breaking news
custody petition
-
ఏపీ హైకోర్టులో కూటమి సర్కార్‌కు ఎదురుదెబ్బ
అమరావతి, సాక్షి: కూటమి సర్కార్‌కు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ అవుతు శ్రీధర్ రెడ్డి రిమాండ్ పోలీసులు వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. తక్షణమే ఆయన్ని విడుదల చేయాలని ఆదేశిస్తూ.. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.శ్రీధర్ రెడ్డి అరెస్టులో పోలీసులు అత్యుత్సాహం చూపించారన్న న్యాయస్థానం.. రిమాండ్ విధించిన కింది కోర్టు తీరును కూడా తప్పుబట్టింది. ఇదిలా ఉంటే.. అక్రమ కేసులో అవుతు శ్రీధర్ రెడ్డిని ఫిబ్రవరి 24వ తేదీన విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు మార్చి 10వ తేదీ వరకు రిమాండ్ విధించింది. -
వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ డిస్మిస్
విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మరోసారి విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు తోసిపుచ్చింది. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేసింది కోర్టు. అదే సమయంలో వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 12 వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.ఈ కేసు విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేసేందుకు సత్యవర్థన్ తరపు న్యాయవాది రెండు రోజులు సమయం కోరారు. దాంతో బెయిల్ పిటిషన్ పై విచారణను 12కు వాయిదా వేసింది కోర్టు. అదే సమయంలో వల్లభనేని వంశీ ఉంటున్న బ్యారక్ మార్చాలని దాఖలు చేసిన పిటిషన్ పై కూడా విచారణ జరిగింది.అయితే ఇతర ఖైదీలు ఉంటున్న బ్యారక్ లోకి వంశీని మార్చడం కుదరదని జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. భద్రతా కారణాల రీత్యా బ్యారక్ మార్చలేమని జైలు అధికారులు స్పష్టం చేశారు. కాగా, మెత్తటి దిండు, దుప్పటి కావాలని వంశీ కోరగా, అందుకు జైలు అధికారులు అంగీకరించారు. కాగా, జైలు బ్యారక్‌లో తనను ఒంటరిగా ఉంచారని గత నెల చివర్లో పిటిషన్ దాఖలు చేశారు వంశీ. భద్రతాపరంగా తనకు ఇబ్బంది లేనప్పటికీ అందరూ ఉన్న సెల్‌లోకి తనను మార్చాలని కోరారు.సీసీ ఫుటేజ్‌ను భద్రపరచండితన భర్త అరెస్టు అక్రమమని తేల్చేందుకు అవసరమైన సీసీ ఫుటేజ్ ను భద్రపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వల్లభనేని వంశీ భార్య.. హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సీసీ ఫుటేజ్‌ను భద్రపరచాలంటూ పోలీసుల్ని ఆదేశించింది హైకోర్టు. -
వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ పై పొన్నవోలు కామెంట్స్..
-
ఉమామహేశ్వరరావు లెక్క ఇంకా తేల్చాల్సి ఉంది!
సాక్షి, హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును కస్టడీ కోరుతూ ఏసీబీ పిటిషన్ వేసింది. 8 రోజులు కస్టడీ కి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది.నేడు(శుక్రవారం) కస్టడీ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేయనుంది. ఉమామహేశ్వరరావు అక్రమాల చిట్టాపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. బినామీ ఆస్తులు, యాపారవేత్తలతో కలిసి పెట్టుబడులపై ఏసీబీ విచారణ చేయనుంది. ఉమామహేశ్వరరావు ల్యాప్‌టాప్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రెండు బ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు తెరవనున్నారు. దీంతో ఉమామహేశ్వరరావు లెక్క ఇంకా తేల్చే పనిలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది.ట్యాబ్‌లో ఉన్న ఆస్తి వివరాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. బీనామీ ఆస్తులపై కూపీలాగుతున్నారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న ఆస్తులు డాక్యుమెంట్స్ వివరాలను ఏసీబీ అధికారులు కోర్టుకు అందించారు. