breaking news
Customer Service Center
-
‘వాట్సాప్’ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి
సాక్షి, హైదరాబాద్: వాట్సాప్ కస్టమర్ సర్వీస్ ఆపరేషన్స్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వాట్సాప్ సీఈవో క్రిస్ డేనియల్స్ని కోరారు. గురువారం క్రిస్ డేనియల్స్, ఫేస్బుక్–ఇండియా పబ్లిక్ పాలసీ డివిజన్ అధ్యక్షుడు శివ్‌నాథ్ తుక్రాల్ కేటీఆర్‌ను హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ కస్టమర్ సర్వీస్ ఆపరేషన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని క్రిస్ డేనియల్స్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. లైఫ్‌సైన్స్ క్లస్టర్లలో ముందుండాలి కేటీఆర్ ఆహ్వానం మేరకు నోవార్టీస్ సీఈవో వ్యాస్ నరసింహన్ గురువారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కేటీఆర్‌ను కలసి రాష్ట్రంలో లైఫ్‌సైన్స్ ఎకోసిస్టమ్‌పై చర్చించారు. లైఫ్‌సైన్స్ క్లస్టర్లలో ఆసియాలోనే నంబర్ వన్‌గా నిలవాలన్నదే తమ లక్ష్యమని కేటీఆర్ అన్నారు. జీనోమ్వాలీ వంటి లైఫ్‌సైన్స్ క్లస్టర్ల స్థాపనకు తమ ప్రభుత్వ విధానాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. నాలుగేళ్లలో రా ష్ట్రంలో 700 కొత్త పెట్టుబడి ప్రతిపాదనల (దా దాపు 100 ఆర్ అండ్ డీ యూనిట్లతో కలిపి)ను తాము ఆమోదించామని వివరించారు. వీటి విలువ రూ.10,200 కోట్లు ఉంటుందన్నారు. -
విద్యుత్ కనెక్షన్ పొందండి ఇలా
ప్రయోజనం కర్నూలు (రాజ్‌విహార్): విద్యుత్ కనెక్షన్ పొందేందుకు ఎవరిని సంప్రదించాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఏఏ డాక్యూమెంట్లు తీసుకెళ్లాలి అనే అనుమానాలు చాలామందిలో వ్యక్తమవుతుంటాయి. కొత్త ఇల్లు నిర్మించుకున్నా, ఏదైన షాపునకు కరెంటు కనెక్షన్ కావాలన్నా, వ్యవసాయ, పరిశ్రమ, ఇతర అవసరాల కోసం విద్యుత్ కనెక్షన్ల పొందేందుకు మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా సమీపంలోని సబ్ డివిజన్ కేంద్రంలో ఉన్న కస్టమర్ సర్వీస్ సెంటర్లో సంప్రదించాలి. జిలాల్లో మొత్తం 15 కస్టమర్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీ) ఉన్నాయి. ఏయే డాక్యుమెంట్లు తీసుకెళ్లాలి విద్యుత్ కనెక్షన్ పొందేందుకు ఇల్లు, షాపు, పరిశ్రమ ఏదైనా రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలు లేదా ఇటీవలే చెల్లించిన పన్ను రసీదు పత్రం, లేదా ఆస్తి పట్టా జిరాక్స్ కాపీలను గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేయించి తీసుకెళ్లాలి. వీటితోపాటు ఫొటో ఐడెంటిటీ, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, వైరింగ్ సర్టిఫికేట్ (మన వినియోగం ఏ మేరకు ఉంటుందో చెబితే అక్కడే ఇప్పిస్తారు.) ►డాక్యుమెంట్ లేదా పన్ను రసీదులో ఉన్న వ్యక్తి పేరుతోనే విద్యుత్ కనెక్షన్ ఇస్తారు. ►ఆ వ్యక్తే స్వయంగా అన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్లి కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ►అక్కడ ఇచ్చే దరఖాస్తులో ఫొటోలు, సంతకాలు పెట్టాలి. దీంతో పాటు వెబ్ కెమెరా ద్వారా ఫొటోలు దిగాలి. ►ఆయన స్వయంగా రాని పక్షంలో తాను ఏ కారణంగా రాలేనో వివరిస్తూ రాతపూర్వకంగా అర్జి రాసి, అందులోనే అర్జీ తీసుకెళ్లే వ్యక్తి పేరు, అడ్రస్ సూచించాలి. ఆ వ్యక్తి ఫొటో, ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లాలి. నగరం బయట ఉంటే ఆ అర్జీని కొరియర్ ద్వారా పంపాలి. ►డాక్యుమెంట్లలో పేరు ఉన్న వ్యక్తి మరిణించి ఉంటే తన వారసులు డెత్ సర్టిఫికెట్, లీగల్ ఏర్సర్టిఫికెట్ తీసుకెళ్లడంతో పాటు మిగిలిన వారసుల చేత నో అబ్జెక్షన్ అఫిడవిట్ సమర్పించాలి. ►డాక్యుమెంట్లు తీసుకెళ్లి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నిర్ణీత మొత్తాన్ని అక్కడే ఉన్న ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ (ఈఆర్ఓ)లో చెల్లించాలి. ►కేవలం సీఎస్సీల దరఖాస్తు ఫీజు ఇంటికి రూ.25, షాపులకు రూ.50, పరిశ్రమలకు రూ.100 వసూలు చెల్లించాల్సి ఉంటుంది. ►డబ్బు చెల్లించిన తర్వాత రసీదు ఇస్తారు. స్తంభం ఏర్పాటు అవసరం లేకుంటే నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న ►నగరవాసులకు మూడు రోజుల్లో, గ్రామీణవాసులకు వారం రోజుల్లో మీటర్ మంజూరు చేస్తారు. స్తంభం ఏర్పాటు అవసరమైతే అందుకు సంబంధించి ఎస్టిమేట్ వేసి మంజూరైన పనులు పూర్తయ్యాక కనెక్షన్ ఇస్తారు. ఈ ప్రక్రియ ప్రారంభం నుంచి మీటర్ అమర్చే వరకు సమాచారాన్ని సెల్‌కు మెసేజ్ రూపంలో అందిస్తారు. ► స్తంభం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా తీసుకునే కనెక్షన్లకు డీడీల రూపంలో చెల్లించాల్సిన మొత్తం: ► ఎల్టీ కేటగిరి-1 కింద 240వాట్స్‌లోపు ఇంటి కనెక్షన్ కోసం డెవలప్మెంట్ చార్జీలు రూ.600, సెక్యూరిటీ డిపాజిట్ రూ.100 దరఖాస్తు ఫీజు మొత్తం రూ.25 చొప్పున మొత్తం రూ.725 చెల్లించాలి. ►ఎల్టీ-1 కింద 1కిలో వాట్స్‌లోపు తీసుకునే ఇంటి కనెక్షన్ కోసం డెవెలప్మెంట్ చార్జీలు రూ. 1200, సెక్యూరిటీ డిపాజిట్ రూ.300(గ్రామాల్లో), రూ.200(పట్టణాల్లో), దరఖాస్తు ఫీజు మొత్తం రూ.25 చొప్పున మొత్తం కలిపి చెల్లించాలి. ►ఎల్టీ-1 కింద ఇంటికి త్రీఫేజ్ కనెక్షన్ తీసుకుంటే డెవలప్మెంట్ చార్జీలు రూ.3600 (1కేవీ), సెక్యూరిటీ డిపాజిట్ రూ.900 (గ్రామాలు), రూ.600 (పట్టణాలు), దరఖాస్తు ఫీజు మొత్తం రూ.25 చొప్పున మొత్తం కలిపి చెల్లించాలి. ►ఎల్టీ-2 (1కేవీకి) కింద వ్యాపార దుకాణాలకు కనెక్షన్ తీసుకుంటే డెవలప్మెంట్ చార్జీలు రూ.2050, సెక్యూరిటీ డిపాజిట్ రూ.800(పట్టణాలకు), రూ.1200 (గ్రామాలకు) దరఖాస్తు ఫీజు మొత్తం రూ.50 చొప్పున మొత్తం కలిపి చెల్లించాలి. ►ఎల్టీ-2 (5కేవీకి) కింద వ్యాపార దుకాణాలకు కనెక్షన్ తీసుకుంటే డెవెలప్మెంట్ చార్జీలు రూ.6వేలు, సెక్యూటిటీ డిపాజిట్ రూ.4వేలు (పట్టణాలకు), గ్రామాల్లో రూ.6వేలు, దరఖాస్తు ఫీజు మొత్తం రూ.50 చొప్పున మొత్తం కలిపి చెల్లించాలి. ►ఎల్టీ-5 కింద వ్యవసాయ కనెక్షన్ కోసం డెవలప్మెంట్ చార్జీలు రూ.1200(1హెచ్‌పీ), సెక్యూరిటీ డిపాజిట్ రూ.60(1హెచ్‌పీ), 5హెచ్‌పీ మోటరుకు డెవెలప్మెంట్ చార్జీ రూ. 4800, సెక్యూరిటీ డిపాజిట్ రూ.300, దరఖాస్తు ఫీజు మొత్తం రూ.25 చొప్పున మొత్తం కలిపి చెల్లించాలి. -
15 నుంచే మీసేవలో ‘పాస్‌పోర్టు’!
