రియల్టీ రంగంలో అందుబాటు ధరల్లో (చౌక) గృహాలకు (బడ్జెట్) డిమాండ్ బాగా పుంజుకుంది. గత ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికం(2016 అక్టోబర్–డిసెంబర్)
ముంబై: రియల్టీ రంగంలో అందుబాటు ధరల్లో (చౌక) గృహాలకు (బడ్జెట్) డిమాండ్ బాగా పుంజుకుంది. గత ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికం(2016 అక్టోబర్–డిసెంబర్)లో ఈ రంగంలో నమోదైన విక్రయాల్లో 50 శాతానికి పైగా బడ్జెట్ గృహాలు ఉండడం డిమాండ్‌ను తెలియజేస్తోంది. ముఖ్యంగా 2016–17 ఆర్థిక సంవత్సరంలో అందుబాటు ధరల్లో ఉన్న గృహాల విభాగం గణనీయంగా వృద్ధి చెందింది.
దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో (హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణె, ముంబై, నోయిడా, గుర్గాన్, కోల్‌కతా, అహ్మదాబాద్) ప్రాపర్టీ వెబ్‌సైట్ ప్రాప్ టైగర్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అందుబాటు ధరల్లో గృహాలు అంటే రూ.30 లక్షల్లోపు ధరలో ఉన్నవిగా పరిగణిస్తున్నారు. అయితే సర్వే ఈ మొత్తాన్ని రూ. 50 లక్షల వరకూ పరిగణనలోకి తీసుకుంది.