breaking news
chikkadpally police station
-
swetcha votarkar: యాంకర్ స్వేచ్ఛ కుమార్తె సంచలన ఆరోపణలు
సాక్షి,హైదరాబాద్: తెలుగు న్యూస్ రీడర్, యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్(Swetcha Votarkar) ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్వేచ్ఛ కుమార్తె పూర్ణచంద్ర నాయక్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తన తల్లి మరణానికి పూర్ణ చంద్రనాయక్ కారణమంటూ స్వేచ్ఛ కుమార్తె ఆరోపించింది. ‘పూర్ణచంద్ర నాయక్ ఎప్పుడూ నన్ను విసిగించేవాడు. అమ్మని, నన్ను ఎప్పుడూ కలవనిచ్చేవాడు కాదు. మా అమ్మ మరణానికి పూర్ణచంద్ర నాయక్ కారణం. ఆయన లేఖలో రాసినవన్నీ అబద్ధాలేనని వ్యాఖ్యానించింది. తన తల్లి మరణానికి పూర్ణచంద్ర నాయక్ కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వేచ్ఛ కూతురు ఫిర్యాదుతో అతనిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. మరి కాసేపట్లో పూర్ణచంద్ర నాయక్‌ను చిక్కడ పల్లి పోలీసులు రిమాండ్‌కు తరలించనున్నారు. మీడియాతో పూర్ణ చంద్ర నాయక్ అడ్వకేట్ శ్రవణ్మరోవైపు పూర్ణ చంద్ర నాయక్ అడ్వకేట్ శ్రవణ్ మీడియాతో మాట్లాడారు. పూర్ణచంద్ర నాయక్‌ను కలిసేందుకు వచ్చాను. పోలీసులు అనుమతించలేదు. ఎఫ్ఐఆర్ కాపీ అందితే బెయిల్ పిటిషన్ వేస్తాం. మరికొద్ది సేపట్లో పూర్ణచంద్ర నాయక్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించనున్నారు. మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ఫోక్సో కేసు నమోదు అయినట్లు నా దృష్టికి రాలేదు. స్వేచ్ఛ పేరెంట్స్ ఆరోపించిన దాని ప్రకారంగా ఈ కేసులో హత్య కోణం ఏం లేదు. పూర్ణ చంద్ర నాయక్ పై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో తెలియదు’అని వ్యాఖ్యానించారు. -
విచారణలో పోలీసులకు అల్లు అర్జున్ సమాధానాలు
-
అల్లు అర్జున్ ను విచారిస్తున్న చిక్కడపల్లి ఏసీపీ, సీఐ
-
అల్లు అర్జున్ ఎంక్వైరీ టైం.. వీడియో రికార్డ్!
-
అల్లు అర్జున్ వెంట తండ్రి, మామ
-
మరికాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్
-
గాంధీ హాస్పిటల్ కు అల్లు అర్జున్..
-
అల్లుడి కోసం రంగంలోకి మామ..
-
చిక్కడపల్లి సీఐ, ఎస్ఐపై సస్పెన్షన్ వేటు.. సీసీఎస్ ఎస్ఐ కూడా?
సాక్షి, చిక్కడపల్లి: చిక్కడపల్లి ఠాణా సీఐ పాలడుగు శివశంకర్‌రావు, అశోక్‌నగర్ సెక్టార్ ఎస్ఐ న ర్సింగరావులను నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిరువురితో పాటు సీసీఎస్‌లో ఎస్ఐగా ఉన్న పి.నాగరాజుగౌడ్‌ను కూడా సస్పెండ్ చేసినట్లు తెలిసింది. దుష్ప్రవర్తన, అవినీతి, నైతిక అస్థిరత ఫిర్యాదుదారుడిని బెదిరించినందుకు చిక్కడపల్లి సీఐ పాలడుగు శివశంకర్‌రావు, ఎస్ఐ నర్సింగరావులను సస్పెండ్ చేసినట్లు సమాచారం. చదవండి: అసలే చలికాలం.. రాత్రి గజగజ వణకడమే.. మరి వారి సంగతేంటి? గత వారం చిక్కడపల్లి పీఎస్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులను సీసీఎస్‌కు వెళ్లాలని.. కేసు నమోదులో తాత్సారం చేసినట్లు తెలిసింది. బాధితులు నేరుగా సీపీని కలిసి గోడు వినిపించడంతో ఆయన విచారణ జరిపినట్లు సమాచారం. బాధితులు చెప్పింది నిజమేనని తేలడంతో సీఐ, ఎస్ఐతో పాటు ఈ కేసుతో సంబంధమున్న సీసీఎస్ ఎస్ఐని కూడా సస్పెండ్ చేసినట్లు తెలిసింది. -
యజమానికే టోకరా
చిక్కడపల్లి (హైదరాబాద్): పనిచేసే సంస్థకే కన్నం వేసి 3.5 కిలోల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన కేసులో నిందితుడిని చిక్కడపల్లి పోలీసులు ఆరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం చిక్కడపల్లి ఏసీపీ నర్సయ్య, సీఐ మంత్రి సుదర్శన్, డీఐ బాబ్జీ కేసు వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన చేతన్ మాలిక్ మహారాష్ట్ర థానే ప్రాంతంలో వ్యాపారం చేసేవాడు. జల్సాలకు అలవాటుపడిన అతను మోసాలు చేయడంతో మహారాష్ట్ర రాంనగర్ పోలీస్ స్టేషన్ చీటింగ్ కేసు నమోదయ్యింది. ఈ నేపథ్యంలో అతను మూడు నెలల దోమలగూడ గగన్ మహల్లో వ్యాపారం చేస్తున్న తన గ్రామానికి రాజేష్ పాటిల్ వద్ద సహాయకుడిగా పనిలో చేరాడు. రాజేష్ కమీషన్ పద్దతిన వివిధ ప్రాంతాలకు బంగారం సరఫరా చేస్తుంటాడు. జనవరి 23న 3.5 కిలోల ఆభరణాలను తీసుకుని చిత్తూరు జిల్లా మదనపల్లిలో కస్టమర్‌కు అందజేసేందుకు ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్లిరు. యాజమాని బాత్రూమ్కు వెళ్లగా చేతన్ మాలిక్ ఆభరణాల బ్యాగ్‌తో పరారయ్యాడు. దీంతో రాజేష్ గత నెల 18న చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ మంత్రి సుదర్శన్ పర్యవేక్షణలో డీఎస్ఐ నరేందర్, హెడ్‌కానిస్టేబుల్ ఎం.డి.ఇషామొద్దీన్, కానిస్టేబుల్ సంతోష్ కుమార్‌తో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి ఉంగరాలు, చెవి దిద్దులు, లాకెట్లు, ముక్కు పుడకలను తదితర ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కరిగించిన బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మంత్రి సుదర్శన్‌తో పాటు ప్రత్యేక బృందాన్ని ఏసీపీ అభినందించారు.