breaking news
dawood properties
-
దావూద్ ఫ్యామిలీకి షాక్
-
దావూద్ ఫ్యామిలీకి షాక్
న్యూఢిల్లీ : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుటుంబ సభ్యులకు షాక్ తగిలింది. దావూద్ బంధువుల నుంచి ఆస్తులను స్వాధీన పర్చుకోవాలని భారత ప్రభుత్వానికి సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఆస్తులు తమవేనంటూ దావూద్ తల్లి అమీనా బీ, సోదరి హసీనా పర్కార్ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ముంబై నాగ్పాదలో దావూద్‌కి చెందిన ఆస్తులు ఉన్నాయి. దేశం విడిచి పారిపోయిన అనంతరం దావూద్ సోదరి, తల్లి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ‘స్మగ్లర్ల ఆస్తుల స్వాధీన చట్టం’ ప్రకారం 1998లో భారత ప్రభుత్వం.. దావూద్ సంబంధీకులు, విదేశీ సన్నిహితుల ఆధీనంలో ఉన్న అతని ఆస్తులను సీజ్ చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దావూద్ తల్లి, సోదరి ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు, ట్రిబ్యూనల్ వీరి పిటిషన్‌ని కొట్టేయటంతో చివరకు సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. ఆ ఆస్తులు తమ స్వార్జితమైనవేనని నిరూపించే ఆధారాలను చూపించాలని దావూద్ తల్లిని కోర్టు కోరింది. కానీ వారు సరైన ఆధారాలను ప్రవేశపెట్టలేకపోయారు. పైగా పిటిషనర్లు ఇద్దరూ మరణించటంతో.. ఆస్తుల స్వాధీనానికి లైన్ క్లియర్ అయ్యింది. వీరిద్దరి పేరిట మొత్తం ఏడు ఆస్తులు ఉన్నాయి. వాటిలో రెండు దావూద్ తల్లీ అమీనా బీ పేరున ఉండగా మిగితా ఐదు అతని సోదరి హసీనా పర్కార్ పేరు మీద ఉన్నాయి. కోట్ల విలువైన ఈ ఆస్తులను అక్రమ సంపాదనతో కొన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే 1993 ముంబై వరుస పేలుళ్లలో 257 మంది మరణించారు. ఈ పేలుళ్ల వెనక ప్రధాన సూత్రదారి దావూద్ ఇబ్రహీం. ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ దావూద్‌ని అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించింది. ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. -
దావూద్‌పై మోదీ మాస్టర్ స్ట్రోక్ ఉత్తిదే
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తులపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం దాడులు నిర్వహించిందని వచ్చిన వార్తలను ఆ దేశ ప్రతినిధి అహ్మద్ అల్ బనా కొట్టిపారేశారు. అలాంటిదేమీ ఇంతవరకు చోటు చేసుకోలేదని స్పష్టం చేశారు. రూ.15,000కోట్ల దావూద్ ఆస్తులను సీజ్ చేసినట్లు వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. ఇలాంటివి జరగాలంటే యూఏఈ న్యాయవ్యవస్థ ద్వారా మాత్రమే జరుగుతుందని, కానీ ఇప్పటి వరకు అలాంటి ప్రక్రియ మొదలే కాలేదని చెప్పారు. చదవండి..(దావూద్‌కు మోదీ మాస్టర్ స్ట్రోక్!!) దావూద్ ఇబ్రహీంకు ప్రధాని మోదీ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారని, గతంలో యూఏఈ పర్యటనకు వెళ్లిన ఆయన దావూద్ అక్రమాలపై రుజువులను యూఏఈ ప్రభుత్వానికి చూపించారని ఆ మేరకే తాజాగా దావూద్ ఆస్తులను సీజ్ చేశారని వార్తలు వచ్చాయి. వీటిని హైలెట్ చేస్తూ బీజేపీ కూడా ప్రధాని మోదీ మరో మాస్టర్ స్ట్రోక్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. అయితే, తాజాగా అవేవి వాస్తవాలు కావని బనా తెలిపారు. తొలుత రాజకీయ పరంగా చర్చించి నిబంధనల ప్రకారం న్యాయవ్యవస్థ ద్వారా మాత్రమే యూఏఈలో ఇలాంటి విషయాల్లో ముందుకెళ్లాల్సి ఉంటుందని చెప్పారు.