breaking news
Budget housing
-
పునాది నుంచే పొదుపు.. తక్కువ ఖర్చుతో సొంతిల్లు
గత దశాబ్దంలో గృహ నిర్మాణ వ్యయం (house construction) రెండింతలు పెరిగింది. ముఖ్యంగా పునాది నిర్మాణంలో అవసరమైన మెటీరియల్స్ (construction material) ధరలు గణనీయంగా పెరిగాయి. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు సొంతిల్లు కలను నెరవేర్చుకోవాలంటే ఖర్చులు తగ్గించుకోవడం తప్పనిసరైంది.ఈ నేపథ్యంలో, సంప్రదాయ మెటీరియల్స్‌కు ప్రత్యామ్నాయంగా చౌకగా, మన్నికగా, పర్యావరణ హితంగా ఉండే కొత్త మేటీరియల్స్ ఇప్పుడు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. తక్కువ ఖర్చుతోనే నిర్మాణ నాణ్యతను కోరుకునే వారికి ఇవి వరంగా మారుతున్నాయి.మెటీరియల్సంప్రదాయ ఎంపికలుకొత్త/చౌకైన ప్రత్యామ్నాయాలువిశేషాలుసిమెంట్ఓపీసీ, పీపీసీజియోపాలిమర్ సిమెంట్, స్లాగ్ బేస్డ్ సిమెంట్తక్కువ ఉద్గారాలు, శాశ్వతత ఎక్కువఇసుకనది ఇసుకఎం-సాండ్, రోబో సాండ్తక్కువ ధర, నది పరిరక్షణరాళ్లు20ఎంఎం, 40ఎంఎం మిక్స్రీసైకిల్ అగ్రిగేట్వ్యర్థాలను ఉపయోగించి తయారీస్టీల్ (TMT)Fe500, Fe550బసాల్ట్ రీబార్తక్కువ బరువు, తక్కువ ఖర్చు, ఎక్కువ సంవత్సరాలు మన్నికబీమ్ & ఫౌండేషన్సైట్లలో తయారు చేసే బీమ్లుప్రికాస్ట్ ఫౌండేషన్ బ్లాక్స్వేగంగా నిర్మాణం, శ్రమ ఆదాకొత్తగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీలు, మెటీరియల్స్రోబో సాండ్ – ఇసుకకు ఉత్తమ ప్రత్యామ్నాయం* మేనుఫ్యాక్చర్డ్ శాండ్ (M-Sand) కన్నా మెరుగైన గుణాత్మకత కలిగిన రోబో సాండ్, హైదరాబాద్, సంగారెడ్డి, విజయవాడ ప్రాంతాల్లో సులభంగా అందుబాటులో ఉంది.* ధర నది ఇసుక కంటే 25-30% తక్కువ.* గృహ నిర్మాణానికి సరైన పైనెస్ మోడ్యూలస్ (Fineness modulus) కలిగి ఉంటుంది.జియోపాలిమర్ సిమెంట్ – పర్యావరణ హితమైన కొత్త పరిష్కారం* జియోపాలిమర్ సిమెంట్ తయారీలో లైమ్ వినియోగం తక్కువగా ఉంటుంది.* OPC కంటే 60% తక్కువ కార్బన్ ఉద్గారాలు విడుదల చేస్తుంది.* పునాది స్థాయిలోనే గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్‌ను అమలుపరచవచ్చు.ప్రికాస్ట్ బ్లాక్స్ – వేగంగా నిర్మాణం* ఫౌండేషన్, పిలర్స్, వాల్ సెక్షన్లను ముందే తయారు చేసి సైటులో ఫిక్స్ చేయడం వల్ల నిర్మాణ వ్యయం తగ్గుతుంది.* ఒక సాధారణ 1000 చ.అ. ఇంటికి 15 రోజుల పని, 5–6 రోజుల్లో పూర్తవుతుంది.బసాల్ట్ రీబార్ – స్టీల్‌కు ఆధునిక ప్రత్యామ్నాయం* బసాల్ట్ ఫైబర్‌తో తయారవుతుంది.* తక్కువ బరువు, తక్కువ ఖర్చు.* తేమ, ఉప్పు వల్ల తుడుపుకు గురికాకపోవడం దీని ప్రత్యేకత.నిర్మాణ ఖర్చు తగ్గాలంటే.. ఇంజినీర్లు, నిపుణుల సలహాలు* స్థలానికి దగ్గరగా లభించే మెటీరియల్స్‌ను ప్రాధాన్యత ఇవ్వాలి.* పునాది నిర్మాణానికి ముందు సైట్ సొయిల్స్ టెస్టింగ్ తప్పనిసరిగా చేయించాలి. తద్వారా అవసరమైన మెటీరియల్స్‌ను సరిగ్గా అంచనా వేయవచ్చు.* సామూహిక కొనుగోలు లేదా గ్రామీణ కాంట్రాక్టర్లతో పనిచేయడం ద్వారా మెటీరియల్ ధరకులను తగ్గించవచ్చు.* ప్రికాస్ట్ టెక్నాలజీని అనుసరించడం వల్ల పని వేగంగా పూర్తవుతుంది, లేబర్ ఖర్చు తగ్గుతుంది.చివరగా..పునాది నుంచే చౌకగా, మన్నికగా, పర్యావరణహితంగా నిర్మించగలిగితే ఇంటి మొత్తం నిర్మాణ వ్యయం మీద సగటున 15 నుంచి 20 శాతం వరకు ఆదా చేయవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఇల్లు కొనేవాళ్లకు డబుల్ ధమాకా.. -
వెస్ట్ హైదరాబాద్ తప్ప అంతా ‘అందుబాటు’లోనే..
