breaking news
Child sexual assault
-
ఆన్లైన్ ఆకతాయిలపై సైబర్ గస్తీ!
సాక్షి, హైదరాబాద్: బస్‌స్టాప్‌లు, కార్యాలయాలు, మార్కెట్లు, సినిమాహాళ్లు.. ఇతర రద్దీ ప్రాంతాల్లో మహిళలు, యువతులను వేధించే పోకిరీలను గతంలో ఎక్కువగా చూసేవాళ్లం. ఇప్పుడు సాంకేతికత పెరిగిన తర్వాత ఆన్లైన్ ఆకతాయిలు ఎక్కువయ్యారు. వాట్సప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్ వంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలపై అడ్డగోలుగా కామెంట్లు పెట్టడం.. వ్యక్తిగతంగా సందేశాలు పంపి విసిగిండం.. ఆన్లైన్లో అశ్లీల పనులు విపరీతంగా పెరిగాయి. ఇలాంటి ఆన్లైన్ ఆకతాయిల ఆట కట్టించేందుకు తెలంగాణ పోలీసులు ఆన్లైన్ గస్తీ నిర్వహిస్తున్నారు.పలు సోషల్ మీడియా ఖాతాలతోపాటు, టిండర్, ట్రూలీమ్యాడ్లీ, బుమ్లే వంటి డేటింగ్ యాప్‌లలో ఫేక్ ప్రొఫైల్స్‌తో ప్రవేశించి ఆన్లైన్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మహిళా భద్రత విభాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ సైబర్ ల్యాబ్ సిబ్బంది అత్యాధునిక సాంకేతికత, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను వినియోగించి ‘హద్దుదాటే’వారికి బుద్ధి చెబుతున్నారు. తెలంగాణకే పరిమితం కాకుండా తాము గుర్తించిన లీడ్స్ (సమాచారం)తో ఇతర రాష్ట్రాల్లోని నిందితులను కూడా కటకటాల వెనక్కి నెట్టడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. చిన్నారుల అశ్లీల వీడియోలను ఆన్లైన్లో విక్రయిస్తున్న ఒక వ్యక్తిని తెలంగాణ మహిళా భద్రత విభాగం ఇచి్చన సమాచారంతో ఇటీవలే పశి్చమబెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. 13 రాష్ట్రాల్లోని సీఎస్ఏఎం లింకుల గుర్తింపు షీ సైబర్ ల్యాబ్ ఇప్పటివరకు చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ (సీఎస్ఏఎం)కు సంబంధించి 180 లీడ్స్‌ను గుర్తించింది. చిన్నారుల అశ్లీల వీడియోలు ఈ ముఠాలు ఆన్లైన్లో విక్రయిస్తున్నట్టు కీలక ఆధారాలు సేకరించడంతోపాటు 65 ఇంటెలిజెన్స్ రిపోర్టులను మొత్తం 13 రాష్ట్రాలకు పంపారు. వీటి ఆధారంగా దేశవ్యాప్తంగా 20 ఎఫ్ఐఆర్లు నమోదుచేసి, 21 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ ముఠాలు టెలిగ్రామ్‌లో గ్రూప్‌లు ఏర్పాటుచేసి, వాటి ద్వారా చిన్నారుల అశ్లీల వీడియోలు విక్రయిస్తూ.. గూగుల్‌పే, పేటీఎం ద్వారా డబ్బులు తీసుకుంటున్నట్టు గుర్తించారు. కీలకంగా షీ సైబర్ ల్యాబ్స్త్రీలు, పిల్లలపై జరిగే సైబర్ నేరాలను అరికట్టేందుకు మహిళా భద్రతా విభాగంలో షీ సైబర్ ల్యాబ్‌ను ఏర్పాటుచేశారు. ఇది మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో ప్రత్యేక సాంకేతిక, పరిశోధనాత్మక మద్దతును అందిస్తూ, ఎక్సలెన్స్ సెంటర్‌గా పనిచేస్తుంది. సైబర్ అడ్వొకసీ, కెపాసిటీ బిల్డింగ్, ఇన్వెస్టిగేటివ్ అసిస్టెన్స్, సైబర్ క్రైమ్ సపోర్ట్‌పై దృష్టి సారిస్తోంది. