breaking news
Democratic Republic of Congo
-
కూలిన బతుకులు
గోమా: డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ప్రకృతి విలయానికి 200 మంది కార్మికులు బలయ్యారు. ఈ వారంలో ఉత్తర కివూ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిన పడటంతో బలహీనపడిన గనులు బుధవారం కుప్పకూలడంతో భూగర్భంలో విధుల్లో ఉన్న 200 మందికిపైగా కార్మికులు సజీవసమాధి అయ్యారు. రుబాయా మైన్స్‌గా పిలబడే ఆ ప్రాంతంలోని గనుల ముఖద్వారాలన్నీ కుప్పకూలాయి. దీంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని నార్త్కివూ ప్రావిన్స్ గవర్నర్ అధికార ప్రతినిధి లుముంబా కంబేరే ముయీసా ప్రకటించారు. రుబాయా గనుల్లో ముఖ్యంగా కోల్టన్ ముడి ఖనిజం కోసం తవ్వకాలు జరుపుతారు. కొలంబైట్ టాంటలైట్గా పిలిచే ఈ అత్యంత విలువైన లోహాన్ని అత్యాధునిక ఎల్రక్టానిక్స్‌లో ఉపయోగిస్తారు. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్, ఆటోమోటివ్ ఎల్రక్టానిక్స్, విమాన ఇంజిన్లు, కంప్యూటర్లలో ఉపయోగించే అత్యంత శక్తివంతమైన కెపాసిటర్లలో కోల్టన్ ముడి ఖనిజాన్ని వాడతారు. మొత్తం ప్రపంచ కోల్టన్ అవసరాల్లో 15 శాతం ఖనిజం కేవలం ఈ గనుల నుంచి వెళ్తోంది. దీంతో అత్యధిక లాభాలు గడించాలనే దుర్బుద్ధితో సరైన రక్షణ ఏర్పాట్లు లేకుండానే పేద కార్మికులను ప్రమాదకర గనుల్లోకి పంపించి గంటల తరబడి పనిచేయిస్తున్నారు. ఈ ప్రాంతం ఇప్పుడు ఎం23 అనే తిరుగుబాటుదారుల చేతుల్లో ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దాని పర్యవసానంగా గనులు కూలాయని తిరుగుబాటుదారుల ప్రభుత్వం పేర్కొంది. ‘‘ఇంకా కొందరు ఆ బురదల్లో కూరుకుపోయి ఉంటారు. గాయపడిన వారిని సమీప రుబాయా పట్టణ ఆస్పత్రులకు తరలించి చికిత్సనందిస్తున్నాం. గోమా పట్టణ ఆస్పత్రుల్లోనూ పలువురిని చేర్పించాం. గనుల సమీప శిబిరాలను తక్షణం ఖాళీ చేయించి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాం’’అని ముయీసా చెప్పారు. చేతులతోనే తవ్వకం, అధ్వాన ఏర్పాట్లు.. ఆ గనుల్లో సురక్షిత పరిస్థితులు అనేవే ఉండవని అక్కడ గతంలో పనిచేసిన కార్మికుడు చెప్పాడు. ‘‘ఎలాంటి భారీ యంత్రాలు లేకుండా మైనింగ్ జరుగుతుంది. కార్మికులు ఉత్త చేతులతో చిన్న పనిముట్లతో తవ్వకాలు చేస్తారు. గని పైకప్పు కూలకుండా పటిష్టమైన తాత్కాలిక నిర్మాణాలు ఏమీ ఉండవు. గనుల నిర్వహణ అధ్వానంగా ఉంటుంది. సమాంతరంగా గనులను తవ్వుతారు. దీంతో ఒక్కటి కూలితే మిగతావన్నీ కూలడం ఖాయం’’అని క్లోవిస్ మఫేర్ అనే మాజీ కార్మికుడు చెప్పారు. మధ్య ఆఫ్రికా దేశమైన తూర్పు కాంగోలో రుబాయా ప్రాంతం అత్యంత కీలకమైంది. ఇక్కడ దశాబ్దాలుగా హింస రాజ్యమేలుతోంది. సమీప రువాండా దేశ దన్నుతో ఎం23 తిరుగుబాటుదారులుసహా పలు రెబల్ గ్రూప్‌లు ప్రభుత్వ సాయుధ బలగాలతో తరచూ ఘర్షణలకు దిగుతూ రక్తపుటేరులు పారిస్తున్నాయి. అంతర్యుద్ధం కారణంగా దశాబ్దాల్లో తూర్పు కాంగో నుంచి 70 లక్షల మంది జనం తమ సొంతూళ్లను వదిలి వెళ్లిపోయారు. ఒక్క ఈ జనవరిలోనే మరో లక్ష మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. -
