రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి
దేవరపల్లి : దేవరపల్లి మండలం రంగరాయకాలనీ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మందా శ్రీనివాస్(26) మృతి చెందారు. కొవ్వూరు వైపు నుంచి దేవరపల్లి వైపు వస్తున్న లారీ, దేవరపల్లి వైపు నుంచి కొవ్వూరు వైపు వెళ్తున్న లారీ ఈజీకే రోడ్డులో రంగరాయకాలనీ వద్ద ఎదురెదురుగా∙ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసిలేరుకు చెందిన మందా శ్రీనివాస్(26) తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని చికిత్స కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడ శ్రీనివాస్ మృతి చెందినట్లు హెడ్ కానిస్టేబుల్ కె.నాగేశ్వరరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.