breaking news
Break jam
-
Warangal: ఏపీ ఎక్స్‌ప్రెస్ ఎస్-6 బోగీలో పొగలు
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ వద్ద ఏపీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ వెళ్తుండగా ట్రైన్ S6 బోగీ వద్ద బ్రెక్ జామ్ కావడంతో ఒక్కసారిగా పొగలు అలుముకున్నాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ట్రైన్‌ను నిలిపివేశారు. భయంతో ప్రయాణికులు ట్రైన్ దిగారు. అగ్నిమాపక యంత్రాలను ఉపయోగించి మంటలు చెలరేగకుండా రైల్వే సిబ్బంది పొగలను అదుపులోకి తెచ్చారు. బ్రేక్ ప్యాడ్స్ జామ్ కావడంతో పొగలు వచ్చినట్లు నిర్ధారించారు. స్టేషన్లో రెండు లైన్లలో ట్రెయిన్లు ఆగడంతో అరగంటసేపు రైళ్లరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యతో వచ్చిన పొగలను అదుపు చేసిన అనంతరం ట్రైన్ న్యూఢిల్లీ వెళ్ళిపోయింది. -
షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
డోర్నకల్ (వరంగల్) : మహారాష్ట్రలోని షిర్డీ సాయి నగర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న షిర్డీ ఎక్స్‌ప్రెస్ శనివారం డోర్నకల్ సమీపంలోకి రాగానే ఏసీ బోగీ కింది భాగంలో సమస్య తలెత్తడంతో.. బోగీలో పొగలు కమ్ముకున్నాయి. ఈ సమస్యను గుర్తించిన డ్రైవర్ వెంటనే డోర్నకల్ రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది మూడో ఏసీ బోగీ కింద బ్రేక్ జామ్ అయిన విషయాన్ని గుర్తించి దాన్ని సరిచేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో షిర్డీ ఎక్స్‌ప్రెస్ డోర్నకల్‌లో అరగంటకు పైగా ఆగిపోయింది.