చీకటి రాజ్యం | Elsewhere suppression central divider lights | Sakshi
Sakshi News home page

చీకటి రాజ్యం

Dec 10 2014 2:47 AM | Updated on Sep 2 2017 5:54 PM

చీకటి రాజ్యం

చీకటి రాజ్యం

నగరంలో చాలా ప్రాంతాలు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారుు. రాత్రి పూట వీధిదీపాలు వెలగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నిండుకున్నవీధిదీపాలు, క్లాంపులు
బడ్జెట్ ఘనం..ఖర్చు అంతంత మాత్రం
చాలా చోట్ల వెలగని సెంట్రల్ డివైడర్ లైట్లు
రోడ్డు ప్రమాదాల బారిన ప్రజలు
పట్టించుకోని  ఉన్నతాధికారులు

 
 నగరంలో చాలా ప్రాంతాలు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారుు. రాత్రి పూట వీధిదీపాలు వెలగక ప్రజలు  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే నగరంలో దొంగతనాలు జోరుగా సాగుతున్నారుు. దీనికి తోడు అసాంఘిక శక్తుల ఆగడాలు మితిమీరుతున్నారుు. చాలా రహదారుల్లో అడుగడుగునా వెలసిన గోతులు ఒకవైపు... అలముకుంటున్న చీకట్లు మరోవైపు... వెరసి వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
 
అరండల్‌పేట:  నగరంలో మొత్తం 19,250 వీధిదీపాలు ఉన్నాయి. వీటి నిర్వహణకు(విద్యుత్ చార్జీల చెల్లింపు, సిబ్బంది వేతనాలతో కలిపి) నెలకు రూ. 20లక్షలు చొప్పున ఏడాదికి రూ. 2.40కోట్లు వ్యయమవుతోంది. 2014-15 నగరపాలకసంస్థ వార్షిక బడ్జెట్‌లో రూ. 75 లక్షలు ఖర్చుచేయాలని నిర్ణయించారు. ఆ నిధులతో వీధిదీపాలు, క్లాంపులు, ఇతర మెటీరియల్ కొనుగోలు చేయూలని నిర్ణరుుంచారు. అరుుతే కొన్ని నెలలుగా నగరంలో వీధిదీపాలు, క్లాంపులు, ఇతర పరికరాలు నిండుకున్నాయి. ఇప్పటి వరకు కార్పొరేషన్ ఎలక్ట్రికల్ విభాగం తరఫున కేవలం రూ. 12 లక్షలు మాత్రమే ఖర్చుచేశారు. మిగిలిన నిధులు సద్వినియోగం చేసుకొనే అవకాశం ఉన్నా ఇప్పటి వరకు పరికరాలకు సంబంధించి టెండర్లు పిలవనేలేదు. నగరపాలకసంస్థ పరిధిలోకి వచ్చిన పది  విలీన గ్రామాల్లో సైతం పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. గోరంట్ల, నగరాలులో వీధిదీపాలు అసలు వెలగడం లేదు. ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం గోరంట్ల ప్రధాన రోడ్డులో లైట్లు వెలగకపోవడంతో రోడ్డు ప్రమాదం సంభవించింది. దీనిపై ఇప్పటికే అక్కడి స్థానికులు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా సమస్యను పరిష్కరించడం లేదు. అలాగే రెడ్డిపాలెం, అడవి తక్కెళ్లపాడు, బుడంపాడు, ఏటుకూరు, నల్లపాడు గ్రామాల్లో వీధులు అంధకారంలో ఉన్నాయి.

నగరంలోని తూర్పు నియోజకవర్గం పరిధి ఆనందపేట 2, 5 లైన్లు, పాతగుంటూరు యాదవబజారు, ఆదిత్యనగర్ 1, 2 లైన్లు, శారదాకాలనీ 5, 6 లైన్లు, మంగళదాస్‌నగర్, కొత్తపేట, ఆర్టీసీకాలనీ, శ్రీనగర్ 4, 7 లైన్లలో వీధిదీపాలు వెలగడం లేదు.  పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని హౌసింగ్‌బోర్డు కాలనీ 1, 4, 5 లైన్లు, శ్యామలాగనర్ 10, 11 లైన్లు, కొరిటెపాడు, స్తంభాలగరువు, ఎస్‌వీఎన్‌కాలనీ, పట్టాభిపురం, నల్లచెరువు, ఆర్ అగ్రహారం, శ్రీనివాసరావుతోట 60 అడుగుల రోడ్డు, కేవీపీకాలనీ తదితర ప్రాంతాల్లో వీధిదీపాలు వెలగడం లేదు.

టెండర్లవిషయంలోనూ నిర్లక్ష్యం

వీధిదీపాల కొనుగోలుకు సంబంధించి టెండర్లు పిలవడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రొక్యూర్‌మెంట్ ద్వారా కొనుగోలు చేయడంతో ఒక్కొక్క టెండరు ఖరారు చేసేందుకు నెలల తరబడి సమయం పడుతోంది. ఇది ఒక కారణమైతే, కార్పొరేషన్ పరిధిలో వీధిదీపాల అవసరాన్ని అంచనా వేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. అదేసమయంలో కొంతమంది ఎలక్ట్రికల్ సిబ్బంది ఆయా వీధుల్లో వీధిదీపాలు పనిచేయడం లేదని ఫిర్యాదులు వచ్చినా స్పందించడం లేదు. ఉన్నతాధికారుల దృష్టికి సైతం వీటిని తీసుకువెళ్లడం లేదు.

త్వరితగతిన పరిష్కరిస్తాం

వీధిదీపాల సమస్య నా దృష్టికి వచ్చింది. ఇది నగరంలో ఎంత తీవ్రంగా ఉందో గుర్తించాం. వెంటనే షార్ట్ టెండర్లు పిలిచి వీధిదీపాలు, ఇతర సామగ్రి కొనుగోలు చేస్తాం. ఎక్కడా ప్రజలకు సమస్యలు తలెత్తకుండా వెంటనే చర్యలు తీసుకుంటాం.
 - డి.మరియన్న, ఎస్‌ఈ
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement