breaking news
chethan cheenu
-
'వాళ్లిద్దరంటే పిచ్చి అభిమానం'
‘పెళ్లికి ముందు ప్రేమ కథ’ హీరో చేతన్ చీను ‘సాక్షి’తో కోనసీమ కుర్రోడు కాకినాడ : వర్ధమాన సినీ హీరో చేతన్ చీను ‘పెళ్లికి ముందు ప్రేమ కథ’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. కోనసీమ కుర్రాడైన చేతన్ చీను స్వస్థలం అమలాపురానికి వచ్చిన సందర్భంగా విలేకర్లతో మంగళవారం మాట్లాడారు. ఫ్యామిలీ సెంట్మెంట్తో కూడిన ఈ చిత్రం తనకు లవర్ బాయ్గా మంచి గుర్తింపు ఇస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. గతేడాది తాను నటించిన ‘రాజుగారి గది’ చిత్రం విజయంతో తెలుగు సినీ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు మరింత అవకాశం దక్కిందన్నారు. తమిళ సినీ రంగంలో బాలనటుడి నుంచి హీరో స్థాయి వరకూ 12 చిత్రాల్లో నటించానన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో రెండేళ్ల క్రితం ప్రవేశించి, హీరోగా స్థిరపడేందుకు శ్రమిస్తున్నానని తెలిపారు. తన బాల్యంలోనే తమ కుటుంబం చెన్నైలో స్థిరపడటంతో తమిళ సినీ పరిశ్రమ నుంచే బాల నటుడిగా తన సినీ ప్రస్థానం మొదలైందన్నారు. ప్రేక్షకుడిగా ఈల వేసిన థియేటర్లోనే నా చిత్రం 50 రోజులాడింది బాల్యంలో అమలాపురంలోని శేఖర్ థియేటర్లో చిరంజీవి సినిమా ‘జగదేకవీరుడు...అతిలోక సుందరి’ చూశాను. అప్పట్లో చిరంజీవి కనిపించగానే తెరపై పూలు చల్లి... ఈల కొట్టిన ఆ థియేటర్లోనే తాను నటించిన ‘రాజుగారి గది’ చిత్రం 50 రోజులాడినందుకు గర్వంగా భావిస్తానని చేతన్ చీను చెప్పారు. తనకు చిరంజీవి, పవన్ కల్యాణ్ అంటే పిచ్చి అభిమానమన్నారు. త్వరలో రామచంద్రపురం కోటతో ముడిపడిన చిత్రం తాను ప్రస్తుతం పిల్లజమిందార్-2 చిత్రంలో కూడా నటించనున్నట్టు చీను తెలిపారు. ఇవి కాకుండా జిల్లాలోని రామచంద్రపురం కోటతో ముడిపడిన కథతో నిర్మించే చిత్రంలో కూడా హీరోగా నటిస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రాన్ని ఆ కోటలోనే కాకుండా ఎక్కువగా కోనసీమ గ్రామీణ వాతావరణంలో చిత్రీకరించేందుకు చిత్ర దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారన్నారు. -
‘చెక్పోస్ట్’ చేతన్
-
జెమినీ గణేశన్గా..!
‘లవర్ బోయ్’ ఇమేజ్ను సొంతం చేసుకున్న అలనాటి హీరోల్లో ‘జెమినీ’ గణేశన్ ఒకరు. ఒకప్పుడు తమిళంలో హీరోగా ఓ రేంజ్లో దూసుకెళ్లిన ఆయన చనిపోయి పదేళ్లయినా, ఇప్పటికీ గుర్తుండిపోతారు. ఇప్పుడు జెమినీ గణేశన్ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... ఆయన పాత్రను చేసే అవకాశం యువ హీరో చేతన్ చీనూకి దక్కింది. ఇటీవల విడుదలైన ‘మంత్ర 2’లో నటించిన చేతన్ ప్రస్తుతం ‘రాజుగారి గది’, ‘చెక్పోస్ట్’ చిత్రాల్లో నటిస్తున్నారు. తమిళంలో జెమినీ గణేశన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘కాదల్ మన్నన్ జెమిని గణేశన్’ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈరోజు జరుపుకుంటున్న తన పుట్టినరోజుకి ఈ చిత్రం ఓ మంచి కానుక అవుతుందని చేతన్ చెప్పారు.