breaking news
charllapally jail
-
రేవంత్‌రెడ్డికి షాకిచ్చిన న్యాయస్థానం
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బంధువులకు చెందిన ఫాంహౌస్‌ను అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన కేసులో మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి రాజేంద్రనగర్ కోర్టు షాక్ ఇచ్చింది. డ్రోన్ కెమెరాల కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న రేవంత్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. అయితే ఆయనతో పాటు అరెస్ట్ అయిన ఐదుగురుకి మాత్రం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా జడ్జి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసులో రేవంత్‌ను మొదటి నిందితుడిగా పేర్కొన్నారు. మరోవైపు రేవంత్ అరెస్ట్‌పై కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుట్రపూరితంగానే ప్రభుత్వంపై ఆయనపై అక్రమ కేసులో మోపుతోందని కార్యకర్తలు ధర్నాలు నిర్వహిస్తున్నారు. (రేవంత్‌రెడ్డి అరెస్టు) -
రేవంత్.. ఖైదీ నెంబర్ మారింది
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఖైదీ నెంబర్ 4170 కేటాయించారు. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డిని మంగళవారం సాయంత్రం చంచల్‌గూడ జైలు నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. అనంతరం ఆయనకు చర్లపల్లి జైలులో ఖైదీ నెంబర్ 4170 కేటాయించినట్టు జైలు అధికారులు పేర్కొన్నారు. అంతకు ముందు చంచల్‌గూడ జైలులో 14 రోజుల రిమాండులో ఉన్న రేవంత్‌కు 1779 కేటాయించారు. అయితే చంచల్ గూడ జైలులో రిమాండులో ఉన్న ఆయనను చర్లపల్లి జైలుకు తరలించాలని ఏసీబీ కోర్టులో అధికారులు రిక్విజిషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. దాంతో చర్లపల్లి జైలుకు మార్చి.. అక్కడ కొత్త ఖైదీ నెంబరు ఇచ్చారు.