విశాఖపట్నం: పాస్‌పోర్టు సేవలు మరింత చేరువ చేసేం దుకు వీలుగా ఆగస్టు 15 నుంచి ‘మీసేవ’ కేంద్రా ల్లో అందుబాటులో తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ప్రజలకు ఈ సేవలు ప్రారంభించాలని కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే తొలి విడతగా ఈనెల 19న పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో ‘కస్టమర్ సర్వీస్ సెంటర్ల’ (మీసేవ కేంద్రాల) ప్రతి నిధులతో అవగాహన శిబిరం నిర్వహించారు. ఆన్లైన్లో పాస్‌పోర్ట్ స్లాట్ బుకింగ్, ఫీజుల చెల్లింపు ఇతరత్రా సేవల గురించి వారికి తెలియజేశారు. పవర్ పాయింట్ ప్రదర్శనతో అవగాహన కల్పించారు. కేంద్రా ల ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేశారు. విశాఖ పాస్‌పోర్ట్ కేంద్రం పరిధిలో గల విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన ‘మీసేవ’ కేంద్రాల ప్రతినిధులను సేవలకు సిద్ధం చేశారు. విశాఖకు అనుసంధానంగా పనిచేస్తున్న విజయవాడ కేంద్రంలో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రతినిధులకు అవగాహన శిబిరం ఏర్పాటు చేశారు. ఇ-గవర్నెన్స్ టెక్నాలజీతో విదేశాంగ శాఖకు అనుసంధాన బాధ్యతలు అప్పగించారు. ‘మీసేవ’లో రాష్ట్ర ప్రభుత్వ సేవలతో సంబంధం లేకుండా పాస్‌పోర్ట్ సేవలు కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మీసేవ కేంద్రాల్లో ఆన్లైన్ అనుసంధానంలో ఇబ్బందులు తలెత్తకుండా పాస్‌పోర్ట్ సేవలు అందించాలని ఇప్పటికే పాస్‌పోర్ట్ విభాగ ఉన్నతాధికారులు ఆదేశించా రు. మీసేవ కేంద్రాల్లో చెల్లించే రుసు ంకు తగ్గట్టుగా ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. ఆగస్టు తొలి వారంలో ప్రయోగాత్మకంగా మీసేవ కేంద్రాల్లో పాస్‌పోర్ట్ సేవలు ప్రారంభిస్తారు. ప్రతి జిల్లాలో పాస్‌పోర్ట్ అధికారులు, సీఎస్సీ ప్రతినిధు లు పనితీరు పర్యవేక్షిస్తారని తెలిసిం ది. సాంకేతిక లోపాలు, సమస్యలను పరిశీలిస్తారు. అంతా సక్రమంగా ఉంటే ఆగస్టు 15 నుంచి సేవలు లాంఛనంగా ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. మీసేవ కేంద్రాల్లో పాస్‌పోర్ట్ సేవల ప్రారంభ తేదీ గురించి కార్యాలయ అధికారులు స్పష్టత ఇవ్వలేదు. త్వరలోనే తేదీ ప్రకటిస్తామని చెబుతున్నారు.