breaking news
coca cola cricket cup
-
సెయింట్ జాన్స్‌కు టైటిల్
జింఖానా, న్యూస్‌లైన్: కోకాకోలా క్రికెట్ కప్‌ను సెయింట్ జాన్స్ చర్చ్ జూనియర్ కాలేజి కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో సెయింట్ జాన్స్ 9 వికెట్ల తేడాతో వెస్లీ బాయ్స్ కాలేజిపై నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్లీ బాయ్స్ జూనియర్ కాలేజ్ జట్టు 160 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. జట్టులో శ్రీనాథ్ (51), వినీత్ రెడ్డి (61) అర్ధ సెంచరీలు సాధించి చక్కని ప్రదర్శన కనబరిచారు. సెయింట్ జాన్స్ బౌలర్స్ మిఖిల్ జైస్వాల్ 3 వికెట్లు, రిత్విక్ 4 వికెట్లు తీసుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన సెయింట్ జాన్స్ కేవలం ఒక్క వికెట్ నష్టానికి 161 పరుగులు చేసి విజయం సాధించింది. మిఖిల్ జైస్వాల్ 58 పరుగులు చేయగా, భగత్ వర్మ 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టోర్నీ అంతటా ఉత్తమ ప్రతిభ కనబరిచిన శ్రీ చైతన్య స్కూల్ జట్టు ఆటగాడు యష్ కపాడియా బెస్ట్ బ్యాట్స్‌మెన్ ట్రోఫీ అందుకోగా, బెస్ట్ బౌలర్ అవార్డు సెయింట్ జాన్స్ ఆటగాడు సీహెచ్ రిత్విక్ దక్కించుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ టైటిల్స్‌ను సెయింట్ జాన్స్ చర్చ్ ఆటగాడు మిఖిల్ జైస్వాల్ సొంతం చేసుకున్నాడు. టైటిల్ విన్నర్‌కు హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు జి. వినోద్ బహుమతిని అందించారు. -
12 నుంచి కోకాకోలా క్రికెట్ కప్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 12 నుంచి కోకాకోలా క్రికెట్ కప్ జరగనుంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ), కోకాకోలా సంస్థలు సంయుక్తంగా ఈ అండర్-16 స్కూల్ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నాయి. పాఠశాల స్థాయిలో ప్రతిభావంతులైన క్రికెటర్లను ప్రోత్సహించేందుకు ఈ టోర్నీని నిర్వహిస్తున్నట్లు కోకాకోలా బెవరేజెస్ ఏపీ జోనల్ ఉపాధ్యక్షుడు గౌరవ్ చతుర్వేది ఒక ప్రకటనలో తెలిపారు. తమ సత్తా నిరూపించుకునేందుకు స్కూలు క్రికెటర్లకు ఇది గొప్ప అవకాశమని హెచ్‌సీఏ కార్యదర్శి ఎం.వి.శ్రీధర్ అన్నారు. టోర్నీలో పాల్గొనేందుకు నగరంలోని 64 స్కూ ల్ జట్లు ఎంట్రీలను పంపాయి. జింఖానాతో పాటు వివిధ మైదానాల్లో 12వ తేదీ నుంచి 28వ తేదీ వరకు క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నీ... నాకౌట్ పద్ధతిలో అనంతరం సూపర్ లీగ్ పద్ధతిలో జరుగుతుంది. ఫైనల్లో గెలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు రూ.50 వేలు, రన్నరప్‌కు రూ. 35 వేలు అందజేస్తారు.