breaking news
cigerians
-
సిజేరియన్ తర్వాత మహిళల ప్రధాన సమస్య ఇదే!
సాధారణంగా సిజేరియన్ తర్వాత మహిళలు బరువు పెరుగుతారనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. నిజానికి సిజేరియన్కూ, బరువు పెరగడానికీ ఎలాంటి సంబంధం లేదు. ఏమాత్రం శారీరక శ్రమలేకపోవడం వల్ల లేదా మరికొన్ని ఇతరత్ర అంశాల వల్లనూ కావచ్చు. సిజేరియన్ తర్వాత బరువు పెరగకుండా ఉండేందుకు... డాక్టర్లు ప్రత్యేకంగా విశ్రాంతి తీసుకోవాలని సూచించిన మహిళలు తప్ప... మిగతావారంతా సిజేరియన్ అయిన పదిహేను రోజుల తర్వాత నుంచే నడక లేదా శరీరంపై భారం, అలసట వంటివి పడకుండా తేలికపాటి వ్యాయామాలు చేయాలి.నడక మొదలు పెట్టినప్పుడు రోజుకు కేవలం పదినిమిషాలు మాత్రమే నడవాలి. అలా నడుస్తూ మెల్లగా తాము నడిచే కాలవ్యవధిని క్రమంగా పెంచుకుంటూ పోవాలి. ఇలా చేస్తూ పోతే మూడు నెలల నుంచి మహిళలు ఆరోగ్యకరంగా మారి ఎనిమిది నెలల తర్వాత నుంచి తమ అదనపు కొవ్వు కోల్పోవడం జరుగుతుంది. పిల్లలకు చనుబాలు ఇవ్వడం వల్ల కూడా బరువు పెరగకుండా ఉంటారు. చదవండి: ఒబెసిటీ.. అధిక బరువే కాదు అంతకు మించి -
కాసుల కోసం కోతలు
– ప్రయివేటు ఆస్పత్రుల్లో అడ్డదిడ్డంగా సిజేరియన్లు – గర్భిణుల అవగాహనలేమే వారికి అవకాశం – మానసిక రుగ్మతలు తప్పవంటున్న వైద్యనిపుణలు సాక్షి, చిత్తూరు : కార్పొరేట్ ఆస్పత్రుల ధన దాహానికి హద్దుండడం లేదు. కాసుల కోసం కక్కుర్తి పడుతున్నాయి. గర్భిణులకు అవసరం లేకున్నా సిజేరియన్లు చేస్తూ తల్లీబిడ్డలతో చెలగాటమాడుతున్నారు. అవగాహన లేమిని అవకాశంగా తీసుకుని అడ్డదిడ్డంగా కోతలు పెడుతున్నారు. ప్రభుత్వమూ ఉదాసీనంగా వ్యవహరించడంతో వారి ఆగడాలకు అంతంలేకుండా పోతోంది. పిల్లలు పుట్టే సమయంలో అవసరం లేకున్నా.. సిజేరియన్లు చేస్తుండడంతో మహిళలు అనారోగ్యం పాలవుతున్నారు. జిల్లాలో సుమారు 50 శాతానికి పైగా సిజేరియన్ ఆపరేషన్ ద్వారానే ప్రసవాలు జరుగుతున్నాయి. ఈ శస్త్ర చికిత్సలన్నింటికీ దాదాపు ప్రై వేటు ఆసుపత్రులే వేదికలవుతున్నాయి. వాస్తవానికి అత్యవసర సమయాల్లో మాత్రమే శస్త్ర చికిత్స నిర్వహించి పురుడు పోయాల్సి ఉంటుంది. గర్భిణులని ఒక రోజు పాటు పరిశీలనలో ఉంచి ఆ తర్వాత అవసరం అనుకుంటే సిజేరియన్ చేయాలని నిబంధనలు ఉన్నా ప్రయివేటు ఆస్పత్రులు వాటిని ఖాతరు చే యడం లేదు. సాధారణంగా గర్భం దాల్చినప్పటి నుంచి నార్మల్ డెలివరీనా.. సిజేరియనా అనే ఆందోళన గర్భిణులలో కన్పిస్తోంది. దీన్నే ప్రై వేటు ఆసుపత్రులు తమ వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నాయి. తప్పదు చేయించుకోవాల్సిందే ‘కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. సిజేరియన్ చేయకపోతే తల్లి,బిడ్డ ప్రాణాలకే ముప్పు’ అంటూ మరీ హెచ్చరించి ప్రై వేటు ఆసుపత్రులు ఆపరేషన్లు చేస్తున్నాయి. వీటిపై అంతగా అవగాహనలేని గర్భిణులు భయంతో చేసేదేమిలేక సిజేరియన్ల వైపై మొగ్గుచూపుతున్నారు. ప్రై వేటు ఆసుపత్రుల్లోనే నెలలో కనీసం 2500 సిజేరియన్లు చేస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సిజేరియన్ ఎప్పుడు చేయాలంటే –బిడ్డ బయటకు వచ్చే మార్గం దగ్గర ‘పెల్విస్’ అనే ఎముక ఉంటుంది. ఈ ఎముక నిర్మాణం చిన్నగా ఉంటే ఆపరేషన్ అవసరం అవుతుంది. – సాధారణంగా బిడ్డ బరువు 3 కిలోల కంటే తక్కువ ఉంటుంది. బిడ్డ బరువు 4 కిలోలు ఉంటే సిజేరియన్ తప్పనిసరి. – గర్భాశయ ముఖ ద్వారాన్ని ప్లసెంటా పూర్తిగా కప్పి వేయడం వల్ల రక్తస్రావం అధికంగా జరగొచ్చు. దీన్ని ఫ్లసెంటా ఫీలియా అంటారు. ఇది తల్లీ, బిడ్డ ప్రాణాలకు ప్రమాదం. ఈ సమయంలో సిజేరియన్ కచ్చితంగా చేయాలి – ప్రసవ సమయంలో తలపైకి, కాళ్లు కిందికి ఉంటే..తలకు బదులుగా కాళ్లు ముందు బయటకు వస్తాయి. ఇలాంటప్పుడు శస్త్ర చికిత్స అవసరం. – గతంలో గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చేసినట్లయితే సిజేరియన్ అవసరం అవుతుంది. దీనికి తోడు గర్భిణి బీపీ, డయాబెటిస్ సమస్యలు ఉన్నట్లయితే ఆపరేషన్ చేయాలి. అనవసరం ..అనారోగ్యం సిజేరియన్ ఆపరేషన్లతో మహిళలకు శారీరక, మానసిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. తొలి కాన్పు సిజేరియన్ అయితే.. మలి కాన్పు 90 శాతం సిజేరియన్ ద్వారానే జరుగుతుంది. ఇది మరిన్ని రుగ్మతలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఆపరేషన్ జరిగే సమయంలో ఇచ్చే మత్తు మందు మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత ఆరునెలలుగా ప్రయివేటు ఆస్పత్రుల్లో జరిగని సిజేరియన్ల వివరాలు జనవరి.. 1000 ఫిబ్రవరి.. 800 మార్చి.. 1200 ఏప్రిల్.. 952 మే... 1002 జూన్... 677 జులై.. 1260 మొత్తం..6891 ప్రభుత్వ ఆసుపత్రుల్లో... జనవరి.. 510 ఫిబ్రవరి.. 473 మార్చి.. 525 ఏప్రిల్ 552 మే.. 524 జూన్ 500 జులై 509 మొత్తం –3593