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం మూడు కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తించింది.ఆస్తి విలువ అనధికారికంగా బహిరంగ మార్కెట్లో రూ. 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. పలుమార్లు సస్పెండయినా కానీ కీలక పోస్టింగ్‌లు దక్కించుకోవటంపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఉమామహేశ్వరరావు వెనక ఉన్న అధికారుల అవినీతిపై ఏసీబీ విచారణ చేస్తోంది.ఉమామహేశ్వరరావు ఫిర్యాదుదారులనే బెదిరించి వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ల్యాప్ టాప్‌లో దొరికిన సమాచారం ఆధారంగా ఏసీబీ విచారణ చేపట్టింది. కొందరు పోలీస్ అధికారులతో కలిసి బినామీ వ్యాపారాలు చేసినట్టు ఏసీబీ గుర్తించింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఏసీబీ లిస్టులో అధికారుల చిట్టా
సాక్షి, హైదరాబాద్: ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికారులు భారీగా అక్రమ ఆస్తులు కూడా బెట్టుకున్నట్లు సమాచారం. పలువురు అధికారులపై ఏసీబీ దృష్టి సారించింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యాపారులు, హవాలా ముఠాల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు తేలింది. వారి నుంచి వచ్చిన డబ్బుతో అధికారులు భారీగా సంపాదించారు. విలాసవంతమైన విల్లాలో అధికారులు నివాసం ఉంటున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఏసీబీ లిస్టులో ఫోన్ ట్యాపింగ్ పోలీసు అధికారులు చిట్టా, వారి ఆర్థిక పరిస్థితిని ఏసీబీ విశ్లేషిస్తోంది. ఆదాయానికికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకకు చెందిన రాజకీయ నేతల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లు సమాచారం నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్‌ను పోలీసులు దాఖలు చేశారు. భుజంగరావు, తిరుపతన్న ప్రణీత్ రావు ముగ్గురిని కస్టడీ కొడుతూ పిటిషన్ వేశారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో నిందితులు ఉన్నారు. ఫోన్ టాపింగ్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. బడా వ్యాపారవేత్తలను, హవాలా దందా చేసే వారిని బెదిరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రణీత్ రావు టీంలో పనిచేసిన అధికారులను నేడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పిలిచి దర్యాప్తు బృందం విచారించనుంది. -
మూడోరోజు ఏసీబీ కోర్టులో ఇరుపక్షాల వాదనలు
-
చంద్రబాబు లాయర్లకు ఏసీబీ న్యాయస్థానం సూటి ప్రశ్న
-
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పిటిషన్‌పై అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో విచారణ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
చంద్రబాబు తీర్పుపై ఉత్కంఠ
-
చంద్రబాబును ఐదు రోజుల కస్టడీ కోరిన సీఐడీ
-
చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై కాసేపట్లో తీర్పు
-
చంద్రబాబు కస్టడీ పిటీషన్ పై కొనసాగుతున్న ఉత్కంఠ
-
చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో కాసేపట్లో విచారణ
-
LIVE Updates : చంద్రబాబు హౌజ్ అరెస్టుపై విచారణ రేపటికి వాయిదా