ఘోర ప్రమాదం.. పడవ మునిగి 145 మంది జల సమాధి
వాయవ్య డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో(డీఆర్సీ) ఘోర ప్రమాదం జరిగింది. లులోంగా నదిలో 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న మోటారు బోటు ఓవర్ లోడుతో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 145 మంది చనిపోయి ఉంటారని అధికారులు తెలిపారు. మిగతా 55 మంది సురక్షితంగా ప్రాణాలతో బయపడినట్లు వెల్లడించారు. వీరంతా తమ వస్తువులు, పశువులతో రిపబ్లిక్ ఆఫ్ కాంగో వెళ్తుండగా బసన్కుసు పట్టణం సమీపంలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడం, వారితో పాటు వస్తువులు, పశువులు ఉండటంతో బరువు ఎక్కువై పడవ నదిలో మునిగిపోయింది. డీఆర్సీలో తరచూ పడవ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ రోడ్డు మార్గాలు లేకపోవడంతో ప్రజలు పడవల్లోనే ప్రయాణిస్తున్నారు. వలసదారులు బతుకుదెరవు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఈత రాకపోయినా పడవల్లో ప్రయాణించి ప్రమాదాలకు గురవుతుంటారు. ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్లు కూడా చాలా ఆలస్యమవుతుంటాయి. గతేడాది అక్టోబర్‌లోనూ కాంగో నదిలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. పడవ మునిగి 40 మంది చనిపోయారు. చదవండి: సారీ.. నేను చేసింది తప్పే.. ప్రజలకు రిషి సునాక్ క్షమాపణలు -
మళ్లీ పడగ విప్పుతున్న ప్రాణాంతక ఎబోలా..!
జెనీవా: ప్రాణాంతక ఎబోలా మళ్లీ పడగ విప్పుతోంది. ఆఫ్రికా ఖండంలో ఎబోలా వ్యాప్తి మళ్లీ మొదలైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది. డెమొక్రటిక్ రిపబ్లిక ఆఫ్ కాంగోలో వైరస్ వ్యాప్తి వెలుగులోకి వచ్చిందని తెలిపింది. ఆఫ్రికా ఈశాన్య ప్రాంతమైన ఈక్వెటర్ ప్రావిన్స్‌లోని మబండకా అనే పట్టణంలో ఎబోలా కేసు నమోదైంది. ఈ ప్రావిన్స్‌లో 2018 నుంచి ఎబోలా స్థానికంగా వ్యాప్తి చెందడం ఇది మూడోసారి. ఈ దేశంలో 1976నుంచి 14 సార్లు ఎబోలా వ్యాపించింది. రెండు వారాల క్రితమే వ్యాధి వ్యాప్తి ప్రారంభమైందనీ, ప్రస్తుతం దానిని అదుపు చేయడానికి అన్ని చర్యలు చేపట్టామని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. చదవండి👉🏾 మొట్టమొదటిసారిగా.. యూఎస్‌లో పోర్నోగ్రఫీపై కోర్సు ‘ఇప్పటి వరకు ఒక కేసును ఎబోలాగా అధికారికంగా ధ్రువీకరించారు. 31 ఏళ్ల రోగిలో ఈనెల 5వ తేదీన ఎబోలా లక్షణాలు కనిపించాయి. వారం తర్వాత స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆ తర్వాత ఏప్రిల్ 21న ఎబోలా చికిత్సా కేంద్రంలోని ఐసీయూలో చేర్పించారు. కానీ, ఒక రోజు తర్వాత అతడు మరణించాడు. వైద్య సిబ్బందిలో ఎబోలా లక్షణాలు కనిపించడంతో వెంటనే వారు పరీక్షల కోసం నమూనాలను ఇచ్చారు. ఇక ఎబోలాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలను గౌరవ ప్రదంగా నిర్వహించారు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. చదవండి👉🏻 ట్రిపుల్ బొనాంజా.. ఒకే కాన్పులో ఇద్దరు కాదు ముగ్గురు -
