breaking news
Debt suffering
-
అప్పులబాధతో ముగ్గురు మృతి
సాక్షి నెట్వర్క్: అప్పుల బాధతో ముగ్గురు రైతులు మృత్యువాత పడ్డారు. నిజామాబాద్ జిల్లా సదాశివనగర్‌కు చెందిన పోసాని భూపాల్(32) తనకున్న ఎకరంలో వరి సాగు చేశాడు. నీరు లేక పంట పూర్తిగా ఎండుముఖం పట్టింది. భూపాల్ ఎనిమిదేళ్ల క్రితం గల్ఫ్ వెళ్లి పనిలేక ఉత్తి చేతులతో తిరిగి వచ్చాడు. సాగు కోసం, విదేశాలకు వెళ్లేందుకు చేసిన అప్పులు పెరిగిపోయాయి. దీంతో మనోవేదనతో బుధవారం గుండెపోటు వచ్చింది. కామారెడ్డిలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అంతలోనే మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం మల్లంపల్లికి చెందిన రైతు బాపు లింగయ్య(43) తనకున్న 20 గుంటలతో పాటు మరో ఎకరం కౌలుకు తీసుకొని పత్తి వేశాడు. వర్షాలు లేక పంట నష్ట పోయాడు. దీంతో రూ. లక్ష వరకు అప్పు అయ్యింది. రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో బుధవారం ఇంట్లో అప్పు విషయం మాట్లాడుతూ ఆకస్మాత్తుగా కుప్పకూలి చనిపోయాడు. మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం తుర్కపల్లికి చెందిన రైతు పుల్లయ్య(55) తనకున్న మూడు ఎకరాల్లో పత్తి పంటను సాగుచేశాడు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పంట చేతికి రాలేదు. పంటపై చేసిన అప్పులతోపాటు, కూతురి పెళ్లికోసం చేసిన అప్పులు కలిపి మూడు లక్షల వరకున్నాయి. వాటిని తీర్చలేక మంగళవారం ఉదయం పశువులను మేపడానికి అడవికి వెళ్లి చింతకుర్వ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. -
అప్పుల బాధతో ఆరుగురు రైతుల ఆత్మహత్య
సాక్షి, నెట్వర్క్: వరంగల్, ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అప్పుల బాధతో ఆరుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. వరంగల్ జిల్లా గూడూరు మండలంలోని రాములుతండాకు చెందిన గిరిజన రైతు బానోతు ఈర్యా (42)కు రెండు ఎకరాల పొలం ఉంది. పంట సరిగా పండలేదు. అప్పుల బాధతోపాటు కూతురు పెళ్లి ఎలా చేయాలన్న మనోవేదనతో ఆదివారం పురుగుల మందు తాగాడు. ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం ఎగ్గాం గ్రామానికి చెందిన రైతు చిన్నగంగన్న(45) తన భూమిలో పత్తి సరిగా మొలకెత్తలేదు. దీంతో రెండోసారి విత్తి, డీజిల్ ఇంజిన్ తెచ్చి వాగు నీటిని పంటకు పారించాడు. రూ.2 లక్షలు అప్పు తెచ్చాడు. పెట్టుబడి తిరి గొచ్చే పరిస్థితి లేకపోవడం.. అప్పులు తీర్చే మార్గం కని పించకపోవడంతో శనివారం విషం తాగాడు. మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గు మండలం శ్రీరంగాపూర్‌కి చెందిన చిటికెల నర్సింహులు(30) పురుగుమందు తాగి ఉస్మాని యా ఆస్పత్రి శనివారంరాత్రి మృతి చెందాడు. మిడ్జిల్ మం డలం బైరంపల్లికిచెందిన గోపాల్జీ(60) సాగు చేసిన వరి, పత్తి ఎండిపోవడంతో ఆదివారం కరెంటు తీగలను పట్టుకుని మృతి చెందాడు. చిన్నఎల్కిచర్ల పంచాయతీ పరిధిలోని పుల్లప్పగూడకి చెందిన గొల్ల (చక్కని) నర్సింహులు(30) పదెకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పత్తి, మొక్కజొన్న పంటలు వేశాడు. రూ.రెండులక్షలకు పైగా అప్పులు చేశాడు. పంటచేతికి రాకపోవడంతో శనివారం రాత్రి ఉరేసుకున్నాడు. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మం డలం పాశంవారిగూడేనికి చెందిన మారెడ్డి వెంకట్‌రెడ్డి (44) తన 15 ఎకరాల భూమితోపాటు మరో 15 ఎకరాలు కౌలు కు తీసుకుని పత్తి సాగు చేశాడు. రూ.5 లక్షల పెట్టుబడి పెట్టాడు. వర్షాభావం, తెగుళ్లతో పెట్టుబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో పురుగుల మందు తాగాడు.