breaking news
child right commission
-
హోటళ్లపై దాడులు..బాలలకు విముక్తి
హైదరాబాద్: నాంపల్లిలోని రెండు హోటళ్లపై బుధవారం బాలల హక్కుల కమిషన్ అధికారులు దాడులు జరిపారు. ఈ సందర్భంగా పలువురు బాలలకు విముక్తి కల్పించారు. ఈ దాడిలో కరాచీ బేకరీలో నలుగురు, న్యూ పారడైజ్ లాడ్జిలో 8మంది మైనర్లు పట్టుబడ్డారు. వీరిని బొమ్మలు విక్రయించే పనిలో వాడుకుంటున్నట్లు తేలిందని చైల్డ్ కమిషన్ అధికారి ఇంతియాజ్ చెప్పారు. వీరికి కనీస వేతనంతో పాటు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని కమిషనర్ అచ్యుతరావు తెలిపారు. పట్టుబడిన 12 మంది బాలలను బాలసదన్‌కు తరలించామన్నారు. ఈ మేరకు సంబంధిత హోటల్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. -
బెగ్గింగ్ మాఫియా గుట్టురట్టు..
హైదరాబాద్ : నగరంలో భారీగా విస్తరించిన బెగ్గింగ్ మాఫియా గుట్టును పోలీసులు రట్టుచేశారు. నాంపల్లిలోని ఓ లాడ్జిలో బస చేసిన మాఫియాపై చైల్డ్ రైట్ కమిషన్, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు బుధవారం ఉదయం మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో మాఫియా ఆధీనంలో పెద్ద సంఖ్యలో వృద్ధులు, మైనర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నగరంలో పలు ప్రధాన కూడళ్లలో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మాఫియా టీమ్ వీరిచే బెగ్గింగ్ చేయిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ బిక్షాటన ద్వారా ప్రతి రోజు వచ్చిన డబ్బులో కొంత మొత్తం వీరికి ఇస్తూ.. మిగతా సొమ్మును మాఫియా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు లోతుగా విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.