breaking news
CM panneer Selvam
-
‘కావేరి’ రగడ!
* కర్ణాటకలో రెండు కొత్త డ్యాంలు * అడ్డుకట్ట కసరత్తుల్లో సీఎం పన్నీరు సెల్వం * అఖిలపక్షానికి కరుణ పిలుపు సాక్షి, చెన్నై: కావేరి జల వివాదం తమిళనాడు, కర్ణాటకల మధ్య మళ్లీ తాండవం చేయబోతున్నది. తమిళనాడుకు వచ్చే నీటిని అడ్డుకోవడమే లక్ష్యంగా ఆ రాష్ర్టంలో రెండు కొత్త డ్యాంలకు కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపట్టడం పుండు మీద కారం చల్లినట్టు అయింది. దీంతో డెల్టా అన్నదాతల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. తక్షణం అసెంబ్లీ సమావేశానికి, అఖిల పక్షానికి చర్యలు తీసుకోవాలని డీఎంకే అధినేత ఎం కరుణానిధి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కావేరి జల వివాదం కర్ణాటక, తమిళనాడుల మధ్య కొత్తేమీ కాదు. ఈ వివాదం ప్రతి ఏటా జఠిలం అవుతూనే ఉంది. ఈ వివాదం పరిష్కారమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ సైతం తమిళనాడుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో కావేరి నదీ జలాల మీద ఆధార పడ్డ డెల్టా జిల్లా అన్నదాతలు ఆనందంలో మునిగారు. అయితే, ఆ తీర్పును ధిక్కరించే రీతిలో కర్ణాటక సర్కారు, తీర్పును అమలు చేయించలేని పరిస్థితుల్లో కేంద్ర పాలకులు ఉండడం డెల్టా అన్నదాత పాలిట శాపంగా మారింది. కావేరి నదీ జలాల్ని సక్రమంగా విడుదల చేయని కర్ణాటక సర్కారు, వర్షాల రూపంలో వచ్చే ఉబరి నీటిని సైతం అడ్డుకునేందుకు రెడీ అయింది. మరో రెండు డ్యాంలు: గతంలో ఓ మారు కర్ణాటకలో విస్తారంగానే వర్షాలు కురిశాయి. దీంతో కృష్ణ రాజ సాగర్, కబిని డ్యాంలు నిండే స్థాయికి చేరడంతో ఆ నీళ్లు ఉబరి నీళ్లుగా తమిళనాడులోని మెట్టూరు డ్యాంకు చేరాయి. అయితే, తమిళనాడు మీద కన్నెర్ర చేసిన కర్ణాటక పాలకులు ఆ ఉబరి నీటిని అడ్డుకునేందుకు అప్పట్లో ప్రయత్నించారు. దీనిని అప్పటి డీఎంకే సర్కారు గట్టిగానే తిప్పి కొట్టింది. ప్రస్తుతం అదే బాటలో మళ్లీ పయనించే పనిలో కర్ణాటక సర్కారు నిమగ్నం అయింది. రెండేళ్లుగా నైరుతీ, ఈశాన్య రుతుపవనాలు కర్ణాటకను కరుణిస్తుండడంతో, ఉబరి నీరు కావేరి నదిలో పరవళ్లు తొక్కుతూ తమిళనాడుకు వచ్చి చేరుతున్నాయి. ఆ నీరు మెట్టూరు డ్యాంకు చేరినప్పుడు మాత్రం నీటి సమస్య తీరడం, మిగిలిన సమయాల్లో జల సం కటం ఎదుర్కొనడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం వర్షాకాలంలో తమిళనాడుకు ఉబరి నీళ్లు వెళ్లకుండా అడ్డుకోవడానికి మేఘదాత్తు వద్ద రెండు డ్యాంల నిర్మాణానికి పరిశీలన పూర్తి చేసి, అందుకు తగ్గ చర్యల్లో కర్ణాటక నిమగ్నం కావడం మళ్లీ రెండు రాష్ట్రా ల మధ్య వివాదానికి ఆజ్యం పోసినట్టు అయింది. కర్ణాటక ఎత్తులతో షాక్: ఓ వైపు కేరళ వైఖరిపై తమిళనాడులోని దక్షిణాది జిల్లాల అన్నదాతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముల్లై పెరియార్ నీటి మట్టం పెంపు, పాంబన్ నీళ్లు అమరావతిలోకి రానివ్వకుండా చేయడం కోసం ఆ తీరంలో ఓ డ్యాం నిర్మాణానికి కేరళ చర్యలు చేపట్టడం అక్కడి అన్నదాతల్లో ఆగ్రహాన్ని రేపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేరళ బాణిలో కర్ణాటక సైతం తమిళనాడుకు నీళ్లు రాకుండా అడ్డుకునే పనిలో పడడం డెల్టా అన్నదాతల్లో ఆగ్రహ జ్వాలను రగుల్చుతోంది. చాప కింద నీరులా అన్ని చర్యల్ని చేపట్టి డ్యాం నిర్మాణానికి కర్ణాటక ప్రయత్నాలు వేగవంతం చేయడం తమిళనాడు ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే వరకు ఎలాంటి సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం సేకరించక పోవడం వారి వైఫల్యానికి అద్దం పడుతోంది. అఖిల పక్షానికి పిలుపు : కర్ణాటక అధికారిక ప్రకటనతో రెండు రాష్ట్రాల మధ్య ఆగ్రహ జ్వాల రాజుకునే అవకాశాలు అధికం అయ్యా యి. డెల్టా అన్నదాతలు తీవ్ర ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ రెండు డ్యాంలలో 44 టీఎంసీల చొప్పున నీళ్లు నిల్వ ఉంచే విధంగా నిర్మాణాలు సాగబోతుండడంతో ఇక డెల్టా జిల్లాలు కరువు ప్రాంతాలుగా మా