రాజమండ్రి జైల్లో చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691గా ఉన్నారు. నిన్న టిడిపి నేతలు, ఎల్లో మీడియా హడావిడి చూస్తే.. ఈ రోజు కోర్టు ప్రారంభం కాకముందే బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారని అంతా భావించారు, కానీ చంద్రబాబు తరపు లాయర్లు ఎలాంటి బెయిల్ పిటిషన్ కోర్టులో వేయలేదు. చంద్రబాబును జైల్లో వద్దు, గృహ నిర్భంధంలో ఉంచండి అంటూ బాబు తరపు లాయర్లు వేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున సిద్ధార్థ లుథ్రా వాదనలు వినిపించారు 7.10PM - కేసు విచారణ రేపటికి వాయిదా ► ఏసీబీ కోర్టులో ఇవ్వాళ్టికి ముగిసిన వాదనలు 6.30pm - ఏసీబీ కోర్టులో మళ్లీ విచారణ ప్రారంభం ► చంద్రబాబు హౌజ్ కస్టడీ పిటిషన్ పై మళ్లీ వాదనలు ప్రారంభం ► ఏసిబీ కోర్టులో వాదనలు వినిపిస్తున్న సిఐడీ తరపు న్యాయవాది ► చంద్రబాబుకు జైల్లో పూర్తి భద్రత ఉందని చెప్పిన CID లాయర్ 5.07pm - చంద్రబాబు తరపున వరుస పిటిషన్లపై కోర్టు ఆగ్రహం 5.50pm - వాదనలకు విరామం ప్రకటించిన న్యాయమూర్తి 5.07pm - చంద్రబాబు తరపున వరుస పిటిషన్లపై కోర్టు ఆగ్రహం ► కోర్టులో ఎన్నో అంశాలుంటాయి ► ఒక పిటిషన్ వాదనలు పూర్తి కాకముందే మరో పిటిషనా? ► దేనికయినా ఒక ప్రొసీజర్ ఉంటుంది ► మిగతా కేసులు జాప్యం కావా? ► ఏ పిటిషన్ అయినా మధ్యాహ్నం 12లోపు వేయాలి ► నేరుగా పిటిషన్ వేసి వాదనలు వినాలనడం సరికాదు 5.06pm - బాబుకు మినహాయింపులేమీ వద్దు : పొన్నవోలు ► చంద్రబాబును హౌజ్ అరెస్ట్‌కు అనుమతిస్తే కేసును ప్రభావితం చేసే ప్రమాదం ► CRPCలో హౌజ్ అరెస్ట్ అనేదే లేదు ► మరో 2 కేసుల్లోనూ చంద్రబాబు నిందితుడిగా ఉన్నారు 5.05pm - చంద్రబాబుకు వెసులుబాటు ఇవ్వాలి : లూథ్రా ► చంద్రబాబుకు జైలులో ప్రమాదం ఉంది ► జైలులో కరుడుగట్టిన నేరగాళ్లు ఉంటారు ► చంద్రబాబుకు జైలులో కల్పించిన భద్రతపై అనుమానం ఉంది 4.50pm - కేసు డాక్యుమెంట్లు కావాలి : లుథ్రా ► స్కిల్ కుంభకోణం కేసుకి సంబంధించి పూర్తి వివరాలు కావాలి ►సిట్ కార్యాలయంలో డాక్యుమెంట్లని పరిశీలించడానికి అనుమతించండి ►సెక్షన్ 207 ప్రకారం అనుమతి ఇవ్వాలి ►పిటిషన్ వేసిన లాయర్ సిద్దార్ద లూథ్రా 4.45pm - చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై క్లారిఫికేషన్ కోరిన ఏసీబీ కోర్టు ►సుప్రీంకోర్టులోని కొన్ని కేసులను ఉదహరించిన బాబు తరపు న్యాయవాదులు ►కోట్ చేసిన కేసులకు సంబంధించి వివరాలు అడిగిన న్యాయమూర్తి ►చంద్రబాబు హౌజ్ అరెస్టు పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు ►త్వరలోనే ఆదేశాలు వెలువడే అవకాశం 4.15pmచంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లుథ్రా ►చంద్రబాబు ఇప్పటివరకు ఎన్ఎస్జీ భద్రతలో ఉన్నారు ►చంద్రబాబుకు జైలులో కల్పించిన భద్రతపై అనుమానం ఉంది ►హౌజ్ కస్టడీకి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉంది ►గౌతం నవార్కర్ కేసు పరిశీలించండి ►హైకోర్టుకు వెళ్లి తెచ్చుకున్న భద్రత పెంపు ఆదేశాలు అమల్లో ఉన్నాయి ►చంద్రబాబును హౌస్ కస్టడీకి అనుమతి ఇవ్వాలి 3.30pm : AAG పొన్నవోలు సుధాకర్ రెడ్డి ►రాజమండ్రి సబ్ జైల్ 50 అడుగుల గోడ, అక్కడికి ఎవరు రాలేరు ►రాజమండ్రి జైల్ కంటే మించిన సెక్యూరిటీ ఎక్కడా ఉండదు ►అలాగే డాక్టర్స్ 24 గంటలు అందుబాటులో ఉంటారు ►కాబట్టి చంద్రబాబుకు హౌజ్ అరెస్ట్ అవసరం లేదు ►చంద్రబాబుకు ఇంట్లో కంటే జైల్లోనే భద్రత ఉంటుంది ►చంద్రబాబు ఆరోగ్యం బాగుంది ►చంద్రబాబు భద్రత.. ఆరోగ్యంపై అనుక్షణం ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. 3.20pm : అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ►చంద్రబాబు భద్రతకి ఎటువంటి ఇబ్బంధులు లేవు ►రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు కి గట్టిభద్రత కల్పించాం ►జైలులో చంద్రబాబుకి ప్రత్యేక గదితో పాటు సిసి కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోంది ►చంద్రబాబు భద్రతపై తీసుకున్న చర్యలపై జైళ్ల శాఖ డిజి ఆదేశాల లేఖని మీ ముందు ఉంచుతున్నా ►జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న నిందితుడి భధ్రతా బాధ్యత ప్రభుత్వానిదే ►చంద్రబాబు కోరిన విధంగా కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకి ఇంటి భోజనం, మందులు అందుతున్నాయి ►చంద్రబాబుకి భద్రత కొనసాగుతోంది ►గృహ నిర్బందం పిటిషన్ డిస్మిస్ చేయాలి ►ఈ పిటిషన్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ►చంద్రబాబు సాక్ష్యులను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది 3:00pm 3గంటల తర్వాత చంద్రబాబు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ సిద్ధం చేసినట్టు టిడిపి వర్గాల్లో ప్రచారం జరిగింది. ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తారని, 437(1) ప్రకారం మధ్యంతర బెయిల్ పిటిషన్ వేస్తారని, రెండు పిటిషన్లను న్యాయవాదులు ఒకేసారి దాఖలు చేయనున్నట్టు సమాచారం. మరో వైపుచంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ రద్దు అయినట్టు టిడిపి వర్గాల సమాచారం. చంద్రబాబును కుటుంబ సభ్యులు రేపు కలవాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇటు రాజమండ్రిలోనే ఉన్న లోకేష్ బస్సులోనే ముఖ్య నేతలతో సమావేశం జరిపినట్టు సమాచారం. చంద్రబాబు అరెస్టు తర్వాతి పరిణామాలపై చర్చించిన టిడిపి నేతలు.. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో బయటపడ్డ ఆధారాలపై మంతనాలు జరిపారు. కొందరు సీనియర్లు లోకేష్‌తో కేసు బలంగా ఉందని చెప్పినట్టు సమాచారం. ACB Court Live Updates ►చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ పై కొనసాగుతున్న వాదనలు ►సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్, ఏఏజీ పొన్నవోలు వాదనలు ►చంద్రబాబు హౌజ్ అరెస్టు పిటిషన్‌ను తిరస్కరించాలన్న సీఐడీ కౌంటర్ పిటిషన్ ►రాజమండ్రి జైలులో పూర్తి భద్రత మధ్య చంద్రబాబు ఉన్నారు ►బాబును హౌజ్ అరెస్టులో ఉంచాల్సిన అవసరం లేదు ►ఆర్థిక నేరాల్లో ఉన్న నిందితుడికి హౌజ్ అరెస్ట్ అనేది అవసరం లేదు ► చంద్రబాబు హౌజ్ అరెస్ట్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసింది ఏపీ సీఐడీ. సీఆర్పీసీలో హౌజ్ అరెస్ట్ అనేదే లేదు. బెయిల్ ఇవ్వలేదు కాబట్టే హౌజ్ రిమాండ్ కోరుతున్నారు. అరెస్ట్ సమయంలో చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు అని సీఐడీ కౌంటర్ కాపీలో పేర్కొంది. ► చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంలో అరెస్ట్ కోరుతూ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ ( ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్) వేశారు సిట్ తరపు న్యాయవాదులు. ఈ క్రమంలో.. కోర్టుకి 6 వేల పేజీల డాక్యుమెంట్లు సమర్పించినట్లు తెలుస్తోంది. మరో కేసులో చంద్రబాబు అరెస్ట్ కోసం పీటీ వారెంట్? విజయవాడ ఏసీబీ కోర్టులో.. సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో కూడా చంద్రబాబు అరెస్ట్ కోసం పీటీ వారెంట్(పీటీ వారెంట్ (ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్) కోరింది. 2022లో నమోదైన కేసులో పీటీ వారెంట్‌పై బాబును విచారించేందుకు కోర్టు అనుమతి సీఐడీ కోరింది. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ6గా నారా లోకేష్ ఉన్నారు. చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉందని పిటిషన్లో పేర్కొంది సీఐడీ. ► చంద్రబాబు కస్టడీ కోరుతూ ఏపీ సీఐడీ వేసిన పిటిషన్‌పై మధ్యాహ్నం 2.30కి వాదనలు జరగనున్నాయి. ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు.. చంద్రబాబు తరపున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. అదే సమయంలో.. భద్రతా కారణాల రీత్యా చంద్రబాబు రిమాండ్‌ను.. హౌజ్ అరెస్ట్‌గా పరిగణించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పైనా ఏసీబీ న్యాయమూర్తి వాదనలు వినే అవకాశం ఉంది. ► చంద్రబాబు హౌజ్ అరెస్ట్ పిటిషన్‌పై మధ్యాహ్నాం తర్వాత విచారణ జరగనుంది. ► చంద్రబాబు హౌజ్ అరెస్టుకు అవకాశం ఇవ్వాలని ఆయన తరపున న్యాయవాదులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే ఏఏజీ అందుబాటులో లేరని.. సమయం ఇవ్వాలని సిట్ స్పెషల్ జీపి న్యాయమూర్తిని కోరారు. దీంతో.. హౌజ్ కస్టడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని జడ్జి ఆదేశిస్తూ.. విచారణ మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ అనంతరమే ఆదేశాలేవైనా ఇస్తామని న్యాయమూర్తి చంద్రబాబు లాయర్లకు స్పష్టం చేశారు. ► ఏఏజీ స్పందన స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు నుంచి సీఐడీ ఇంకా వివరాలు సేకరించాల్సి ఉందని సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చెబుతున్నారు. చంద్రబాబు తరపున ఇంకా బెయిల్ పిటిషన్ దాఖలు కాలేదు. ఏసీబీ కోర్టు తీర్పు కాపీ ఇవాళ అందుతుంది. చంద్రబాబుని ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశాం. చంద్రబాబు భద్రతా పరంగా చూసుకుంటే.. రాజమండ్రి సెంట్రల్ జైలు కంటే మంచి చోటు ఉండదు అని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి.. హౌజ్ అరెస్ట్ పిటిషన్ పరిణామంపై స్పందించారు. ఎఫ్ఐఆర్ లో పేరులేకపోయినా దర్యాప్తు తర్వాత పేర్లు చేర్చొచ్చు. FIR అనేది దర్యాప్తునకు మొట్టమొదటి అడుగు. దర్యాప్తులో ఎవరి ప్రమేయం బయటపడినా , వాళ్ల పేర్లు చేర్చొచ్చు. FIR లో లేదు కాబట్టి ముద్దాయి కాదంటే , న్యాయసూత్రాలకు విరుద్ధం - ఈ కేసు ఏపీ ప్రభుత్వం పెట్టింది కాదు అని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు. ► చంద్రబాబును జైల్లో ఉంచడం ప్రమాదకరం - హౌస్ అరెస్ట్ పిటిషన్ పై మా వాదనలు వినిపిస్తాం - గతంలో వెస్ట్ బెంగాల్ మంత్రుల విషయంలో సుప్రీం కోర్టు తీర్పును ప్రస్తావిస్తాం - బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నాం : అడ్వకేట్ కౌన్సిల్ సిద్ధార్ద్ లూద్రా ► విజయవాడ కోర్టులో మరోసారి హౌజ్ అరెస్ట్ పిటిషన్ వేయనున్న లూథ్రా!. ఎన్ఎస్జీ సెక్యూరిటీ వీవీఐపీగా ఉన్న చంద్రబాబు నాయుడను హౌజ్ అరెస్ట్ చేయాలని, భద్రతా కారణాల వల్ల ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కోర్టును కోరే ఛాన్స్ కనిపిస్తోంది. ► ఏసీబీ కోర్టు తీర్పు కాపీ కోసం చంద్రబాబు లాయర్ల ఎదురుచూపులు. తీర్పులోని అంశాల ఆధారంగానే.. బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టులో దాఖలు చేయాలా? హైకోర్టులో వేయాలా? అనే దానిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్. ఏసీబీ కోర్టుకు వచ్చిన చంద్రబాబు తరపు లాయర్లు విజయవాడ కోర్టుకు వచ్చిన సిద్ధార్థ్ లూథ్రా , ఇతర లాయర్లు. సీఐడీ కస్టడీ పిటిషన్ పై చంద్రబాబు తరపున తన వాదనలు వినిపించనున్న లూథ్రా. అలాగే బెయిల్ పిటిషన్ ఎక్కడ వేయాలన్నదానిపైనా లీగల్ టీంతో చర్చలు. సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి.. విజయవాడ ఏసీబీ కోర్టు ముందుకు పిటిషన్లు విచారణకు రానున్నాయి. స్కిల్ స్కాంలో ప్రధాన ముద్దాయి అయిన చంద్రబాబును తమ కస్టడీకి ఇవ్వాలని, తద్వారా మరిన్ని వివరాలు రాబట్టగలిగే అవకాశం కల్పించాలని ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టును కోరనుంది. స్కిల్ స్కామ్ కేసుపై ఇవాళ మొత్తం మూడు పిటిషన్లు విచారణకు రానున్నాయి. ముందుగా విచారణకు రానుంది చంద్రబాబు కస్టడీ పిటిషన్. ఐదురోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరనున్నాయి. అలాగే.. ఏ 1 ముద్దాయి చంద్రబాబుని లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని సిట్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు విచారణలో చంద్రబాబు తమకు సహకరించలేదని కోర్టుకు విన్నవించారు అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. దీనికి కౌంటర్‌గా చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇక.. కస్టడీ పిటీషన్ పై విచారణ తర్వాత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. మరోవైపు హైకోర్టుని ఆశ్రయించే ఆలోచనలో చంద్రబాబు తరపు న్యాయవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. రిమాండ్ రిపోర్ట్ ని రిజెక్ట్ చేయాలని హై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. కానీ, జైలుకు తరలించడం తో హౌస్ అరెస్ట్ పిటిషన్ విచారణకు తీసుకోరని సీనియర్ న్యాయవాదులు చెబుతున్నారు. దీంతో ఏసీబీ కోర్టులోనే బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేయొచ్చని తెలుస్తోంది. -
అఖిలప్రియకు బెయిల్ ఇవ్వొద్దు..
సాక్షి, హైదరాబాద్: కిడ్నాప్ కేసులో అఖిలప్రియ కస్టడీ కోసం బోయిన్పల్లి పోలీసులు సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అఖిలప్రియను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరారు. రేపటి నుంచి ఈనెల 15 వరకు కస్టడీకి ఇవ్వాలని కోరారు. అఖిలప్రియ అనుచరులకు మరికొన్ని కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని, అఖిలప్రియ భర్త సహా మిగతా నిందితులను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. బాధితులతో సంతకాలు చేయించుకున్న దస్త్రాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని పిటిషన్లో పోలీసులు పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్ చేశాక కిడ్నాప్ సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉందన్నారు. (చదవండి: కిడ్నాప్ ప్లానంతా అతని కనుసన్నల్లోనే..) ఇది ఇలా ఉండగా, అఖిలప్రియకు బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసుల కౌంటర్ దాఖలు చేశారు. అఖిలప్రియకు బెయిల్ వస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందని, ఆమెపై తప్పుడు కేసులు పెట్టే ఉద్దేశం మాకు లేదని పోలీసులు తెలిపారు. ‘‘సాక్ష్యాల సేకరణకు దర్యాప్తు బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయాలి. అఖిలప్రియకు బెయిల్ ఇస్తే మరిన్ని నేరాలకు పాల్పడవచ్చు. అఖిలప్రియ చర్యల వల్ల స్థానికుల్లో అభద్రతాభావం నెలకొంది. అఖిలప్రియకు ఆర్థికంగా, రాజకీయంగా ప్రభావితం చేయగలిగే పలుకుబడి ఉంది. అఖిలప్రియకు బెయిల్ ఇస్తే కేసు విచారణ నుంచి తప్పించుకునే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. కాగా.. అఖిలప్రియ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. (చదవండి: అఖిలప్రియను అరెస్టు చేయకుంటే అనర్థాలెన్నో!) -
నౌహీరా కస్టడీ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
సాక్షి, హైదరాబాద్: హీరా గ్రూప్ సీఈఓ నౌహీరా షేక్ కస్టడీ పిటిషన్‌పై మంగళవారం నాంపల్లి కోర్టులో వాదనలు ముగిసాయి. నౌహీరాకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరఫు నాయవాది తధాని వాదనలు వినిపించారు. హీరా గ్రూప్‌కు సంబంధించి 2012 నుంచి ఈడీ దర్యాప్తు చేస్తోందని.. అయిన ఇప్పటివరకు ఈడీ అధికారులకు ఎటువంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. డిపాజిట్ దారుల సౌలభ్యం కోసమే 160 బ్యాంక్ ఖాతాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది ఆదాయ లావాదేవీలు సక్రమంగా జరుపుతున్నామని.. ఐటీ రిటన్స్ కూడా చెల్లిస్తున్నామని కోర్టులో వాదనలు వినిపించారు. తమపై ఉద్దేశ పూర్వకంగానే కేసులు నమోదు చేశారని తధాని కోర్టుకు తెలిపారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఇప్పటికే నౌహీరాపై అనేక చోట్ల కేసుల నమోదయ్యాయని కోర్టుకు తెలిపారు. ఆమెను కస్టడీకి అనుమతిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. దేశవ్యాప్తంగా చాలామంది హీరా గ్రూప్ బాధితులు ఉన్నారని, విచారణ కొనసాగుతోందని, బాధితుల ఫిర్యాదు మేరకే కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కోర్టులో వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. చదవండి: 6 సంవత్సరాలు..800 కోట్లు! ‘స్కీమ్స్’ స్కామ్‌లో డాక్టర్ నౌహీరా షేక్ అరెస్టు -
