breaking news
Cilantro
-
కసకస కోసేస్తుంది!
కొత్తిమీర, కరివేపాకు వేయకుండా వంటకం పూర్తవుతుందా? పూర్తి చేసినా మీవారికి, పిల్లలకు నచ్చుతుందా? అందుకే ఏది మిస్సయినా మీరు కచ్చితంగా వాటిని మిస్సవరు. అయితే వాటిని ముక్కలు చేయకుండా వేస్తే ఆ వాసన అంత బాగా వంటకానికి పట్టదు. ముక్కలు చేయాలంటే అదంత తేలిక కూడా కాదు. ఆకుల్ని వరుసగా పేర్చి, చాకుతో కోసి, అప్పుడు కూరలో వేయాలి. అవి సరిగ్గా తెగవు. ఈలోపు చేయి మాత్రం తెగుతుంది. అలా చేతులూ వేళ్లూ కోసుకోకుండా మనకి సాయపడుతుంది ఈ ‘హెర్బ్ మిల్ గ్రైండర్’. ఈ గ్రైండర్కి కరెంటు అవసరం లేదు. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వంటి ఆకుల్ని ఇందులో వేసి, గట్టిగా బిగించి, ఒక్క తిప్పు తిప్పితే చాలు... అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా తెగిపోతాయి. కావాలంటే ఈ ఫొటో చూడండి... క్లారిటీ వస్తుంది. ఏ పార్టుకి ఆ పార్టు విడిపోతుంది కాబట్టి శుభ్రం చేసుకోవడం కూడా చాలా తేలిక. ధర మోడల్ని బట్టి రూ. 200 నుంచి రూ. 300 మధ్య ఉంది. ఆన్లైన్లో అయితే రూ. 250 దాటదు. -
ధనియాలకు తల్లి కొత్తిమీర...
తిండి గోల ధనియాలను రోజువారీ వంటల్లో వాడితే ఆరోగ్యానికి అదనంగా ధనం ఖర్చుపెట్టాల్సిన అవసరం పడదు అని చెప్పడానికేమో మన పూర్వీకులు వీటికా పేరు పెట్టి ఉంటారు. 14వ శతాబ్దంలో కొరియండర్ అని ఆంగ్లేయులు నామకరణం చేసిన కొత్తిమీర గడ్డిభూములలో విస్తారంగా ఎదిగేది. ఈ మొక్క గింజలే ధనియాలు. దాదాపు 5 వందల ఏళ్ల క్రితం ఉత్తర అమెరికాలో స్థిరపడిన బ్రిటిషర్లు కొత్తిమీర సాగు చేసి ధనియాల రుచిని అక్కడి వారికి పరిచయం చేశారు. అయితే, కొత్తిమీర మూలాలు క్రీస్తు పూర్వమే గ్రీసు దేశంలోనే ఉన్నాయని, సాగుబడిలో అటు తర్వాత ఇవి ప్రపంచమంతటా విస్తరించాయని చరిత్రకారులు చెబుతున్నారు. వివాదాలు ఎలా ఉన్నా కొత్తిమీర ఆకులు, కొత్తిమీర గింజలు వంటలకు అమోఘమైన రుచిని తీసుకువస్తాయి. ప్రపంచంలో భారత దేశ మసాలా వంటకాలు, థాయ్ వంటకాలలో కొత్తిమీర, ధనియాలను విరివిగా ఉపయోగిస్తారు. అజీర్తిని నివారించడంలో అమోఘంగా పనిచేసే ధనియాలు, కొత్తిమీరలో పీచు, కాల్షియం, ఇనుము, మెగ్నిషియం పాళ్లు ఎక్కువే. కొత్తిమీర ఆకులు, పువ్వుల వాసన పీలిస్తే మైగ్రెయిన్ వంటి తలనొప్పి బాధల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.