రడం ఖాయం అన్న ఆందోళన అన్నదాతల్లో బయలు దేరింది. కర్ణాటక చర్యల్ని అడ్డుకోవాలంటే తక్షణం అఖిల పక్షానికి పిలుపు నివ్వాలని డీఎంకే అధినేత ఎం కరుణానిధి డిమాండ్ చేశారు. అసెంబ్లీని సమావేశ పరచి ఆ డ్యాంల నిర్మాణానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాలని సూచించారు. కేంద్ర మాజీ మంత్రి జీకేవాసన్ మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటక చర్యల్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, కాలయాపన చేస్తే మాత్రం తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు. సీఎం సమీక్ష: కర్ణాటక అధికారిక ప్రకటనతో అడ్డుకట్ట లక్ష్యంగా ప్రత్యామ్నాయ కసరత్తుల్లో సీఎం పన్నీరు సెల్వం ము నిగి ఉన్నారు. ఆగమేఘాలపై సచివాలయంలో ఆయ న అధికారులతో సమీక్షించారు. కర్ణాటక చేపట్టదలచి న నిర్మాణాలు, తద్వారా తమిళనాడుకు ఎదురయ్యే సంకట పరిస్థితులు తదితర అంశాలపై ఆరా తీశారు. కర్ణాటక చర్యల్ని అడ్డుకోవాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేసే పనిలో పడ్డారు. గతంలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు, తమకు కావేరి మీద ఉన్న హక్కుల్ని వివరి స్తూ, కావేరి పరిరక్షణ కమిటీ, కావేరి అభివృద్ధిబోర్డు ఏర్పాటు నినాదంతో, కర్ణాటక కొత్త డ్యాం ప్రయత్నాలకు అడ్డుకట్ట లక్ష్యంగా ప్రధానికి లేఖాస్త్రం సంధించే పనిలో పడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకునే అవకాశాలు కన్పిస్తుండడంతో భద్రతను సరిహద్దుల్లో పెంచారు. కర్ణాటక బస్సులకు భద్రత కల్పించే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు. -
దీపావళి కానుక
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకను ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను ఏడు శాతం పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు 18 లక్షల మందికి వర్తించేలా చర్యలు తీసుకుంది. ఈ మేరకు సీఎం ఓ పన్నీరు సెల్వం ఆదేశాలు జారీ చేశారు. * ఉద్యోగులకు ఏడు శాతం డీఏ పెంపు * 18 లక్షల మందికి వర్తింపు * సీఎం పన్నీరు సెల్వం ఆదేశం వారిలో బయలుదేరింది. అలాగే రాష్ట్రంలో నెలకొ న్న పరిస్థితులు, మాజీ ముఖ్యమంత్రి జయలలిత కటకటాల్లోకి వెళ్లడం, ఓ పన్నీరు సెల్వం నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో డీఏ పెంపు నిర్ణయం ఇప్పట్లో అమలయ్యేనా? అన్న ప్రశ్న బయలుదేరింది. ఈ క్రమంలో శుక్రవారం సచివాలయంలో మంత్రులు నత్తం విశ్వనాథన్, వైద్యలింగం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహ న్ వర్గీస్ సుంకత్, సలహాదారు షీలా బాలకృష్ణన్‌తో సీఎం పన్నీరు సెల్వం సమావేశమయ్యారు. డీఏ పెంపుపై చర్చించారు. అమ్మ(జయలలిత) అడుగు జాడల్లో నడుస్తున్న ఈ ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు ఓ పన్నీరు సెల్వం ప్రకటించారు. రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీటుగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ పథకాల్ని సక్రమంగా అమలు చేయడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని ప్రశంసించారు. ప్రభుత్వం, ప్రజల కోసం శ్రమిస్తున్న ఉద్యోగులకు డీఏను ఏడు శాతం పెంచుతున్నామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్‌దారులు, కుటుంబం పెన్షన్‌దారులు, ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న స్థానిక సంస్థలు, అంగన్వాడీ, గ్రామ అసిస్టెంట్లు, పౌష్టికాహార పథకం తదితర విధుల్లో ఉన్న 18 లక్షల మంది ఉద్యోగులకు ఈ డీఏ పెంపు వర్తిస్తుందని వివరించారు. ఈ ఏడాది జూలై నుంచి పెంపు వర్తింప చేస్తున్నామని ప్రకటించారు. ఈ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వం మీద 1558.97 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా తమకు డీఏ పెంచడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశారుు. పండుగ కానుకగా ఈ పెంపును ప్రకటించడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.