breaking news
Dandupalya
-
పెళ్లి పీటలెక్కనున్న దండుపాళ్యం హీరోయిన్.. వరుడు ఎవరంటే?
ముంగారు పర్మ సినిమాతో శాండల్‌వుడ్‌లో ఫేమస్ అయిన నటి పూజా గాంధీ. ఆమె త్వరలోనే పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. బెంగుళూరులోని ఓ లాజిస్టిక్స్ కంపెనీ యజమాని విజయ్ను నవంబర్ 29న పెళ్లాడనున్నట్లు సమాచారం. అయితే పెళ్లికి సంబంధించి పూజా గాంధీ నుంచి ఎలాంటి ప్రకటనైతే రాలేదు. కాగా.. దండుపాళ్యం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది పూజా. అయితే పూజా గాంధీకి విజయ్ స్వయంగా కన్నడ నేర్పించారట. బెంగాలీ అమ్మాయి అయినా పూజా సినిమా రంగంలోకి రావడానికి బెంగళూరు వచ్చినప్పుడు విజయ్ ఆమెకు కన్నడ మాట్లాడటం నేర్పించాడని అంటున్నారు. విజయ్ సహకారంతోనే పూజా గాంధీ కన్నడ నేర్చుకుని సినిమాల్లో నటించినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య పరిచయం వల్లే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారని శాండల్‌వుడ్ లేటేస్ట్ టాక్. కాగా.. ముంగారు వర్మ సినిమాలో గోల్డెన్ స్టార్ గణేష్‌తో కలిసి పూజా గాంధీ నటించింది. ఆ తరువాత పలు సూపర్ హిట్ చిత్రాలలో నటించింది, శాండల్‌వుడ్‌లో ఫేమస్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. 2012లోనే పారిశ్రామికవేత్త ఆనంద్ గౌడతో పూజా గాంధీకి నిశ్చితార్థం జరిగింది. కాని అనివార్య కారణాలతో నిశ్చితార్థం జరిగిన నెల రోజులకే వీరి బంధం విడిపోయింది. అంతకుముందే సినిమా డిస్ట్రిబ్యూటర్ కిరణ్‌ను పూజా గాంధీ పెళ్లి చేసుకున్నారనేది వార్త బయటకొచ్చింది. పూజా గాంధీ కెరీర్... పూజా గాంధీ ప్రధానంగా కన్నడ, తమిళ, బెంగాలీ, హిందీ, తెలుగు చిత్రాల్లో ఎక్కువగా నటించారు. ఖత్రోన్ కీ ఖిలాడీ, దుష్మణి, తమోకే సలామ్, కొక్కి వంటి చిత్రాల్లో కనిపించారు. 2006లో మాన్సూన్ రైన్ సినిమా ఆమెకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత మిలన్, కృష్ణ, మన్మథ చిత్రాల్లో నటించారు. తమిళంలో తోతల్ పో మలరం, వైతేశ్వరన్ చిత్రాల్లో నటించారు. కన్నడలో పాయా, హనీ హనీ, యాక్సిడెంట్, కామన్న కొడుకులు, నీ టాటా నా బిర్లా, తాజ్ మహల్, కొడగన్నా కోలి నుంగిట్టా వంటి చిత్రాల్లో నటించారు. తెలుగులో వచ్చిన దండుపాళ్యం, దండుపాళ్యం 2, దండుపాళ్యం 3, చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. -
దండుపాళ్యంకి సీక్వెల్
వాస్తవ సంఘటనల ఆధారంగా క్రైం నేపథ్యంలో శ్రీనివాసరాజు దర్శకత్వంలో కన్నడం, తెలుగు భాషల్లో రూపొందిన ‘దండుపాళ్యం’కి సీక్వెల్ రూపొందనుంది. శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సీక్వెల్ రియలిస్టిక్‌గా ఉంటుందని దర్శక-నిర్మాతలు తెలిపారు. ‘‘ఇటీవల ఉపేంద్రతో నేను చేసిన ‘శివమ్’ చిత్రం ‘బ్రహ్మన్న’గా తెలుగులో విడుదల కానుంది’’ అని దర్శకుడు చెప్పారు. ఈ సీక్వెల్‌కు కెమెరా: వెంకట్ ప్రసాద్, సంగీతం: అర్జున్ జన్య.