breaking news
childhood games
-
ఈ ఆట పేరేంటో మీకు గుర్తుందా?
గడిచిన కాలం ఎప్పుడూ అందంగానే ఉంటుంది. ప్రతి సందర్భంలోనూ ఒకప్పటి రోజులే బాగుండేవి అని అనుకుంటూ ఉంటాం. కొన్ని విషయాలు మనకు బాల్యాన్ని గుర్తు చేస్తాయి. వాటిని చూసి చిన్నప్పుడు మనం కూడా అలాగే చేసేవాళ్లం. అచ్చం ఇలాగే ఆడుకునేవాళ్లం అంటూ పాతరోజులను నెమరేసుకుంటాం. ఇంతకీ ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే ఓ బామ్మ తన మనవరాలితో కలిసి ‘కచ్చకాయలు’ ఆడుకుంటున్న వీడియో నెటిజన్లకు తమ చిన్ననాటి జ్ఙాపకాలను గుర్తు చేస్తోంది. (వైరల్: పాము నీళ్లు తాగడం చూశారా?) పిల్లలు తమ అమ్మమ్మ, తాతయ్యలతో ఎందుకు సమయం గడపాలి అంటే’ అంటూ ఓ వ్యక్తి షేర్ చేసిన ఈ వీడియోలో 60 ఏళ్ల వయసున్న బామ్మ తన మనవరాలతో కూర్చొని సరాదాగా కచ్చకాయలు/అచ్చన్న గిల్లలు ఆడుతోంది. ఆటను ఏకదాటిగా బామ్మ ఆడటాన్ని చూస్తున్న తన చిన్నారి మనవరాలు ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్న ఈ వీడియోను శుక్రవారం ట్విటర్లో పోస్ట్ చేయగా ఇప్పటికే 15 వేలమంది లైక్ చేశారు. అనేక మంది వారి అనుభవాలు, బాల్యానికి సంబంధించిన జ్ఞాపకాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. (జిరాఫీని రెచ్చగొడితే ఇలానే ఉంటుంది!) ‘హేయ్ నాకు ఈ ఆట తెలుసు. మా అమ్మ నాకు నేర్పించింది. ఒడిశాలోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ప్రతి ఇంట్లో ఈ ఆట ఆడతారని తెలుసు’. అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘నేటితరం పిల్లలు ఇలాంటి ఆటలను కోల్పోతున్నారు. దీనిని హర్యానాలో ‘ఘెట్’ అని పిలుస్తారు’. అని మరో నెటిజన్ పేర్కొన్నారు. కాగా దీనిని వివిధ ప్రాంతాల్లో అనేక ఇతర పేర్లతో పిలుచుకుంటారు. మరి మీరు ఈ ఆటను ఎప్పుడైనా ఆడారా.. అయితే ఈ వీడియోను చూసి ఆ మధురానుజ్ఙాపకాలను మరోసారి గుర్తుతెచ్చుకోండి. (చిన్నారి ఏడుపు.. పాలు అందించిన పోలీస్) -
హుషారెత్తించే ‘గోలీ’మార్
హలో ఫ్రెండ్స్ మీ పట్టణ, నగర ప్రాంతాల్లో ఏమో గానీ మా ఊళ్లో మాత్రం ఈ ఎండాకాలం సెలవుల్లో ఎన్నో ఆటలు ఆడుకుంటున్నాం. మేము ఆడుకునే ఆటల్లో ముఖ్యమైనది గోలీల ఆట. ఈ ఆట ఆడుతున్న కొద్దీ హుషారుగా ఉంటుంది. ఎందుకంటే మనతో పాటు ఆడేవారి గోలీలను గెలుచుకోవడం నిజంగా థ్రిల్లే కదా! ఆట అయిపోయే లోపు జేబు నిండా గోలీలు వేసుకుని నడుస్తుంటే వచ్చే గళగళ శబ్ధం వింటే ఏనుగు ఎక్కినంత సంబరంగా ఉంటుంది. మీరూ ఈ ఆట ఆడాలనుకుంటున్నారా? అయితే ముందుగా మీ స్నేహితులంతా కలిసి ఓ జట్టుగా ఏర్పడాలి. ముందుగా ఓ బొద్దిని (చిన్నపాటి గుంత) ఏర్పాటు చేసుకుని కొద్ది దూరం నుంచి బొద్ది వైపుగా గోలీలు వేయాలి. బొద్దికి దగ్గరగా ఉన్న వారు ఫస్ట్ ఆడాలి అన్నమాట. గోళీని మన చూపుడు వేలుకు ఆనించి వెనక్కు లాగి వదిలితే అది రాకెట్లా ముందుకు పోతుంది. ఇలా బొద్దిలోకి గోలీ వేసుకుంటే బోనస్ ఆట వస్తుంది. మనతో పాటు ఆడుతున్న వారి గోలీలను టార్గెట్ చేసి కొట్టుకుంటూ పోవాలి. తక్కువ పాయింట్లు తెచ్చుకున్న వారు బొద్ది వైపుగా తన గోలీని దోకాల్సి ఉంటుంది. లేదంటే ఒప్పందం మేరకు గోలీ ఇచ్చేయాల్సి ఉంటుంది. భలే గమ్మత్తుగా ఉంది కదూ...ఇంకెందుకు ఆలస్యం రండి గోలీలు ఆడుకుందాం. – గుమ్మఘట్ట