breaking news
canvas 6
-
కాన్వాస్ 6 అమ్మకం ఆన్లైన్లోనే !
న్యూఢిల్లీ: గత నెల మైక్రోమ్యాక్స్ విడుదల చేసిన కాన్వాస్ 6 మొబైల్ ను ఆన్లైన్లో విక్రయించేందుకు కంపెనీ రంగం సిద్ధం చేసింది. ఔత్సాహికులు మైక్రోమ్యాక్స్ అధికారిక వెబ్సైట్ నుంచి మొబైల్ ను ముందుగా ఆర్డర్ ఇవ్వొచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. ఫీచర్స్: 5.5 అంగుళాల స్క్రీన్ 1.3 జీహెచ్జీ ప్రాసెసర్ లాలీపాప్ ఆండ్రాయిడ్ వెర్షన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 13 మెగాపిక్సల్ రీర్ కెమెరా 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా 4జీ 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ తాజాగా భారత్‌లో వస్తున్న మార్పులకు అనుగుణంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్‌ను ఒడిసి పట్టుకునేందుకు మైక్రోమ్యాక్స్ చేసిన ప్రయత్నమిది. ఈ మొబైల్ ధరను రూ.13,999/- కంపెనీ నిర్ణయించింది. -
మైక్రోమ్యాక్స్ నుంచి కొత్త ఉత్పత్తులు
♦ కాన్వాస్ 6 సహా పలు స్మార్ట్ ♦ ఉపకరణాల ఆవిష్కరణ ♦ కంపెనీకి ఇక కొత్త లోగో... న్యూఢిల్లీ: హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 6, కాన్వాస్ 6 ప్రో సహా పలు స్మార్ట్‌ఫోన్స్, 4జీ ట్యాబ్స్, ఎల్ఈడీ టీవీలను మార్కెట్లో ఆవిష్కరించింది. గ్లోబల్ బ్రాండ్‌గా అవతరించే దిశగా బుధవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో కంపెనీ పాత లోగోను రీడిజైన్ చేసి కొత్త లోగో విడుదల చేసింది. అలాగే కొత్త ఈ-కామర్స్ పోర్టల్‌ను ప్రారంభించింది. మైక్రోమ్యాక్స్ కాన్వాస్ సిరీస్‌లోనే కాన్వాస్ 6, కాన్వాస్ 6 ప్రో అనే రెండు స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ధర 13,999గా ఉంది. వీటి ప్రి-బుకింగ్స్ సంస్థ ఆన్లైన్ స్టోర్‌లో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇవి ఏప్రిల్ 20 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. కాన్వాస్ 6: ఇందులో 5.5 అంగుళాల తెర, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3 జీబీ ర్యామ్, 4జీ, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, 13 ఎంపీ రియర్ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉంటాయని కంపెనీ తెలిపింది. కాన్వాస్ 6 ప్రో: 5.1 లాలీపాప్ ఓఎస్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4జీ ర్యామ్, 16 జీబీ మెమరీ, 4జీ, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 13 ఎంపీ రియర్ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 2 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలు ఉంటాయి.