breaking news
Deposit notes
-
నగదు రహితం సాధ్యమేనా..
డిజిటల్ లావాదేవీలపై అవగాహన లేని గ్రామీణులు బ్యాంకులకు వెళ్లడమే ఏడాదికి ఒకటి, రెండు సార్లు.. జిల్లాలో నిరక్షరాస్యులే అధికం.. నర్సంపేట : నల్లధనం వెలికితీత పేరుతో పెద్ద నోట్లను కేంద్రప్రభుత్వం రద్దు చేసినప్పటి నుంచి మొదలైన సామాన్యుల కష్టాలు ఇంకా తీరడం లేదు. నోట్ల డిపాజిట్, మార్పిడికి గడువు ముగిసిన నేపథ్యంలో.. నగదు రహిత లావాదేవీల నిర్వహణ సాధ్యమేనా అనే అనుమానాలు పలువురిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రధానంగా వరంగల్ రూరల్ జిల్లాలో ఉన్న జనాభాలో 93.01 శాతం గ్రామాల్లో నివసిస్తుండడం.. సగం మంది కూడా అక్షరాస్యులు కాకపోవడంతో ఈ జిల్లాలో నగదు రహిత లావాదేవీలు కత్తి మీద సామేనని పలువురు భావిస్తున్నారు. విరుగుడు ఇదే.. పెద్ద నోట్లను రద్దు చేశాక ఏర్పడిన అనూహ్య పరిస్థితులు సద్దుమణగాలంటే నగదు రహిత చెల్లింపులే మార్గమని ప్రభుత్వం చెబుతోంది. దీనికి అనుగుణంగా పూర్తిస్థాయిలో ప్రజలకు సాంకేతిక సేవలు అందుబాటులో లేకపోవడంతో ఇది సాధ్యమేనా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ, సగం జనాభా కూడా అక్షరాస్యులు లేని వరంగల్ రూరల్ జిల్లాలో నగదు రహిత లావాదేవీలు చేయడం సాధ్యం కాక ఆయా వర్గాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. నోట్ల మార్పిడికి బ్యాంకుల్లో ద్రువీకరణ పత్రం రాసేందుకు పేదలు ఇతరులపై ఆధారపడుతుండగా నగదు రహిత వ్యవస్థకు వరంగల్ జిల్లా ఎంత దూరమో ఇట్టే చెప్పొచ్చు. -
పోస్టాఫీసులపై విజి‘లెన్స్'
సీబీఐ దాడులతో మేల్కొన్న తపాలా ఉన్నతాధికారులు ► 25 మంది సిబ్బంది బృందాలుగా విడిపోయి నగరంలో తనిఖీలు ► సోమవారం సాయంత్రానికి ప్రాథమిక నివేదిక సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు తర్వాత తపాలా కార్యాలయాల్లో భారీగా నల్లడబ్బు చేరటాన్ని గుర్తించిన సీబీఐ విస్తృతంగా తనిఖీలు చేసి అక్రమంగా డబ్బు మారుస్తున్న అధికారులు, సిబ్బంది గుట్టు విప్పుతుండ టంతో తపాలా ఉన్నతాధికారులు మేల్కొ న్నారు. పోస్టాఫీసు లావాదేవీల్లో జరిగిన అక్రమాలను వెలికి తీయాలని నిర్ణయించారు. ఇందుకోసం విజిలెన్స విభాగాన్ని రంగంలోకి దింపారు. శనివారం నుంచి హైదరాబాద్ నగరంలో 25 మంది విజిలెన్స సభ్యులు బృందాలుగా విడిపోయి పోస్టాఫీసుల్లో తనిఖీ మొదలుపెట్టారు. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున అక్రమ లావాదేవీల జాడ తెలిసినట్టు సమాచారం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన తపాలా కార్యాలయాలు, సబ్ పోస్టాఫీసుల్లో కూడా విచారణ జరపాలని నిర్ణయించారు. పెద్ద నోట్లు రద్దయిన తర్వాత... పాతనోట్లు తీసుకుని కొత్త నోట్లు ఇవ్వటం, పొదుపు, రికరింగ్ ఖాతాల్లో భారీగా డిపాజిట్లు రావటాన్ని ప్రాతిపదికగా తీసుకుని వాటిల్లో తనిఖీలకు ఆదేశించారు. ప్రధాన కార్యాలయాల్లో ఉండే తపాలా అధికారులు, సిబ్బందిపై విచారణ ప్రారంభించారు. వీటికి సంబంధించి ప్రాథమిక నివేదిక సోమవారం సాయంత్రానికి అందించనున్నారు. వాటి ఆధారంగా అక్రమాలు జరిగిన తీరుపై అవగాహనకు వచ్చి పూర్తిస్థారుు విచారణ జరపాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. సీబీఐ దాడులు చేయని పోస్టాఫీసులను వారు తనిఖీ చేస్తున్నారు. దాడులతో అధికారుల్లో వణుకు మరోవైపు సీబీఐ దాడులతో అధికారుల్లో వణుకు మొదలైంది. గత నెల 24 వరకు జరిగిన పాతనోట్ల మార్పిడిలోనే భారీ అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా తపాలా కార్యాలయాల్లో రూ.170 కోట్ల వరకు పాతనోట్లను మార్చారు. ఇందులో హైదరాబాద్ జంటనగరాలు, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్లు ఉండే హైదరాబాద్సిటీ రీజియన్ పరిధిలోనే రూ.110 కోట్లు మార్పిడి జరిగినట్టు గుర్తిం చారు. కేంద్రప్రభుత్వం విధించిన నిబంధ నలు, పరిమితులను పట్టించుకోకుండా పాత నోట్లను కొందరు తపాలా అధికారులు, సిబ్బంది మార్చినట్టు తెలు స్తోంది. మరోవైపు గత నెల 9 నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.650 కోట్ల వరకు డిపాజిట్లు వచ్చి పడ్డాయి. రద్దయిన నోట్లను డిపాజిట్ చేసిన కొందరు భారీ ఎత్తున చెల్లుబాటు నోట్లను పొందినట్టు సమాచారం. ఈ విషయంలో కూడా తపాలాశాఖ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారు. ఓ ఉన్నతాధికారి కొంతమంది తపాలా సిబ్బందిని అనుచరులుగా ఉపయోగించుకుని నగదు లావాదేవీలు జరిపారు. తాజాగా ఆయనపై సీబీఐ నిఘా ఉంచి దాడులు చేయటంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ అధికారి పరారీలో ఉన్నారు.