breaking news
Development of minorities
-
మైనార్టీల అభ్యున్నతికి ప్రత్యేక కృషి
కేశంపేట రంగారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తుందని జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి రత్నకళ్యాణి అన్నారు. రంజాన్ మాసంలో ఈద్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మండలానికి రూ.2.80 లక్షలను మంజూరు చేసిందన్నారు. శుక్రవారం కేశంపేట, సంతాపూర్, లేమామిడి, నిర్ధవెళ్లి గ్రామాల్లోని ఈద్గాలకు గతంలో మంజూరైన నిధుల ద్వారా జరిగిన అబివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. నిర్ధవెళ్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ మైనార్టీ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేని విషయాన్ని గుర్తించి అధికారులతో మాట్లాడి ఉపాధ్యాయుడిని నియమించేలా చూస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం నిర్ధవెళ్లి, పాపిరెడ్డిగూడ, వెములనర్వ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాలని ముస్లిం విద్యార్థులకు సూచించారు. అదే విధంగా తహసీల్దార్ కార్యాలయంలో షాదీముబారక్ ద్వారా మండలంలో ఎంత మంది ముస్లింలు లబ్ధిపోందారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నరేందర్‌రెడ్డి, భద్రప్ప, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు. -
ప్రతిపైసా సంక్షేమానికి ఖర్చుచేయాలి
ఆదిలాబాద్ అర్బన్ : మైనార్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి విడుదలవుతున్న ప్రతిపైసాను వారి సంక్షేమానికే ఖర్చు చేసి అభివృద్ధికి తోడ్పడాలని హైకోర్టు న్యాయమూర్తులు బి.చంద్రకుమార్, జి.చంద్రయ్యలు అన్నారు. మంగళవారం జిల్లా పరిష త్ సమావేశ మందిరంలో మౌలానా అబుల్ కలాం అజాద్ 126వ జయంతిని, జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఎం.జగన్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో హైకోర్టు న్యాయమూర్తులు ము ఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జిల్లా కలెక్టర్ అబుల్ క లాం ఆజాద్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఆర్వీఎం, మైనార్టీ కా ర్పొరేషన్ ద్వారా అమలవుతున్న వివిధ పథకాల తీరును ఆయా శాఖ అధికారులు వివరించారు. ఆజాద్ జయంతి సందర్భంగా ముగ్గురు విద్యార్థులను హైకోర్టు జడ్జిలతో పాటు కలెక్టర్, నాయకులు శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన 20 మంది విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపాలకృష్ణమూర్తి, ఏఎస్పీ జోయేల్ డేవిస్, ఎంపీ జి.నగేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూక్ రంజానీ, మైనార్టీ నాయకులు సాజిద్‌ఖాన్, యూనిస్ అక్బానీ, సాజిదొద్దీన్, సిరాజ్‌ఖాద్రి, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం హైకోర్టు జడ్జిలను జిల్లా కలెక్టర్, అధికారులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.