breaking news
buchi reddy palem
-
తల్లిదండ్రులకు గుడి కట్టిన తనయుడు
విడవలూరు: తల్లిదండ్రులపై ఉన్న మమకారంతో కుమారుడు తన తల్లిదండ్రులకు గుడి కట్టి అందులో విగ్రహాలను ప్రతిష్టించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాళెం మండలంలోని నాగమాంబపురం పంచాయతీ పరిధిలోని కొట్టాలకి చెందిన పుట్టా సుబ్రమణ్యంనాయుడు (జొన్నవాడ ఆలయ చైర్మన్) గ్రామంలో తన సొంత స్థలంలో తల్లిదండ్రులకు గుడి కట్టించాడు. తన తల్లి పుట్టా సుబ్బమ్మ మొదటి వర్థంతి సందర్భంగా నూతనంగా నిర్మించిన గుడిలో తన తండ్రి పుట్టా రామయ్య, తల్లి పుట్టా సుబ్బమ్మ విగ్రహాలను ప్రతిష్టించారు. అనంతరం గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. -
దండుకో.. దోచుకో
సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం: జిల్లాలో కొందరు సీడీపీఓలు సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. వారిలో కోవూరు నియోజకవర్గంలోని ఓ సీడీపీఓ టాప్‌మోస్ట్‌గా నిలిచిన వైనంపై కథనం. జీతాలు పెరిగినప్పుడు, సమావేశాలకు, జనవరి ఫస్ట్ తదితరాలకు ఒక్కో అంగన్వాడీ కేంద్రం నుంచి రూ.1000 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కోడిగుడ్లను సరఫరా చేసే కాంట్రాక్టర్లను వదల్లేదు. నెలకు రూ.20వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా కమీషన్లకు తమ కార్యాలయాలను అడ్డాగా మార్చుకుని సీడీపీఓలు కొనసాగుతున్నారు. నియోజకవర్గంలోని సీడీపీఓ టాప్‌మోస్ట్ కోవూరు నియోజకవర్గంలోని ఓ సీడీపీఓ టాప్‌మోస్ట్ అవినీతి పరురాలిగా సోషల్ మీడియాలో, ప్రజల్లో హల్చల్ జరుగుతోంది. సూపర్వైజర్లను మధ్యవర్తులుగా పెట్టుకుని ఈమె చేస్తున్న దందా అంతా ఇంతా కాదు. ప్రతి విషయంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల వద్ద కూడా మామూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. తనకు రాష్ట్రస్థాయిలో పరపతి ఉందని, విచారణ జరిగినా ఎవరూ ఏమీ చేయలేరని బహిరంగంగా చెబుతున్నట్లు సమాచారం. బయటడినవి కొన్ని మాత్రమే.. వెంకటగిరి మండలంలో డక్కిలిలో అంగన్వాడీ సరుకులను నిల్వ ఉంచి, అవినీతికి పాల్పడటంతో అక్కడి సీడీపీఓ, సూపర్వైజర్ను గతంలో సస్పెండ్ చేశారు. కోవూరు నియోజకవర్గంలోని రెండు మండలాల్లో ఉన్న సీడీపీఓలు భారీగా అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే అంగన్వాడీ కార్యకర్తలు తమ ఉద్యోగాలు ఎక్కడ పోతాయోనన్న భయంతో చెప్పరని ఆయా సీడీపీఓలు భావిస్తున్నారు. కలెక్టర్ ముత్యాలరాజు విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటపడుతాయని అంటున్నారు. సీడీపీఓల బండారంపై ఏసీబీకి ఫిర్యాదు కోవూరు నియోజకవర్గంలోని అవినీతి సీడీపీఓల భాగోతంపై కొందరు ఏసీబీకి లిఖిత పూర్వక సమాచారంతో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అక్రమ వసూళ్లు ఉదయగిరి: ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు, ఉదయగిరి ప్రాజెక్ట్‌ల పరిధిలో పనిచేస్తున్న ముఖ్య అధికారులు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల నుంచి అక్రమంగా వసూళ్లు చేస్తున్నారనే విమర్శలున్నాయి. చిన్నారులకు పోషకాహారం సక్రమంగా అందించడంలో శ్రద్ధచూపని అధికారులు మామూళ్ల వసూళ్లపై ఆసక్తి కనపరుస్తున్నారు. నియోజకవర్గంలో 446 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో సుమారు 900మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ కేంద్రాలకు సంబంధించి టీఏ, డీఏ బిల్లుల్లో, కేంద్రాల అద్దె బిల్లుల చెల్లింపుల్లో ట్రెజరీ పేరుతో పర్సంటేజీలు వసూలుచేస్తున్నారు. 2017లో ఉదయగిరిలో పనిచేసిన సీడీపీఓ అంగన్వాడీ కేంద్రాలకు పంపాల్సిన సరుకుల్లో అవకతవకలకు పాల్పడటంతో అప్పటి కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేశారు. ఉదయగిరి ప్రాజెక్ట్‌లో పనిచేసే ఓ సూపర్వైజర్ కార్యకర్తల నుంచి పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు కార్యకర్తలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను ప్రాజెక్ట్ పరిధిలో వేరే మండలంలో బదిలీ చేశారు. అక్కడ కూడా ఆమె వ్యవహార శైలిలో ఎలాంటిమార్పులు రాలేదనే ఆరోపణలున్నాయి. -
ఏటీఎంలకు రక్షణ కరువు
బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్: ఏటీఎంలకు రక్షణ కరువైంది. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంతో దొంగతనాలు పెరిగాయి. కొన్నిచోట్ల సెక్యూరిటీ సైతం లేకపోవడంతో దొంగలు యథేచ్ఛగా తమ పనికానిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ కు చెందిన ఒక్కో ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఎస్బీఐకు మాత్రం ఓ సెక్యూరిటీని కేటాయించారు. ఎస్‌బీహెచ్‌కు మాత్రం నేటికీ సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు. ఉన్న సెక్యూరిటీ సైతం పట్టించుకోకపోవడంతో గుంపులుగా కేంద్రాల్లోకి దూసుకువెళుతున్నారు. ఇక ఎస్బీహెచ్ ఏటీఎం పరిస్థితి మరీ ఘోరం. ఓ వైపు జిల్లాలో ఏటీఎం కేంద్రాల్లో చోరీలు జరుగతున్నా, పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా బ్యాంకు అధికారులు పట్టిం చుకోకపోవడం శోచనీయం, ఇకనైనా అధికారులు స్పందించి సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నోటీసులు ఇచ్చాం : శ్రీనివాసరావు, సబ్ఇన్స్పెక్టర్ మండలంలోని బ్యాంకులకు సెక్యూరిటీ గార్డులను పెట్టుకోవాలని సూచించాం.దీనికి సంబంధించి నోటీసులు జా రీ చేశాం. భద్రతలేకుండా చోరీలు జరిగే అవకాశం ఉంది.