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల పోలీసు సంస్థలకు సహాయం అందిస్తోంది. నేరస్థులను గుర్తించడం కోసం డేటా అనలిటిక్స్ అందించడం ద్వారా వివిధ విభాగాలకు సహాయం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దర్యాప్తు అధికారులకు సైబర్ ఫోరెన్సిక్ మద్దతును అందిస్తోంది ఇతర రాష్ట్రాల్లోని నేరస్థులనూ గుర్తిస్తున్నాం మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడుతున్న వారిపై, ఆన్లైన్లో అనుమానాస్పద చర్యలకు పాల్పడేవారిపై షీ సైబర్‌ల్యాబ్ ద్వారా నిఘా పెడుతున్నాం. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల క్రిమినల్ నెట్‌వర్క్‌లను కూడా గుర్తిస్తున్నాం. మేం ఇచి్చన సమాచారంతో ఇటీవలే పశి్చమబెంగాల్ పోలీసులు ఒకరిని అరెస్టు చేయటంతో చిన్నారుల అశ్లీల వీడియోలు విక్రయిస్తున్న ముఠా వివరాలు తెలిశాయి. –శిఖా గోయల్ డీజీ, మహిళా భద్రత విభాగం -
చిన్నారులపై 15 నిమిషాలకో లైంగిక దాడి
న్యూఢిల్లీ: దేశంలో ప్రతి 15 నిమిషాలకు ఓ చిన్నారిపై లైంగికదాడి జరుగుతోంది. పదేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం మైనర్లపై నేరాల సంఖ్య 500 శాతానికి పైగా పెరిగింది. పిల్లలపై నేరాలకు సంబంధించి నమోదవుతున్న కేసులను విశ్లేషించిన క్రై (చైల్డ్ రైట్స్ అండ్ యు) అనే స్వచ్ఛంద సంస్థ ఈ విషయాలను వెల్లడించింది. అలాగే బాలలపై జరుగుతున్న నేరాల్లో 50 శాతానికి పైగా కేవలం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌లలోనే నమోదవుతన్నాయంది. పిల్లలపై నేరాల్లో పోక్సో (లైంగిక దాడుల నుంచి చిన్నారులకు రక్షణ) చట్టం కింద నమోదవుతున్న కేసులే దాదాపు 33 శాతం ఉన్నాయంది. -
బీ అలర్ట్ ఫ్లీజ్
-
చిన్నారిపై లైంగిక దాడి యత్నం కేసు విచారణ
ఏకపాదంపల్లి (తాడిమర్రి) : మండలంలోని ఏకపాదంపల్లి గ్రామంలో ఇటీవల ఆరేళ్ల చిన్నారిపై జరిగిన లైంగికదాడికి యత్నం కేసును శనివారం తహశీల్దార్ రామకృష్ణయ్య విచారణ చేశారు. అనంతపురం నగరంలోని మహిళా పోలీస్‌స్టేషన్ ఏఎస్ఐ సుభద్రమ్మ, స్థానిక ఏఎస్ఐ ప్రసాద్ బాధిత చిన్నారి, ఆమె తల్లిదండ్రులను తహశీల్దార్ ఎదుట హాజరు పరిచి కేసు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులను విచారించారు. ఘటన ఎలా జరిగింది? గ్రామంలో ప్రజలను విచారించారా? నిందితుణ్ణి అదపులోకి తీసుకున్నారా అని ఆయన పోలీసులను అడిగారు. నిష్పక్ష పాతంగా కేసు దర్యాప్తు చేసి నిజా, నిజాలను నిగ్గుతేల్చి దోషిని శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. స్పందించిన పోలీసులు నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నామని, కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. తొలుత ఈ ఘటన పోలీసులు తహశీల్దార్‌కు చెప్పటడంతో ఆయన అవాక్కయ్యారు. ఈ నెల 20న ఘటన జరిగితే తనకు ఎవ్వరూ తెలపలేదని మండిపడ్డారు. గ్రామంలో జరిగిన ఘటనపై సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని వీఆర్వో రాజశేఖర్‌ను మందలించారు.