గజల్ శ్రీనివాస్ కస్టడీ పిటిషన్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: ‘సేవ్ టెంపుల్స్’ సంస్థలో పనిచేస్తున్న సహచర ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న కేసులో నిందితుడు గజల్ శ్రీనివాస్‌ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. మరోవైపు తనపై అన్యాయంగా కేసు పెట్టారని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గజల్ శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై నిర్ణయాన్ని శుక్రవారం వెల్లడిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలతో గజల్ శ్రీనివాస్ ప్రస్తుతం చంచల్‌గూడ జైలు రిమాండ్‌లో ఉన్నారు. -
రావెల సుశీల్ పోలీస్ కస్టడీ కోరుతూ పిటిషన్
బంజారాహిల్స్: ఏపీ మంత్రి రావెల కిశోర్‌బాబు తనయుడు సుశీల్(24)ను తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా బంజారాహిల్స్ పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం కోర్టులో వాదనలు జరగనున్నాయి. మార్చి 3వ తేదీ సాయంత్రం ఏం జరిగింది. ఈ కేసులో మంత్రి కుమారుడు సుశీల్ పాత్ర, డ్రైవర్ రమేష్ దెబ్బలు తినడానికి కారణాలతో పాటు పలు అంశాలపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టనున్నారు. టీచర్ ఫాతిమా బేగంను తన కారులోకి లాగడానికి యత్నించిన సుశీల్, డ్రైవర్ రమేష్ స్థానికుల చేతిలో దెబ్బలు తిన్నతర్వాత రెండోసారి మళ్లీ ఘటనా స్థలానికి ఎందుకు వచ్చారన్న దానిపై పోలీసులు ఆరాతీయనున్నారు. పది మంది అనుచరులతో ఘటనా స్థలానికి సుశీల్ ఎందుకు వచ్చాడన్న దానిపై కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన మెడలో గొలుసు పోగొట్టుకున్నానని అందుకే రెండోసారి ఘటనా స్థలానికి వచ్చినట్లు సుశీల్ చెప్పుతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ కేసులో మరిన్ని సంచలనాలు వెలుగు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
సండ్ర కస్టడీ పిటిషన్‌పై తీర్పు సా. 4 గంటలకు
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కస్టడీ పిటిషన్‌పై తీర్పును కోర్టు సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది. ఇదే కేసులో సండ్ర బెయిల్ పిటిషన్‌పై తీర్పును రేపటికి వాయిదా వేసింది. బుధవారం హైదరాబాద్ ఏసీబీ కోర్టు ఈ పిటిషన్‌ను విచారించింది. ఓటుకు కోట్లు కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఆయనను కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్‌కు ఆదేశించారు. సండ్ర తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశారు. సండ్రకు బెయిల్ ఇస్తే దర్యాప్తు పురోగతిని అడ్డుకుంటారని, 5 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఏసీబీ కౌంటర్ పిటిషన్‌ను దాఖలు చేసింది. -
సండ్ర కస్టడీ పిటిషన్‌పై వాదనలు
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కస్టడీ పిటిషన్‌పై వాదనలు ప్రారంభమయ్యాయి. బుధవారం హైదరాబాద్ ఏసీబీ కోర్టు ఈ పిటిషన్‌ను విచారిస్తోంది. ఓటుకు కోట్లు కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఆయనను కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్‌కు ఆదేశించారు. సండ్ర తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశారు. సండ్రకు బెయిల్ ఇస్తే దర్యాప్తు పురోగతిని అడ్డుకుంటారని, 5 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఏసీబీ కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేసింది. -
ధర్మాన, సబితాలకు సీబీఐ కోర్టులో ఊరట