breaking news
The Darkness
-
కొండ క్యూలో చీకట్లు
నారాయణగిరి ఉద్యానవనంలో భక్తులకు కష్టాలు పర్యవేక్షించని అధికారులు ఈవో చొరవ చూపాలని భక్తుల విజ్ఞప్తి తిరుమలలోని నారాయణగిరి క్యూలలో శనివారం రాత్రి అంధకారం నిండిపోవడంతో కిలోమీటర్ల దూరం నడిచి వచ్చిన సామాన్య భక్తులు అవస్థలు పడ్డారు. 4 రోజులుగా తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. అధికారుల బృందం కేవలం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఏర్పాట్లపై మాత్రమే దృష్టి సారించింది. అన్ని విభాగాల అధికారులు కేవలం వీఐపీలకు దర్శన పాసులు, గదుల కేటాయింపు కోసమే అధిక సమయాన్ని వెచ్చిస్తున్నారు. తిరుమల: భక్తుల రద్దీ ఏర్పాట్ల ను కొందరు అధికారులు తప్ప అధిక సంఖ్యలోని అధికారులు పట్టించుకోలేదు. శనివారం రాత్రి కాలిబాట భక్తుల క్యూలలో వెలగని విద్యుత్‌ద్దీపాలే ఇందుకు నిదర్శనం. మధ్యలో పెద్ద ఫ్లడ్‌లైటు మాత్రమే వెలిగించా రు. క్యూల పక్కనే ఏర్పాటు చేసిన మిగిలిన లైట్లను వెలిగించడం మరిచారు. భక్తులకు రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు, ఇంజినీర్లు ముఖం చాటేయడంతో ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఫలి తంగా భక్తులకు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొన్నారు. చీకటిలోనే శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, పాలు, కాఫీ, టీ, తాగునీరు అందించారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఇనుప కమ్మీల బోల్టులు రాసుకుని చాలా మంది భక్తులు ఇబ్బందులు చవి చూశారు. సమస్యపై ఈవో చొరవ చూపాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
చీకటి రాజ్యం
నిండుకున్నవీధిదీపాలు, క్లాంపులు బడ్జెట్ ఘనం..ఖర్చు అంతంత మాత్రం చాలా చోట్ల వెలగని సెంట్రల్ డివైడర్ లైట్లు రోడ్డు ప్రమాదాల బారిన ప్రజలు పట్టించుకోని ఉన్నతాధికారులు నగరంలో చాలా ప్రాంతాలు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారుు. రాత్రి పూట వీధిదీపాలు వెలగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే నగరంలో దొంగతనాలు జోరుగా సాగుతున్నారుు. దీనికి తోడు అసాంఘిక శక్తుల ఆగడాలు మితిమీరుతున్నారుు. చాలా రహదారుల్లో అడుగడుగునా వెలసిన గోతులు ఒకవైపు... అలముకుంటున్న చీకట్లు మరోవైపు... వెరసి వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అరండల్‌పేట: నగరంలో మొత్తం 19,250 వీధిదీపాలు ఉన్నాయి. వీటి నిర్వహణకు(విద్యుత్ చార్జీల చెల్లింపు, సిబ్బంది వేతనాలతో కలిపి) నెలకు రూ. 20లక్షలు చొప్పున ఏడాదికి రూ. 2.40కోట్లు వ్యయమవుతోంది. 2014-15 నగరపాలకసంస్థ వార్షిక బడ్జెట్లో రూ. 75 లక్షలు ఖర్చుచేయాలని నిర్ణయించారు. ఆ నిధులతో వీధిదీపాలు, క్లాంపులు, ఇతర మెటీరియల్ కొనుగోలు చేయూలని నిర్ణరుుంచారు. అరుుతే కొన్ని నెలలుగా నగరంలో వీధిదీపాలు, క్లాంపులు, ఇతర పరికరాలు నిండుకున్నాయి. ఇప్పటి వరకు కార్పొరేషన్ ఎలక్ట్రికల్ విభాగం తరఫున కేవలం రూ. 12 లక్షలు మాత్రమే ఖర్చుచేశారు. మిగిలిన నిధులు సద్వినియోగం చేసుకొనే అవకాశం ఉన్నా ఇప్పటి వరకు పరికరాలకు సంబంధించి టెండర్లు పిలవనేలేదు. నగరపాలకసంస్థ పరిధిలోకి వచ్చిన పది విలీన గ్రామాల్లో సైతం పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. గోరంట్ల, నగరాలులో వీధిదీపాలు అసలు వెలగడం లేదు. ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం గోరంట్ల ప్రధాన రోడ్డులో లైట్లు వెలగకపోవడంతో రోడ్డు ప్రమాదం సంభవించింది. దీనిపై ఇప్పటికే అక్కడి స్థానికులు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా సమస్యను పరిష్కరించడం లేదు. అలాగే రెడ్డిపాలెం, అడవి తక్కెళ్లపాడు, బుడంపాడు, ఏటుకూరు, నల్లపాడు గ్రామాల్లో వీధులు అంధకారంలో ఉన్నాయి. నగరంలోని తూర్పు నియోజకవర్గం పరిధి ఆనందపేట 2, 5 లైన్లు, పాతగుంటూరు యాదవబజారు, ఆదిత్యనగర్ 1, 2 లైన్లు, శారదాకాలనీ 5, 6 లైన్లు, మంగళదాస్‌నగర్, కొత్తపేట, ఆర్టీసీకాలనీ, శ్రీనగర్ 4, 7 లైన్లలో వీధిదీపాలు వెలగడం లేదు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని హౌసింగ్‌బోర్డు కాలనీ 1, 4, 5 లైన్లు, శ్యామలాగనర్ 10, 11 లైన్లు, కొరిటెపాడు, స్తంభాలగరువు, ఎస్వీఎన్కాలనీ, పట్టాభిపురం, నల్లచెరువు, ఆర్ అగ్రహారం, శ్రీనివాసరావుతోట 60 అడుగుల రోడ్డు, కేవీపీకాలనీ తదితర ప్రాంతాల్లో వీధిదీపాలు వెలగడం లేదు. టెండర్లవిషయంలోనూ నిర్లక్ష్యం వీధిదీపాల కొనుగోలుకు సంబంధించి టెండర్లు పిలవడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా కొనుగోలు చేయడంతో ఒక్కొక్క టెండరు ఖరారు చేసేందుకు నెలల తరబడి సమయం పడుతోంది. ఇది ఒక కారణమైతే, కార్పొరేషన్ పరిధిలో వీధిదీపాల అవసరాన్ని అంచనా వేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. అదేసమయంలో కొంతమంది ఎలక్ట్రికల్ సిబ్బంది ఆయా వీధుల్లో వీధిదీపాలు పనిచేయడం లేదని ఫిర్యాదులు వచ్చినా స్పందించడం లేదు. ఉన్నతాధికారుల దృష్టికి సైతం వీటిని తీసుకువెళ్లడం లేదు. త్వరితగతిన పరిష్కరిస్తాం వీధిదీపాల సమస్య నా దృష్టికి వచ్చింది. ఇది నగరంలో ఎంత తీవ్రంగా ఉందో గుర్తించాం. వెంటనే షార్ట్ టెండర్లు పిలిచి వీధిదీపాలు, ఇతర సామగ్రి కొనుగోలు చేస్తాం. ఎక్కడా ప్రజలకు సమస్యలు తలెత్తకుండా వెంటనే చర్యలు తీసుకుంటాం. - డి.మరియన్న, ఎస్ఈ