breaking news
Chain snacing Gang
-
నవ వరుడి బంగారు చైన్ తెంచేందుకు యత్నం
సీతానగరం : నవవరుడి మెడలో నుంచి బంగారు గొలుసు తెంచేందుకు ప్రయత్నించిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొమరాడ మండలం కళ్లికోట గ్రామానికి చెందిన కె. వెంకటరమణకు రామవరం గ్రామానికి చెందిన యువతితో గత నెల 29న వివాహం అయింది. గురువారం అత్తారింటికి వెళ్లిన వెంకటరమణ శుక్రవారం తిరిగి స్వగ్రామం చేరుకునేందుకు స్కూటీపై వస్తున్నాడు. సరిగ్గా ఆర్. వెంకంపేట రోడ్డు వద్దకు వచ్చేసరికి ఒక వ్యక్తి లిఫ్ట్ కావాలని అడగడంతో వెంకటరమణ వాహనాన్ని ఆపాడు. ఇంతలో అగంతకుడు ఒక్కసారిగా ఆయన మెడలో ఉన్న బంగారు గొలుసు తెంచేందుకు ప్రయత్నించగా బాధితుడు ఒక్కసారిగా అతడ్ని తోసేశాడు. ఈ క్రమంలో గొలుసు సగం ముక్క బాధితుడి మెడలో ఉండగా, మిగిలిన ముక్క అగంతకుడి వద్ద ఉండిపోయింది. వెంటనే తేరుకున్న బాధితుడు అగంతుకుడితో పాటు అతడికి సహాయంగా పక్కనే చెరుకుతోటలో ఉన్న ఇద్దరినీ వెంబడించాడు. దీంతో వారు చైన్‌ను వదిలేసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, గ్రామస్తులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ విషయమై ఎస్సై సాయికృష్ణ వద్ద ప్రస్తావించగా, నిందితులను పట్టుకుంటామన్నారు. -
అమ్మో.. బెంగాల్ దొంగలు..
జిల్లాలో ఏదో ఒకచోట గొలుసు దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. గత నెల 28 వరలక్ష్మీ వ్రతం నాడు ఇళ్లలో పూజలు ఆచరించి, దేవాలయాలకు వెళుతున్న మహిళలపై ైచైన్ స్నాచర్‌స విరుచుకుపడ్డారు.పోలీసులు సైతం దిగ్భ్రాంతి చెందేలా ఒకటీ రెండూ కాదు పదిచోట్ల మహిళల మెడలో గొలుసులు తెంపుకొనిపోయారు. ఇప్పటికీ ఈ దొంగతనాలు అక్కడక్కడ చోటుచేసుకుంటూనే ఉన్నాయి. - హడలెత్తిస్తున్న చైన్ స్నాచింగ్ ముఠా - పోలీసులకు సవాల్ విసురుతున్న ముఠా - అక్కడక్కడ దొంగతనాలు - నిందితులను పట్టుకోవడంలో కానరాని పురోగతి ఎంవీపీ కాలనీ(విశాఖ): గొలుసు దొంగతనాలను ముందు తేలిగ్గా తీసుకున్న పోలీసులు తర్వాత ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొద్ది గంటల వ్యవధిలో పదిచోట్ల ఇలా జరగడంతో అప్రమత్తమయ్యారు. ఒక్క విశాఖలోనే కాక విజయవాడ, గుంటూరు నగరాల్లో కూడా ఇదే రీతిలో చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయని తెలుసుకొని విస్తుపోయారు. పశ్చిమ బెంగాల్‌లోని న్యూజల్పాయిగురికి చెందిన చైన్‌స్నాచింగ్ ముఠాయే ఇందుకు కారణమని, ఆరితేరిన దాదాపు 70మంది ముఠా మన రాష్ట్రంలో దిగిందని పోలీసులు గుర్తించారు. వీరు గ్రూపులుగా విడిపోయి ప్రముఖ నగరాల్లో హల్చల్ చేస్తున్నారు. అందులో రెండు గ్రూపులు విశాఖ నగరంపై గురిపెట్టాయి. నగరంలో పలు ప్రాంతాల్లో మహిళల మెడల్లోని గొలుసులను తెంపుకొనిపోతూ కలకలం సృష్టిస్తున్నాయి. పెరిగిన గొలుసు దొంగతనాలు ఇటీవల ఉదయం వేళ చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మార్నింగ్ వాక్ చేస్తున్నా... గుడికి వెళ్తున్నా... కాలనీలో నడిచి వెళ్తున్నా... ఈ ప్రమాదం పొంచి ఉంటోంది. ఎంవీపీ కాలనీలో గత నెలలో జరిగిన దొంగతనాలకు జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల జగదాంబ జంక్షన్లో కొన్ని షాపింగ్‌మాల్స్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆఫర్లు ప్రకటించడంతో జనం ఎగబడ్డారు. సందట్లో సడేమియాలా ఇద్దరు యువకులు చేతివాటం ప్రదర్శించారు. ఇటీవల ఓల్డ్డైరీ ఫారం వద్ద ఉదయాన్నే ముగ్గువేస్తున్న మహిళాపై దాడి చేసి మంగళసూత్రాన్ని తస్కరించారు. ఎంవీపీ కాలనీలో సమతా కళాశాల జంక్షన్లో సాయంత్రం పానీపురీ తింటున్న మహిళా మేడలో చైన్‌ను కూడా తెంపి మరో ఇద్దరు యువకులు పారిపోయారు. పోలీసులకు తలనొప్పి కొన్ని రోజులుగా చైన్ స్నాచింగ్ ముఠా పెద్ద తలనొప్పిగా తయారైంది. వీరు వృద్ధ మహిళలను టార్గెట్ చేస్తున్నారు. వారైతే ప్రతిఘటించలేరని వారి అంచనా. కరడు కట్టిన దొంగలతోపాటు విలాస జీవితానికి అలవాటుపడిన విద్యార్థులు, యువకులు చైన్ స్నాచింగ్‌ను సంపాదన మార్గంగా ఎంచుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు. గొలుసు దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలు గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాట్లు చేశారు. ఈ బెంగాల్ చైన్‌స్నాచింగ్ ముఠా ఆట కట్టించేందుకు పోలీసు శాఖ మరింత పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేయాల్సి ఉంది.