29 నుంచి బాస్కెట్‌బాల్ లీగ్
జింఖానా, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఈ నెల 29 నుంచి బీఎఫ్ఐ ఐఎంజీ రిలయన్స్ కాలేజ్ బాస్కెట్‌బాల్ లీగ్ నిర్వహించనుంది. ఈ టోర్నీలో పురుషుల, మహిళల విభాగాల్లో మొత్తం 20 జట్లు పాల్గొననున్నాయి. ఈ జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి 96 మ్యాచ్‌లను నిర్వహిస్తారు. విజేతగా నిలిచిన వారికి ఏప్రిల్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది.
పురుషుల గ్రూప్ ‘ఎ’ జట్లు: లయోలా అకాడమీ, భవాన్స్ డిగ్రీ కాలేజి, మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజి, ముఫకంజా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి, నిజాం కాలేజి. గ్రూప్ ‘బి’ జట్లు: ఏవీ కాలేజి, సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజి, అవంతి డి గ్రీ కాలేజి, బిట్స్ పిలాని హైదరాబాద్, సీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజి.
మహిళల గ్రూప్ ‘ఎ’ జట్లు: లయోలా అకాడమీ, సెయింట్ ఆన్స్ డిగ్రీ కాలేజి, కస్తూర్బా డిగ్రీ కాలేజి, సీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజి, గోకరాజు నూకరాజు ఇంజినీరింగ్ కాలేజి.
గ్రూప్ ‘బి’ జట్లు: నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజి, సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజి, సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజి, బిట్స్ పిలాని హైదరాబాద్, ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల.