breaking news
creating
-
గిఫ్ట్ సిటీకి ఎందుకంత క్రేజ్..
గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (GIFT City) భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం(IFSC)గా వృద్ధిని నమోదు చేసింది. 2020 నాటికి 82 కంపెనీలున్న గిఫ్ట్ సిటీలో 2025 నాటికి వీటి సంఖ్య ఏకంగా 409 సంస్థలకు చేరింది. ఇందులో 23 బ్యాంకులు, 177 ఫండ్ మేనేజ్మెంట్ సంస్థలు, 200కు పైగా ఇతర ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు ఉన్నాయి. ఈ అసాధారణ వృద్ధికి దోహదపడిన ప్రధాన కారణాలు చూద్దాం.అభివృద్ధికి కారణాలుగిఫ్ట్ సిటీ ఇంతలా అభివృద్ధి చెందడానికి ప్రధానంగా రెండు అంశాలు కీలకం. ఒకటి ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహకాలు. రెండు.. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు. గిఫ్ట్ సిటీలో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిన అపారమైన పన్ను మినహాయింపులు కలిసొచ్చిన అంశం. పదేళ్లపాటు ఐఎఫ్ఎస్సీ యూనిట్లకు 100% ఆదాయ పన్ను మినహాయింపు ఇస్తున్నారు. విదేశీ కరెన్సీ రుణాలపై వడ్డీకి విత్‌హోల్డింగ్ పన్ను ఉండదు. గిఫ్ట్ సిటీ యూనిట్లకు అందించే లేదా వాటి నుంచి పొందే సేవలకు జీఎస్టీ వర్తించదు.నిర్దిష్ట లావాదేవీలు, మూలధన లాభాల పన్నుపై కూడా రాయితీలు లభిస్తాయి. గుజరాత్ ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని కూడా రద్దు చేసింది. ఈ ఆర్థిక ప్రోత్సాహకాల కారణంగా గిఫ్ట్ సిటీ అంతర్జాతీయ ఆర్థిక కేంద్రాలైన సింగపూర్, దుబాయ్ వంటి వాటి కంటే తక్కువ నిర్వహణ వ్యయాన్ని కలిగి ఉంది. దాంతో ఇది అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తోంది.నియంత్రణ సులభతరంఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ (IFSCA) స్థాపనతో బ్యాంకింగ్, బీమా, మూలధన మార్కెట్లు వంటి అన్ని ఆర్థిక సేవల నియంత్రణను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చారు. ఇది సింగిల్ విండో క్లియరెన్స్‌ల ద్వారా వ్యాపారాన్ని స్థాపించడం, నిర్వహించడం సులభతరం చేస్తుంది.ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలువ్యాపార సంస్థలు తక్షణమే కార్యకలాపాలు ప్రారంభించడానికి వీలుగా అత్యాధునిక ఆఫీస్ స్పేస్‌లు, నివాస గృహాలు ఏర్పాటు చేశారు. భారతదేశంలోనే మొట్టమొదటి డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్(ఒకే చోటు నుంచి అండర్ వాటర్ పైపుల ద్వారా విభిన్న భవనాలకు కూల్ వాటర్ సదుపాయం), భూగర్భ యుటిలిటీ టన్నెల్, ఆటోమేటెడ్ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ వంటి అత్యాధునిక సాంకేతిక మౌలిక సదుపాయాలు సిద్ధం చేశారు. ఇక్కడ నివాస, వాణిజ్య ప్రాంతాలు దగ్గరగా ఉండటం ఉద్యోగుల జీవన నాణ్యతను పెంచుతుంది.గుజరాత్‌కు ఉన్న ప్రత్యేక అవకాశాలుసముద్ర తీరం, పోర్ట్ కనెక్టివిటీగుజరాత్ పొడవైన తీర రేఖను కలిగి ఉంది. ఇది సుమారు 1600 కిలోమీటర్లు. ఈ భౌగోళిక ప్రయోజనం కారణంగా గుజరాత్లో దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఓడరేవులు ఉన్నాయి (ముంద్రా, కాండ్లా). ఇది అంతర్జాతీయ వాణిజ్యం, లాజిస్టిక్స్‌కు గుజరాత్‌ను కేంద్రంగా నిలుపుతుంది. గిఫ్ట్ సిటీలో స్థాపించబడే అంతర్జాతీయ వాణిజ్య ఫైనాన్స్ సంస్థలకు, మెరైన్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఈ పోర్ట్ కనెక్టివిటీ ఒక సహజమైన వ్యాపార అవకాశాన్ని అందిస్తుంది.పరిశ్రమలుపెట్రోలియం, పెట్రోకెమికల్ రిఫైనరీలు, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, డైమండ్స్ వంటి విభాగాల్లో గుజరాత్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ వైవిధ్యభరితమైన పరిశ్రమలు గిఫ్ట్ సిటీలోని ఆర్థిక సంస్థలకు స్థిరమైన వ్యాపార డిమాండ్‌ను సృష్టిస్తున్నాయి.ఇదీ చదవండి: వీడియో వాంగ్మూలం ఇచ్చేందుకు రెడీ.. -
రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 14వేల ఉద్యోగాలు..
తైవానీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్ తమిళనాడులో రూ.15,000 కోట్ల తాజా పెట్టుబడిని ప్రకటించింది. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌తో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీగా ఉద్యోగ కల్పన జరగనుందని కంపెనీ తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 14,000 ఉద్యోగాలు లభిస్తాయని సంస్థ అంచనా వేస్తుంది.ఫాక్స్‌కాన్ చేయబోయే పెట్టుబడి విలువ ఆధారిత ఎలక్ట్రానిక్స్ తయారీ, ఆర్ అండ్ డీ ఇంటిగ్రేషన్, ఏఐ నేతృత్వంలోని అధునాతన టెక్ కార్యకలాపాలు, బ్యాటరీ టెక్నాలజీలు వంటి అత్యాధునిక రంగాలపై కేంద్రీకృతమై ఉంటుందని కంపెనీ తెలిపింది. వీటిపై దృష్టి పెట్టడం ద్వారా కంపెనీ ఉత్పాదకత, ఆవిష్కరణల్లో ముందంజలో ఉండాలని చూస్తోంది.ఆమోదాలు వేగవంతం చేయడానికి..ఈ పెట్టుబడి ప్రకటనలో అత్యంత ముఖ్యమైన అంశం ‘గైడెన్స్ తమిళనాడు’. ఇది భారతదేశంలోని మొదటి ఫాక్స్‌కాన్ డెస్క్ అవుతుంది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, ఫాస్ట్ ట్రాక్ ఆమోదాలను వేగవంతం చేయడానికి, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులను సమన్వయం చేయడానికి ఈ డెస్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. తమిళనాడు పరిశ్రమల శాఖ ఈ ప్రాజెక్ట్‌కు పూర్తి మద్దతు ఇస్తుంది. సింగిల్ విండో ఫెసిలిటేషన్ ద్వారా ఆమోదాలను వేగవంతం చేస్తుంది. టాలెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లు, ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేషన్ మెకానిజమ్‌ల ద్వారా మానవ వనరుల అవసరాలను తీర్చడంలో కూడా ప్రభుత్వం సహకరిస్తుంది. ఫాక్స్‌కాన్ కంపెనీ ఇండియాలో యాపిల్ ఉత్పత్తులు తయారు చేస్తోంది.ఇదీ చదవండి: ముందుంది మొసళ్ల పండుగ! ఈరోజు కేజీ వెండి రూ.2 లక్షలు! -
మీ సమయాన్ని ఆదాచేసే 7 ఉచిత పీడీఎఫ్ టూల్స్
టూల్స్ ఎప్పుడైనా పీడీఎఫ్ ఫైలుతో మీరు విసిగిపోయారా? పీడీఎఫ్ ఫైల్ ఫార్మాట్‌ను మనం విరివిగా ఉపయోగిస్తున్నా కూడా.. అది కొన్నిసార్లు మనల్ని చాలా విసిగిస్తుంటుంది. పీడీఎఫ్ కేవలం చదవడమే అయితే ఈజీనే. కానీ, దాన్ని క్రియేట్ చేయడమో లేక ఎడిట్ చేయడమో చేయాలంటే కొన్నిసార్లు తలప్రాణం తోకకొస్తుంటుంది. ఇంతకుమించిన పనులేమైనా పీడీఎఫ్‌తో చేయాలంటే.. ఆ పని ఎక్కడో చోట ఆగినా ఆగిపోతుంది. అదష్టవశాత్తూ వెబ్‌లో మనకు ఎన్నెన్నో పీడీఎఫ్ పనిముట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో అందరికీ పెద్దగా తెలియని ఉపయుక్తమైన టూల్స్ మీ కోసం. వీటిలో సాదాసీదా ఎడిటింగ్, క్రియేటింగ్ గురించి కాకుండా కొన్ని కొత్త సంగతులకు సంబంధించిన వాటినే వివరించాం.. జొటి మాల్వేర్ స్కాన్ EXE , ZIP ఫైల్లో వైరస్లు దాక్కొని ఉండే అవకాశముందని మనకు తెలిసిందే. కానీ పీడీఎఫ్‌లలో కూడా అంతర్గతంగా వైరస్లు ఉండే చాన్స్ ఉందని ఎంత మందికి తెలుసు? అలా ఏదైనా పీడీఎఫ్‌లో వైరస్ ఉందా అని చెక్ చేయాలంటే ఈ జొటి మాల్వేర్ స్కాన్ బాగా ఉపయోగపడుతుంది. ఈ వెబ్సైట్లోకి మీ ఫైలును అప్లోడ్ చేస్తే అది 20కిపైగా వేర్వేరు మాల్వేర్ స్కానర్లతో పరీక్షిస్తుంది. కేవలం క్షణాల్లోనే ఫలితం చూపిస్తుంది. ఆన్లైన్ ఓసీఆర్ మీరు ఓ పీడీఎఫ్ ఫైలు నుంచి ఒక పారాను టెక్ట్స్ రూపంలో కాపీ చేసుకోవాలనుకున్నారు. కొన్ని రీడర్లలో ఈ పని చాలా సులువుగా అయిపోతుంది. కానీ కొన్నిసార్లు మాత్రం చాలా చికాకు తెప్పిస్తుంది. దీనికి సరైన సలహా.. ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ (ఓసీఆర్) టూల్ వాడడమే. ఇది ఫైలులోని ప్రతి క్యారెక్టర్‌నూ టెక్ట్స్ రూపంలో మార్చి అందిస్తుంది. చూడ్డానికి పీడీఎఫ్‌ను వర్డ్ లోకి కన్వర్ట్ చేసినట్లు అనిపించవచ్చుగానీ.. నిజానికి ఇది కొంచెం వేరే ప్రక్రియే. ఇందులో కేవలం టెక్ట్స్ మాత్రమే కన్వర్టవుతుంది. ఇది కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. డిఫ్ నౌ మీరు ఎప్పుడైనా ఒకే ఫైలుకు సంబంధించి రెండు వర్షన్లు అందుకొని వాటిలో ఏం మార్పు జరిగిందబ్బా అని ఆలోచించే పరిస్థితి ఎదుర్కొన్నారా? అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఫైళ్లను డిఫ్ నౌ లోకి అప్లోడ్ చేస్తే.. ఏమేం మార్పులు జరిగాయో అది ఇట్టే చెప్పేస్తుంది. ఏం కలిపారు? ఏం తీసేశారు? ఏం మార్చారు? అన్న వివరాలు తెలియజేస్తుంది. హెచ్‌టీఎంఎల్ టు పీడీఎఫ్ ఏదైనా వెబ్ పేజీని పీడీఎఫ్‌లో సేవ్ చేసుకోవాలంటే ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ఈ ఆన్లైన్ టూల్‌లోకి మీరు కోరుకున్న యూఆర్ఎల్ ఇచ్చి పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడమే. అలాంటి మరికొన్ని టూల్స్: పీడీఎఫ్ ప్రొటెక్ట్, పీడీఎఫ్ అన్‌లాక్, పీడీఎఫ్ కంప్రెస్... వీటి పేరును బట్టి అవి ఎందుకు ఉపయోగపడతాయో అర్థమైపోతుందిగా. -razesh007@gmail.com