గ్రేటర్లో సామాన్యుల సొంతింటి కల రోజురోజుకూ దూరమవుతున్న నేపథ్యంలో పలు నిర్మాణ సంస్థలు వాటిని చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. భూముల ధరలు పెరగడం, నిర్మాణ సామగ్రి, కార్మికుల వ్యయాల భారమవడం వంటి పలు కారణాలతో నగరంలో ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయినా పలు నిర్మాణ సంస్థలు ఇప్పటికీ పశ్చిమ హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాల్లో సామాన్య, మధ్యతరగతికి అందుబాటు ధరల్లో గృహాలను నిర్మిస్తున్నాయి. తక్కువ ధర అనో, ప్రీలాంచ్లోనో కొనుగోలు చేసి మోసపోకుండా.. కాస్త జాగ్రత్త వహిస్తే సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చు. -సాక్షి, సిటీబ్యూరోరెండు బెడ్ రూములు, కిచెన్, హాల్, టాయిలెట్స్‌తో 700–800 చ.అ. విస్తీర్ణంలో ఉండే బడ్జెట్ హోమ్స్‌కు ఇప్పటికీ ఆదరణ ఉంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నేపథ్యంలో హైదరాబాద్‌లో అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లకు గిరాకీ ఉంది. చిన్న వ్యాపారులు, సూపర్వైజర్లు, డ్రైవర్లు, మధ్యస్థాయి ఉద్యోగులు వంటి సామాన్య, మధ్య తరగతి వర్గాలు ఎక్కువగానే ఉన్నారు. వీరు తమ సొంతింటి కలను బడ్జెట్ హోమ్స్‌తో తీర్చుకుంటారు. అద్దెకు ఉండే బదులు అదే సొమ్మును నెలవారీ వాయిదా(ఈఐఎం) రూపంలో చెల్లిస్తే సొంతిల్లు సొంతమవుతుందనేది వారి కాన్సెప్ట్. దీంతో రూ.60 లక్షల లోపు ధర ఉండే అందుబాటు గృహాలకు డిమాండ్ పెరిగింది.బిల్డర్లలో ధరల పోటీ.. 2–3 ఏళ్ల క్రితం వరకు కూడా దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే గృహాల ధరలు అందుబాటులో ఉండేవి. కానీ, హైరైజ్ అపార్ట్మెంట్లు, ఆధునిక వసతుల కల్పనలో బిల్డర్లు పోటీ పడుతుండటంతో రూ.కోట్లు వెచ్చిస్తేగానీ సొంతింటి కల సాకారం కాని పరిస్థితి. మాదాపూర్, నార్సింగి, నానక్‌రాంగూడ, కోకాపేట వంటి పశ్చిమ హైదరాబాద్ మినహా మిగిలిన మూడు జోన్లలో ఇప్పటికీ సామాన్యులకు రూ.60 లక్షల లోపు ధర ఉండే అఫర్డబుల్ గృహాలు దొరుకుతున్నాయి.ఏ ప్రాంతాల్లో కొనొచ్చంటే.. ఇబ్రహీంపట్నం, నాగార్జున్‌సాగర్ రోడ్, హయత్‌నగర్, పోచారం, ఘట్కేసర్, కీసర, శామీర్‌పేట వంటి ప్రాంతాల్లో బడ్జెట్ హోమ్స్ కొనుగోలు చేయవచ్చు. ఔటర్ లోపల ఉండే నివాస ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో ఎంపిక చేసుకోవడం ఉత్తమం. దీంతో ఇల్లు చిన్నగా అనిపించినా, చుట్టూ ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది.కొనే ముందు వీటిని పరిశీలించాలిజీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ వంటి విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు, రెరా రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాజెక్ట్‌లలోనే కొనుగోలు చేయాలి. ప్రమోటర్లు, బిల్డర్ల పాత చరిత్ర చూడాలి. ప్రాజెక్ట్‌లను పూర్తి చేసే ఆర్థిక శక్తి నిర్మాణ సంస్థకు ఉందో లేదో పరిశీలించాలి. రోడ్డు, విద్యుత్, మంచినీటి సరఫరా వంటి మౌలిక వసతులు ఉన్న ప్రాంతాల్లో కొనుగోలు చేయడం ఉత్తమం. బడ్జెట్ హోమ్స్ ప్రాజెక్ట్‌లకు సమీపంలో విద్యాసంస్థలు, ఉపాధి అవకాశాలు ఉన్న ప్రాంతాలను ఎంచుకోవడం బెటర్. -
బడ్జెట్ గృహాలకు డిమాండ్
ముంబై: రియల్టీ రంగంలో అందుబాటు ధరల్లో (చౌక) గృహాలకు (బడ్జెట్) డిమాండ్ బాగా పుంజుకుంది. గత ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికం(2016 అక్టోబర్–డిసెంబర్)లో ఈ రంగంలో నమోదైన విక్రయాల్లో 50 శాతానికి పైగా బడ్జెట్ గృహాలు ఉండడం డిమాండ్‌ను తెలియజేస్తోంది. ముఖ్యంగా 2016–17 ఆర్థిక సంవత్సరంలో అందుబాటు ధరల్లో ఉన్న గృహాల విభాగం గణనీయంగా వృద్ధి చెందింది. దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో (హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణె, ముంబై, నోయిడా, గుర్గాన్, కోల్‌కతా, అహ్మదాబాద్) ప్రాపర్టీ వెబ్సైట్ ప్రాప్ టైగర్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అందుబాటు ధరల్లో గృహాలు అంటే రూ.30 లక్షల్లోపు ధరలో ఉన్నవిగా పరిగణిస్తున్నారు. అయితే సర్వే ఈ మొత్తాన్ని రూ. 50 లక్షల వరకూ పరిగణనలోకి తీసుకుంది.