breaking news
central minister nithin gadkari
-
నేడు పాలమూరులో పర్యటించనున్న గడ్కరీ
హైదరాబాద్ : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బుధవారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని మరికల్, జడ్చర్ల జాతీయ రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. పర్యటన నిమిత్తం రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర మంత్రితో తెలంగాణ రవాణాశాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి భేటీ కానున్నారు. ఆర్టీసీ విభజన అంశంపై కేంద్ర మంత్రితో చర్చించనున్నారు. -
వృద్ధిలో పోర్టులు, రహదారులకు భాగస్వామ్యం
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పోర్టులు, రహదారుల వాటా 2 శాతం ఉండేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు రవాణా, రహదారులు, షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం పేర్కొన్నారు. రహదారుల రంగం పురోభివృద్ధికి చర్యలుసహా దేశంలోని 12 ప్రధాన పోర్టుల సామర్థ్యం, మౌలిక సదుపాయాల పెంపుపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. కామరాజార్ పోర్ట్ (గతంలో ఎన్నూర్) ద్వారా కార్ల ఎగుమతి, దిగుమతులకు కామరాజార్ పోర్ట్ లిమిటెడ్- టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్ మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం- పత్రాల మార్పిడి సందర్భంగా గడ్కరీ విలేకరులతోమాట్లాడారు. వెబ్సైట్ ఆవిష్కరణ...: కాగా షిప్పింగ్‌కు సంబంధించి ఒక వెబ్‌సైట్‌ను గడ్కారీ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. షిప్పింగ్, పోర్టుల అభివృద్ధికి నిపుణుల నుంచి వినూత్న సూచనలు, సలహాలను ఆహ్వానించడం ఈ వెబ్సైట్ ప్రధాన లక్ష్యం.