breaking news
coach Indian team
-
ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడినందుకు...
వడోదర: భారత క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయే వార్త... ఆటగాడిగా, కోచ్‌గా సుదీర్ఘ అనుభవం ఉన్న తుషార్ అరోథే (52) తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి బెట్టింగ్‌లో పాల్గొన్నందుకు అరోథేతో పాటు మరో 18 మందిని బరోడా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఒక హోటల్లో బెట్టింగ్ చేస్తున్నట్లు తెలియడంతో దాడి జరిపి వీరందరినీ పట్టుకున్నామని...వారి ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు వడోదర్ డీపీపీ (క్రైమ్) జేఎస్ జడేజా వెల్లడించారు. 2008, 2012లో ఆయన భారత మహిళల క్రికెట్ జట్టు కోచింగ్ బృందంలో సభ్యులుగా ఉన్నారు. అయితే తుషార్ పెద్ద ఘనత భారత జట్టును ప్రపంచ కప్ ఫైనల్ చేర్చడమే. 2017 వన్డే వరల్డ్ కప్‌లో ఆయన టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత జట్టులోని సభ్యులతో విభేదాల నేపథ్యంలో గత ఏడాది టి20 ప్రపంచ కప్‌కు ముందు అరోథే కోచ్ పదవి కోల్పోయారు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన అరోథే 18 ఏళ్ల కెరీర్లో 114 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 13 సెంచరీలు సహా 6105 పరుగులు చేశారు. పాకిస్తాన్లో ఐపీఎల్ నిషేధం! ఇస్లామాబాద్: తమ దేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లను ప్రసారం చేయరాదని పాకిస్తాన్ నిర్ణయించింది. మంగళవారం ఇక్కడ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లను తమ దేశంలో చూసేలా చేస్తూ భారత్ ‘వ్యూహాత్మకంగా’ పాక్ క్రికెట్‌ను దెబ్బ తీస్తోందని మంత్రివర్గం అభిప్రాయ పడింది. భారత దేశవాళీ టోర్నీని తమ వద్ద అనుమతించడంలో అర్థం లేదని ప్రసారశాఖ మంత్రి ఫవాద్ చౌదరి అన్నారు. పుల్వామా ఉదంతం తర్వాత అప్పట్లో జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌లను ‘డీ స్పోర్ట్స్’ భారత్‌లో ప్రసారం కాకుండా ఆపివేసింది. -
కోచ్‌గా చేసే తీరిక లేదు: గంగూలీ
న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టలేనని మాజీ సారథి సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. ఆ అవకాశం ఇచ్చినా తీసుకునే పరిస్థితి లేదన్నారు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో ఉద్యోగం ఇచ్చినా చేయలేను. ఎందుకంటే క్యాబ్ అధ్యక్షుడిగా క్రికెట్‌ను నడిపిస్తున్నా. కాబట్టి ఒకేసారి రెండు పనులను చేయడం సాధ్యం కాదు. ఈ క్షణమైతే కోచ్ పదవికి నో అనే చెబుతాను. క్రికెట్ పరిపాలకుడిగా నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఇక బీసీసీఐకి తదుపరి అధ్యక్షుడి విషయంపై ఏమీ చెప్పలేను. నేను ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలుపెట్టా. అది ఎక్కడికి వెళ్తుందో ఎక్కడ ముగుస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. అలాగని ఏ విషయాన్ని నేను తోసిపుచ్చలేను. అలా చేసుకుంటూ వెళ్లడమే నా ముందున్న పని. నేను వర్తమానంలో జీవిస్తా. ప్రస్తుత నాకున్న బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తా. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’ అని దాదా పేర్కొన్నారు. ప్రస్తుతానికి టీమిండియా బాగానే రాణిస్తుందని చెప్పిన సౌరవ్... భవిష్యత్‌లో అవసరమైతే కొత్త కోచ్ ఎంపికపై దృష్టిపెడతామన్నారు. అయితే కొత్త కోచ్ ఎంపికలో క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ) పని చేస్తుందో లేదోనన్నారు. జీవిత చరిత్ర రాసేందుకు సమయం లభించడం లేదని, వృత్తిపరమైన, పరిపాలనపరమైన ఒప్పందాలతోనే రోజంతా గడిచిపోతోందన్నారు. విమర్శలను తీసుకోవడంలో వన్డే కెప్టెన్ ధోని చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నాడని దాదా అన్నారు.