డీఆర్ కాంగోలో కూలిన విమానం
గోమా: ఆఫ్రికా దేశం డీఆర్ కాంగోలో విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 23 మంది మరణించారు. కాంగోలోని విమానాశ్రయం నుంచి ఉదయం 9 గంటల సమయంలో విమానం టేకాఫ్ అవుతుండగా ఇళ్ల మధ్యలో కూలింది. ఇందులో 19 మంది ప్రయాణికులు సహా కొందరు సిబ్బంది ఉన్నట్లు అధికారులు చెప్పారు. గోమా నుంచి బయలుదేరిన బిజీబీ ఎయిర్ లైన్స్‌కు చెందిన డోర్నియర్–228 రకం విమానం 350 కిలోమీటర్ల దూరంలోని బెని చేరుకోవాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. -
ఇళ్ల మధ్యలో కూలిన విమానం; 23 మంది మృతి
గోమా : ఎయిర్పోర్ట్ నుంచి అప్పుడే టేకాఫ్ తీసుకున్న విమానం ఇళ్ల మధ్య కూలడంతో 23 మంది చనిపోయారు. ఈ విషాదకర ఘటన మధ్య ఆఫ్రికా దేశంలోని డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆప్ కాంగోకి చెందిన గోమా సిటీలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు .. గోమా ఎయిర్పోర్ట్ నుంచి జిబీ బి విమానయాన సంస్థకు చెందిన డోర్నియర్-228 విమానం ఆదివారం ఉదయం 9 గంటలకు బెనీకి బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కాసేపటికే గోమాలోని నివాస ప్రాంతాల వద్దకు రాగానే విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 17 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. కాగా, విమానంలో ఉన్నవారెవరూ ప్రాణాలతో బయటపడలేదని పోలీసులు పేర్కొన్నారు. విమానం హఠాత్తుగా కుప్పకూలడానికి సాంకేతిక లోపమే కారణం కావొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు 6 మృతదేహాలను బయటికి తీసినట్లు వెల్లడించారు. Smoke rises from the wreckage of a small plane which crashed on takeoff into a densely populated area of Goma in the Democratic Republic of Congo pic.twitter.com/31BXU7qrG0 — AFP news agency (@AFP) November 24, 2019 -
పడవ మునిగి 129 మంది మృతి
లుబంబాషి: కాంగోలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 129కు చేరింది. ఆగ్నేయ కాంగోలోని టంగన్యికా సరస్సులో గురువారం రాత్రి పడవ మునిగిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కటంగా ప్రావిన్స్ లో మొబా, కలేమీ పట్టణాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. సహాయక బృందాలు 129 మృతదేహాలు వెలికితీశారని అధికారులు వెల్లడించారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ప్రమాదం నుంచి 232 మంది బయటపడ్డారని కటంగా ప్రావిన్స్ రవాణా మంత్రి తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోందని పేర్కొన్నారు.


