breaking news
Dalit Manifesto
-
తలవంచని ధిక్కారస్వరం
మూడు వేల సంవత్సరాల అణచివేతను, అవమానాలను, హింసను భరిస్తూ వున్న జాతి.. మొత్తం ప్రపంచానికి మనుషులుగా బతికే పాఠాలు నేర్పాలి అని చెప్పిన మహాకవి కలేకూరి ప్రసాద్. బహుజనుల బతుకుల్లో వెలుగుల కోసమే బతికాడు. నిరంతరం బహుజనుల కోసమే రాశాడు. కవితైనా పాటైనా, వ్యాసమైనా, అనువాదమైనా, విమర్శయినా తన శైలిలో పాఠకుల బుర్రల్లో ఆలోచనల సెగలు పుట్టిస్తూ, కన్నీటి చుక్కల్లో నుంచి చురకత్తుల వీరులు రావాలనీ దళిత తల్లుల గుండెకోతలు, మంటలు మండే ఆవేదనలే రాశాడు కలేకూరి. పిడికెడు ఆత్మగౌరవం కోసం అంటూ దళిత మ్యానిఫెస్టో కవిత రాసీ దేశ దళితుల గాయాల చరిత్రను, ధిక్కార తిరుగుబాటు కవిత్వంలో రికార్డ్ చేశాడు కంచికచర్ల కోటేశు ఘటన, కీలవేణ్మణి, కారంచేడు, నీరుకొండ, చుండూరు దళితులపై దాడులను మొత్తంగా ఈ కవితలో రాశారు. కలేకూరి రాసిన ఒక పాట దేశం మొత్తం మార్మోగింది. ‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వా / విరిసీ విరియని ఓ చిరునవ్వా/కన్నుల ఆశల నీరై కారగ/కట్నపు జ్వాలలో సమిధై పోయావా...’ ఈ పాట తెలియని వారు ఉండరు.ఎక్కడ దళితులపై దాడి జరిగినా తక్షణం స్పందించి పాల్గొంటూ, కవితలు, పాటలు, వ్యాసాలు, ఉపన్యాసాలతో ఆ ఉద్యమపోరాటంలో పాల్గొనేవాడు. అదిగదిగో ఇప్పుడు ‘కలేకూరి ప్రసాద్’ వస్తున్నాడు, ప్రశ్నించడానికీ, ధిక్కరించడానికీ, ‘అదిగదిగో తూర్పున సూర్యుడులా మండుతూ వస్తున్నాడు’ కలేకూరి ‘వస్తున్నాడు’. (మే 17న కలేకూరి ప్రసాద్ 5వ వర్ధంతి సందర్భంగా, చిలకలూరిపేటలో స్మారక సాహిత్య సభ) తంగిరాల–సోని, కంచికచర్ల మొబైల్ : 96766 09234దల -
ఆప్ దళిత మేనిఫెస్టో!
న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్, గోవా, గుజరాత్‌ల్లో ‘దళిత మేనిఫెస్టో’లను విడుదల చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా దళితులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఆప్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ మేనిఫెస్టోల్లో బీజేపీ దళిత వ్యతిరేక వైఖరిని, దళితులను అభివృద్ధిలో భాగం చేయకుండా, సామాజికంగా అణచివేసే కుట్రను కూడా బయటపెడ్తామని ఆప్ వర్గాలు తెలిపాయి. పంజాబ్ లో అత్యధిక సంఖ్యలో దళితులు ఉన్నారని, వీరి కోసం సెప్టెంబర్ లో ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేస్తామని 'ఆప్' నాయకుడొకరు వెల్లడించారు. ఇదేవిధంగా గోవా, గుజరాత్ రాష్ట్రాల్లోనూ దళితుల కోసం విధానపత్రం విడుదల చేయనున్నట్టు చెప్పారు. గుజరాత్ లోని ఉనా ప్రాంతంలో కాషాయ దళాల దాడిలో గాయపడిన యువకులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరామర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనారిటీలపై దాడులు పెరిగాయని ఆయన ఆరోపించారు.