breaking news
bus collided bike
-
బైక్‌ను ఢీకొన్న బస్సు
రణస్థలం : మండల కేంద్రంలో సూర్య స్కూల్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం ప్రమాదం జరిగింది. విశాఖపట్నం వైపు నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... లావేరు మండలంలోని ఇజ్జాడపాలెం గ్రామానికి చెందిన గొర్లె రామారావు(25) విశాఖపట్నం వైపు నుంచి ద్విచక్రవాహనంపై లావేరు వైపు వస్తున్నాడు. రణస్థలం మండల కేంద్రంలో సూర్య స్కూల్ వద్దకు వచ్చేసరికి వేగ నియంత్రణ బోర్డులు తప్పిస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఇతడిని ఢీకొట్టింది. బైక్ పడిపోవడంతో రామారావు తీవ్రగాయాలపాలయ్యాడు. స్థానిక పోలీసులు వచ్చి బాధితుడిని అంబులెన్స్‌లో ఎక్కించి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. క్షతగాత్రుడి చెవి, ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం, వాంతులు కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. దీనిపై జె.ఆర్.పురం ఎస్సై వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని బాలిక మృతి
కొడుమూరు: కర్నూలు జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ బాలిక మృతిచెందింది. కొడుమూరు తహశీల్దార్ కార్యాలయం ముందు ఆర్టీసీ బస్సు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కొడుమూరుకు చెందిన కీర్తి (15) మృతి చెందగా, ఆమె సోదరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన బాలికను చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికు తరలించారు. తండ్రితో కలసి ఇద్దరు బాలికలు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఎమ్మినగూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.