇక 1981 బ్యాచ్ అధికారుల్లో దుర్గాప్రసాద్ ఏపీ కేడర్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపుతుండగా ఏకే ఖాన్ ఏసీబీ డీజీగా ఉన్నారు. -
డీజీపీ రేసులో ఆరుగురు
-
దినేష్ రెడ్డి కొనసాగింపుపై క్యాట్‌లో వాదనలు