breaking news
Ch Krishna
-
విధుల్లో చేరేందుకు వచ్చిన ఎంపీడీఓకు షాక్
చీమకుర్తి రూరల్: సంతనూతలపాడు ఎంపీడీఓగా విధుల్లో చేరేందుకు వచ్చిన సీహెచ్ కృష్ణకు స్థానిక ఒక వర్గం నాయకులు షాక్ ఇచ్చారు. ఆయన విధుల్లో చేరాల్సిన ఎంపీడీఓ గదికి కావాలనే తాళం వేసి ఉండటంతో చేసేది లేక సూపరింటెండెంట్ గదిలోనే బాధ్యతలు స్వీకరించారు. మద్దిపాడు ఎంపీడీఓగా పనిచేస్తున్న సీహెచ్ కృష్ణ మద్దిపాడు మండలంలో రెగ్యులర్ ఎంపీడీఓగా పనిచేస్తూనే సంతనూతలపాడు మండలానికి ఎఫ్ఏసీ (ఫుల్ అడిషనల్ చార్జి)గా జెడ్పీ సీఈఓ నియమించారు. అప్పటి వరకు ఇన్చార్జి ఎంపీడీఓగా పనిచేస్తున్న తర్లుబాడు ఎంపీడీఓ శ్రీకృష్ణ తాను విధులు నిర్వర్తించలేనంటూ సెలవు పెట్టి వెళ్లిపోవడంతో మద్దిపాడు నుంచి నియమించారు. ఎంపీడీఓ విధుల్లో చేరేందుకు వచ్చే సమయానికి ఒక్క సీనియర్ అసిస్టెంట్ తప్ప మిగిలిన స్టాఫ్ ఎవరూ లేకుండా ముందుగానే వెళ్లిపోయారు. అంతే కాకుండా కొత్తగా ఎంపీడీఓ వస్తున్నట్లు ఎంపీపీకి కనీస సమాచారం కూడా ఇవ్వలేదని తెలిసింది. మండలంలో అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ఏర్పడిన ఆధిపత్య పోరులో ఎంపీడీఓలు తరుచూ బదిలీలపై వెళ్లాల్సి వస్తోందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు నెలల్లో ఇప్పటి వరకు నలుగురు ఎంపీడీఓలు మారటమే ఆధిపత్యపోరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. నిన్నమొన్నటి వరకు తర్లుబాడు ఎంపీడీఓ శ్రీకృష్ణ ఇన్చార్జి ఎంపీడీఓగా విధులు నిర్వహించారు. ఆయనకు ముందు బాలచెన్నయ్య నిర్వహించారు. ఆయనకు ముందు మాలకొండయ్య స్థానిక నాయకుల ఒత్తిడి మేరకు మరుగుదొడ్లలో అవినీతి జరిగిందని కోర్టుకు వెళ్లి మరీ సస్పెండ్ చేయించారు. ఇలా వరుసగా నలుగురు ఎంపీడీఓలు మారడంతో స్థానిక నాయకులు జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారు. పింఛన్ల సమస్య పరిష్కారం కొత్తగా విధు ్చyజ్చి చేరిన ఎంపీడీఓ సీహెచ్ కృష్ణ మాట్లాడుతూ ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న 543 పింఛన్లను త్వరలో పరిష్కరించి పంపిణీ చేస్తానని చెప్పారు. మద్దులూరు గ్రామానికి చెందిన ఒక సీనియర్ మేట్‌ను విధుల్లో చేర్చుకున్నారు. వేసవి కాలంలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకుంటానని ఎంపీడీఓ తెలిపారు. -
మెమోరీ కార్డ్ దొంగిలించాడని..
- స్నేహితుని తండ్రి కిడ్నాప్ హైదరాబాద్ సిటీ మెమోరీ కార్డ్ దొంగిలించాడన్న కారణంగా స్నేహితుడి తండ్రిని కిడ్నాప్ చేసి రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపర్చిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీ నగర్లో నివసించే సిహెచ్.కృష్ణ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గత ఎనిమిది సంవత్సరాల నుంచి తన తమ్ముడు శ్రీకాంత్‌కు అదే ప్రాంతంలో నివసిస్తున్న బాబర్ స్నేహితుడు. ఇటీవల బాబర్ మెమోరీ కార్డ్‌ను శ్రీకాంత్ తీసుకున్నారు. అయితే మెమోరీ కార్డు ఇవ్వడానికి నిరాకరించడంతో పలుమార్లు బాబర్ ప్రశ్నించి అందులో తన కుటుంబానికి చెందిన ముఖ్యమైన ఫొటోలు ఉన్నాయని చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 5వ తేదీ తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో బాబర్ ఎన్బీ నగర్‌లోని కృష్ణ నివాసానికి వచ్చి బలవంతంగా తన ఆటోలో ఎక్కించుకొని జూబ్లీహిల్స్ రోడ్ నెం. 51వైపు తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో తీవ్రంగా కొట్టాడు. రాయితో తలపై మోదడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. హత్యాయత్నం చేయడంతో నిందితుడి నుంచి కృష్ణ తప్పించుకొని కొద్ది దూరం వెళ్లి తలదాచుకున్నాడు. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై చర్య తీసుకోవాల్సిందిగా కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బాబర్‌పై కేసు నమోదు చేశారు.