core committee meet
-
కష్టపడితే తెలంగాణలో అధికారం మనదే: అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: నేతలంగా కష్టపడితే తెలంగాణలో అధికారం బీజేపీదేనని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరాలని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి అమిత్ షా ఆకాంక్షించారు. శనివారం హైదరాబాద్ పర్యటన సందర్భంగా.. శంషాబాద్ నోవాటెల్ హోటల్లో బీజేపీ కోర్ కమిటీ భేటీకి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా.. తెలంగాణలో పార్టీ పరిస్థితిని నేతలంతా అమిత్ షాకు వివరించగా, ప్రతిగా ఆయన నేతలకు రాజకీయ దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్తో పోటీ, బీజేపీకి అవకాశాలపై అమిత్ షాకు వివరణ ఇచ్చారు నేతలు. గత రెండేళ్లుగా పార్టీ అన్ని విషయాల్లో మెరుగుపడిందన్న బీజేపీ నేతలు.. పార్లమెంట్, దుబ్బాక, గ్రేటర్, హుజురాబాద్ ఎన్నికల ప్రస్తావన అమిత్ షా దగ్గర తీసుకొచ్చారు. ఆపై మీడియాలో వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక కథనాలను ఆయనకు చూపించారు. ప్రాంతాల వారీగా పార్టీ పరిస్థితిని అమిత్‌షాకు వివరించిన నేతలు.. ఈ క్రమంలో నియోజకవర్గానికి ముగ్గురు ఆశావహుల పేర్లను సిద్ధం చేస్తున్నట్లు నేతలు అమిత్ షాకు వివరించారు. ఈ సందర్భంగా.. ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని, కష్టపడితే తెలంగాణలో అధికారం బీజేపీదేనిన నేతలతో అమిత్‌షా పేర్కొన్నట్లు తెలుస్తోంది. అందరూ కలిసి పని చేయాలని నేతలకు సూచించారాయన. తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. టీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టాలని, ముఖ్యంగా కేంద్రం ఏం చేయలేదన్న వాదనకు గట్టి కౌంటర్ ఇవ్వాలని తెలిపారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు గురించి తెలుసుకున్న అమిత్ షా.. తెలంగాణలో బీజేపీ పరిస్థితి చాలా బాగుందని కితాబిచ్చారు. -
రాఫెల్ డీల్ : కోర్ గ్రూప్‌తో రాహుల్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాఫెల్ డీల్‌పై పోరాటం ఉధృతం చేసేందుకు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గురువారం పార్టీ కోర్ గ్రూప్‌తో భేటీ కానున్నారు. గ్రేట్ రాఫెల్ రాబరీగా ఈ డీల్‌ను అభివర్ణిస్తున్న కాంగ్రెస్ పార్టీ దీనిపై మోదీ సర్కార్‌పై దాడిని తీవ్రతరం చేసే వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనుంది. భేటీ అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రధాని నివాసం వరకూ యూత్ కాంగ్రెస్ చేపట్టే నిరసన యాత్రలో నేతలు పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాఫెల్ ఒప్పందంపై అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు నూతనంగా ఏర్పాటైన పార్టీ కోర్ గ్రూప్ కమిటీ రాహుల్ నివాసంలో భేటీ కానుంది. రాఫెల్ అంశంపై గత కొంతకాలంగా రాహుల్ గాంధీ సహా పార్టీ ముఖ్య నేతలు మోదీ సర్కార్‌పై దాడిని పెంచారు. ఈ ఒప్పందంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీచే విచారణ జరిపించాలని పట్టుబట్టారు. స్కామ్‌ను మరో స్కామ్‌తో కప్పిపుచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. రాఫెల్ డీల్‌పై పార్లమెంటరీ కమిటీచే విచారణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని కాంగ్రెస్ నిలదీసింది. -
రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపై వాడివేడి చర్చ!
-
రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపై వాడివేడి చర్చ!
ఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వంపై వాడివేడిగా చర్చ కొనసాగుతోంది. బీజేపీ తమ ప్రధాని అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రకటించి ముందంజలో ఉండగా , కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి విషయంలో మల్లగుల్లాలు పడుతోంది. రాహుల్ ను ప్రధానిగా ప్రకటించాలా?వద్దా?అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. కాగా రాహుల్ మాత్రం ఏ బాధ్యతనైనా చేపట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో బుధవారం కాంగ్రెస్ కోర్ కమిటీ మరోసారి సమావేశమైంది. ఈ భేటీకి రాహుల్ తో పాటు, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సుశీల్ కుమార్ షిండే, ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్ సమావేశమైయ్యారు. జనవరి 17వ తేదీ శుక్రవారం జరుగునున్నఏఐసీసీ భేటీలో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తారు. దీంతో ఈ రోజు జరిగే భేటీకీ ప్రాధాన్యత సంతరించుకుంది. కోర్ కమిటీ భేటీలో రాహుల్ కు అప్పగించే బాధ్యతలపై కాంగ్రెస్ పెద్దలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.