breaking news
dandakaranya special zonal committee
-
చంపి, క్షమాపణ చెప్పిన మావోయిస్టులు
ముందు ప్రాణాలు తీసి, ఆ తరువాత తీరిగ్గా క్షమాపణలు చెబుతున్నారు మావోయిస్టులు. ఛత్తీస్ గఢ్ లో బీజాపుర్ జిల్లాలోని కేతుల్ నార్ లో ఎన్నికల విధుల్లో ఉన్న ఏడుగురిని శనివారం హడావిడిగా చంపేసిన మావోయిస్టులు మంగళవారానికి తీరిగ్గా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు రెండు పేజీల బహిరంగ క్షమాపణను దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ జారీ చేసింది. ఎన్నికల సిబ్బందిని భద్రతాదళాలుగా పొరబడ్డామని, అందుకే ఈ ఘోరం జరిగిందని ఆ లేఖలో మావోయిస్టులు చెప్పారు. ఎన్నికల సిబ్బంది కుట్రు అనే చోట నుంచి గుడ్మా అనే ప్రదేశానికి పోలింగ్ తరువాత తిరిగి వస్తూండగా మావోయిస్టులు మందుపాతరను పేల్చారు. ఈ సంఘటనలో ఏడుగురు చనిపోయారు. నిజానికి మావోయిస్టుల చేతిలో ఏడుగురు అమాయకులు బలికావడం పట్ల స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. చనిపోయిన వారందరూ బస్తర్ వాసులే కావడంతో ప్రజలనుంచి నిరసన ఎదురుకావడం మావోయిస్టులకు ఇబ్బందికరంగా మారింది. అందుకే ఈ బహిరంగ క్షమాపణను జారీ చేశారు. 'వారు మాకు శత్రువులు కారు. వారికి మాకు ఎలాంటి విరోధమూ లేదు. ఈ లోటు పూడ్చలేనిది. ఏం చేసినా పోయిన ప్రాణాలను తీసుకురాలేము' అని మావోయిస్టులు ఇప్పుడు అంటున్నారు. -
దాడులతోనూ నాకు సంబంధం లేదు
* దర్యాప్తు సంస్థల విచారణలో మావోయిస్ట్ నేత ఉసెండి వెల్లడి * ఎన్ఐఏ, సీఆర్పీఎఫ్, చత్తీస్‌గఢ్ పోలీసుల విచారణ * మూడో పెళ్లి విషయం పార్టీకి వివరించానని వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఎలాంటి హింసాత్మక దాడుల్లోనూ పాల్గొనలేదంటూ మావోయిస్ట్ నేత గుమ్మడివెల్లి వెంకట కిషన్ ప్రసాద్ అలియాస్ గుడ్సా ఉసెండి దర్యాప్తు సంస్థల విచారణలో వెల్లడించాడు. ఇటీవల లొంగిపోయిన ఉసెండిని రాష్ట్ర పోలీసులతోపాటు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), కేంద్ర రిజర్ దళం (సీఆర్పీఎఫ్), చత్తీస్‌గఢ్ పోలీసులు విచారిస్తున్నారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధిగా వ్యవహరించిన ఉసెండి,... చత్తీస్‌గఢ్‌లో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి, అక్కడి కోర్టులో విచారణను ఎదుర్కోవలసి ఉంది. పార్టీ విధానాలతో విబేదించి, లొంగిపోయిన ఉసెండికి న్యాయ పరమైన ఇబ్బందులు కూడా కలిగించకుండా చూడాలని పోలీసుశాఖ భావిస్తోంది. కోర్టు కేసులతో సంబంధంలేకుండానే తన లొంగుబాటును అంగీకరించాలన్న ఉసెండి షరతుకు అంగీకరించిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. కోర్టు అనుమతితో పనిలేకుండానే ఉసెండిని చత్తీస్‌గఢ్ పోలీసులువిచారిస్తున్నారు. చత్తీసగఢ్ పీసీసీ అధ్యక్షుడిని, కేంద్ర మంత్రి కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు జరిపిన దాడిపై ఎన్.ఐ.ఎ. అధికారులు, ఉసెండి నుంచి సమాచారం రాబడుతున్నారు. 2010 ఏప్రిల్ ఆరున చింతల్నార్ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ 62వ బెటాలియన్‌కు చెందిన 76 మంది మృతికి కారణమైన మావోయిస్టుల దాడిపై సీఆర్పీఎఫ్ కూడా వివరాలు రాబడుతోంది. రాజీతో విడిపోయి, సంతోషితో సహజీవనం ఉసెండి మూడో పెళ్లిపై మావోయిస్టు పార్టీ చేసిన ప్రకటనతో, ఆ విషయం చర్చనీయాంశమైంది. భార్య రాజీ ఉండగానే ఉసెండి, సంతోషి మార్కంతో సంబంధం పెట్టుకున్నాడని, తాము చర్య తీసుకునేలోపే ఆతను పరారయ్యాడని పార్టీ ్రప్రకటించింది. సంతోషిని ఉసెండి భార్యగా పోలీసులు అధికారికంగా ప్రకటించినా, వారిద్దరికీ పెళ్లికాలేదని తెలిసింది. దీనితో ఈ విషయమై ఎలా సమాధానం చెప్పుకోవాలో పోలీసులకు బోధపడటంలేదు. ఆదివాసీ యువతి మిడ్కోను ఉసెండి 1996లో పెళ్లిచేసుకున్నాడు. అతనికి మరో యువతితో సంబంధం ఉందని పార్టీ నేతలకు భార్య ఫిర్యాదుచేయడంతో వారు విచారణ జరిపి, 1999లోనే ఉసెండి స్థాయిని తగ్గించారు. ఎన్కౌంటర్లో మొదటి భార్య మిడ్కో మృతితో ఉసెండి, 2001లో రాజీని పెళ్లిచేసుకున్నాడు. ఐదేళ్ల క్రితం తమ మధ్య విబేధాల సంగతిని రాజీ, పార్టీ దృష్టికి తీసుకెళ్లింది. విభేదాలొస్తే విడాకులకు పార్టీలో అవకాశం ఉన్నా, ఉసెండి రాజీతో విడాకులు తీసుకోకుండానే సంతోషితో సహజీవనం ప్రారంభించాడు. కాగా, తన సహజీవనంపై పార్టీకి కూడా వివరించినట్టుట్టు ఉసెండి వాదిస్తున్నారు.