breaking news
colour games
-
కలర్ ప్రిడెక్షన్.. మనీ లాండరింగ్!
సాక్షి, సిటీబ్యూరో: ఈ– కామర్స్ సంస్థల ముసుగులో భారీ బెట్టింగ్ గేమింగ్‌కు పాల్పడిన కలర్ ప్రిడెక్షన్ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు (ఈడీ) లేఖ రాయాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఈ దందాలో పెద్దయెత్తున మనీ లాండరింగ్ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. వివిధ వెబ్సైట్ల ఆధారంగా దందా చేసిన దీని నిర్వాహకులు ఈ ఏడాది ఏడున్నర నెల్లోనే రూ.1100 కోట్లు టర్నోవర్ చేయడంతో పాటు రూ.110 కోట్లను విదేశాలకు తరలించేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా నగర పోలీసులు ఈడీని కోరనున్నారు. చైనాకు చెందిన బీజింగ్ టీ పవర్ సంస్థ సౌత్ఈస్ట్ ఏషియా ఆపరేషన్స్ హెడ్‌గా తమ జాతీయుడు యా హౌను నియమించింది. గుర్గావ్ కేంద్రంగా వ్యవహారాలు నడుపుతున్న ఇతగాడు ఢిల్లీ వాసులు ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్, నీరజ్ తులేలను డైరెక్టర్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. వీరంతా కలిసి ఈ– కామర్స్ సంస్థల ముసుగులో గ్రోవింగ్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సిలీ కన్సల్టింగ్ సర్వీసెస్, పాన్ యన్ టెక్నాలజీస్ సర్వీస్, లింక్‌యన్ టెక్నాలజీ, డాకీపే, స్పాట్‌పే, డైసీలింగ్ ఫైనాన్షియల్, హువాహు ఫైనాన్షియల్ ప్రైవేట్ లిమిటెడ్‌ల పేర్లతో ఆర్‌ఓసీలో రిజిస్టర్ చేశారు. ఇవన్నీ కూడా ఆన్లైన్లో వివిధ ఈ– కామర్స్ వెబ్సైట్లు నడుపుతున్నాయి. వీటి ముసుగులో కలర్ ప్రిడెక్షన్ గేమ్‌ను వ్యవస్థీకృతంగా సాగిస్తున్నారు. ఈ గేమ్‌కు సంబంధించిన పేమెంట్ గేట్ వే అయిన పేటీఎం, గూగుల్ పే ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో నెట్‌బ్యాంకింగ్ ద్వారానూ చేపట్టారు. బెట్టింగ్‌కు సంబంధించిన తొలుత డాకీ పే సంస్థకు వెళుతోంది. అక్కడి నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాలోకి వెళ్లినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇది అంతర్జాతీయ బ్యాంకు కావడంతో ఆ ఖాతాల్లోని నగదు హాంకాంగ్, సింగపూర్‌ల్లోని కొన్ని ఖాతాల్లోకి మళ్లినట్లు తేల్చారు. ఇలా రూ.1100 కోట్ల టర్నోవర్‌లో రూ.110 కోట్లు వెళ్లినట్లు ఆధారాలు లభించాయి. మిగిలిన మొత్తం కూడా విదేశాలకే తరలించేసి ఉంటారని సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. వివిధ మార్గాల్లో ఈ నగదు బీజింగ్ టీ పవర్ సంస్థ చేరినట్లు భావిస్తున్నారు. ఈ వ్యవహారాల నిగ్గు తేల్చడానికి ఈడీ రంగంలోకి దిగాల్సి ఉంది. ఈ మేరకు ఎఫ్ఐఆర్తో పాటు ఇతర పత్రాలను అందిస్తూ ఈడీకి లేఖ రాస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన నలుగురు నిందితుల్నీ కస్టడీలోకి తీసుకుని విచారణ చేయనున్నారు. ఆ తర్వాతే సమగ్ర వివరాలతో ఈడీకి అధికారికంగా సమాచారం ఇవ్వనున్నారు. -
10న ‘సాక్షి’ ముగ్గుల పోటీలు
హిందూపురం అర్బన్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ‘సాక్షి’ నేతృత్వంలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు, వంటల పోటీలు నిర్వహిస్తోంది. ముగ్గుల పోటీలు ఈనెల 10న స్థానిక ఎంజీఎం క్రీడా మైదానంలో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తారు. అదేవిధంగా 12న టీటీడీ కల్యాణ మండపంలో సంప్రదాయ వంటల పోటీలు కూడా ఏర్పాటు చేశారు. ముగ్గుల పోటీల్లో మొదటి బహుమతిగా డబుల్‌కాట్ మంచం, రెండో బహుమతి టీక్ సోఫా, మూడో బహుమతి కింద డ్రస్సింగ్ టేబుల్ ఇస్తారు. అలాగే వంటల పోటీల విజేతలకు మొదటి, రెండు, మూడో బహుమతులుగా ఫ్రిజ్, గ్రైండర్ మిత్ మిక్సీ, కిచెన్ సెట్ ప్రదానం చేస్తారు. అంతేకాకుండా పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు ఆసక్తికరమైన బహుమతి అందిస్తారు. అవకాశాన్ని నియోజవకర్గంలోని మహిళలందరూ వినియోగించుకోవాలని నవీన్‌నిశ్చల్ కోరారు. ఆసక్తి ఉన్న వారు 94926 23677, 94409 75934, 97049 28123, 94412 80211 నంబర్లకు ఫోన్ చేసి తమ పేర్లు, చిరునామా, ఫోన్ నంబరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.