breaking news
british visas
-
16 నుంచి ఆన్లైన్లోనే బ్రిటన్ వీసా ఫీజు
న్యూఢిల్లీ: బ్రిటన్ వీసా పొందాలనుకునే భారతీయులు ఈనెల 16 నుంచి వీసా ఫీజును ఆన్లైన్లో డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారానే చెల్లించాల్సి ఉం టుంది. వీసా లేదా మాస్టర్‌కార్డ్ చిహ్నం ఉన్న డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా లేదా ఈ-వాలెట్ (స్క్రిల్) ద్వారా ఈ చెల్లింపులు జరపాలి. వీసా దరఖాస్తు కేంద్రాల్లో ఇప్పటివరకూ అమల్లో ఉన్న నగదు లేదా డీడీలు తీసుకొనే విధానానికి స్వస్తి పలకాలని బ్రిటన్ నిర్ణయించడమే ఇందుకు కారణం. వీసా దరఖాస్తుల విధానాన్ని క్రమబద్దీకరించే చర్యల్లో భాగంగానే ఈ చర్య చేపట్టారు. -
వీసా బాండ్లపై బ్రిటన్ కేబినెట్లో విభేదాలు
లండన్: వివాదాస్పద వీసా బాండ్ల అమలు విషయంలో బ్రిటన్ మంత్రివర్గంలో విభేదాలు పొడసూపాయి. భారత్ వంటి దేశాల నుంచి వచ్చే సందర్శకులపై 3 వేల పౌండ్ల (సుమారు రూ.3 లక్షలు) వీసా బాండ్ విధించాలని బ్రిటన్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే కన్జర్వేటివ్‌ల నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాములు కొందరు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. ఈ పథకం అమలైతే హై రిస్కు దేశాలుగా బ్రిటన్ భావిస్తున్న భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలకు చెందిన పౌరులు ఆరు నెలల యూకే వీసా కోసం 3 వేల పౌండ్లు డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. వీసా గడువు ముగిసినా బ్రిటన్ విడిచివెళ్లని పక్షంలో డిపాజిట్‌ను కోల్పోవలసి ఉంటుంది.