breaking news
chittoor mp condidate
-
'జగన్ ప్రకటించిన పథకాలే నా విజయానికి శ్రీరామరక్ష'
-
'జగన్ ప్రకటించిన పథకాలే నా విజయానికి శ్రీరామరక్ష'
తిరుపతి : వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలే తనకు రాజకీయ ప్రేరణ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు పార్లమెంట్ అభ్యర్తి సామాన్య కిరణ్ అన్నారు. వైఎస్ లాంటి గొప్ప నాయకుడిని తాను ఎక్కడా చూడలేదని ఆమె బుధవారమిక్కడ పేర్కొన్నారు. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ దక్కాయని సామాన్య కిరణ్ తెలిపారు. చిత్తూరు జిల్లాతో తనకు చిన్ననాటి నుంచి అనుబంధం ఉందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన సంక్షేమ పథకాలే తన విజయానికి శ్రీరామరక్ష అన్నారు.