breaking news
breaching agreement
-
ఫేస్బుక్ మొండి వైఖరి..! కంపెనీపై భారీగా అక్షింతలు..!..!
లండన్: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటున్న ఫేస్బుక్ పలు విషయాల్లో దిగజారి ప్రవర్తిస్తోంది. అమెరికన్ సోషల్ మీడియా దిగ్గజం గిఫ్(GIF) ప్లాట్‌ఫాం జిఫీ(Giphy) కొనుగోలుపై విచారణ సమయంలో బ్రిటిష్ రెగ్యులేటరీ సంస్థ సీఎమ్ఏ విధించిన ఆర్డర్‌ను ఫేస్బుక్ ఉల్లంఘించింది. దీంతో బ్రిటన్ రెగ్యులేటరీ ఫేస్‌బుక్‌పై సుమారు 50.5 మిలియన్ జీబీపీ (బ్రిటిష్ పౌండ్లు) (సుమారు రూ. 520 కోట్లు) జరిమానా విధించింది. కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (సీఎమ్ఏ) ఆర్డర్‌ను పాటించడంలో ఫేస్బుక్ ఉద్దేశపూర్వకంగానే విఫలమైందని రెగ్యులేటరీ ఆరోపించింది. బ్రిటిష్పెనాల్టీ చట్టం ముందు ఫేస్‌బుక్‌కు ప్రవర్తించిన తీరు సరిగ్గా లేదని హెచ్చరించింది. చట్టం ముందు అందరు సమానులే అంటూ ఫేస్‌బుక్‌కు సీఎమ్ఏ ఆక్షింతలు వేసింది. ఫేస్బుక్ చేసిన నిర్వాకంతో ఇతర కంపెనీలు కూడా స్ఫూర్తి పొందే అవకాశం ఉందని అభిప్రాయపడింది. అనేకసార్లు హెచ్చరించినప్పటికీ, ఫేస్బుక్ అవసరమైన సమాచారాన్ని అందించలేదని సీఎమ్ఏ చెప్పింది. Giphy కంపెనీతో ఫేస్బుక్ ఉద్దేశపూర్వకంగానే ఇంటిగ్రేట్ అపరేషన్స్ పాటించడంలో వైఫల్యమైందనిన సీఎమ్ఏ పరిగణించింది. ఫేస్బుక్ వ్యాపార పద్ధతుల విషయంలో బ్రిటన్ చట్టసభ సభ్యుల నుంచి భారీ విమర్శలకు గురైంది. రిక్రూట్మెంట్ నియమాలను పాటించినందుకు సివిల్ క్లెయిమ్‌లను పరిష్కరించడానికి ఫేస్బుక్ 14.25 మిలియన్ల డాలర్లను (సుమారు రూ. 105 కోట్లు) చెల్లించడానికి అంగీకరించిన తర్వాత ఫేస్బుక్ ఇలా ప్రవర్తించడం దారుణమని సీఎమ్ఏ సీనియర్ డైరక్టర్ జోయోల్ బ్యామ్ఫార్డ్ అన్నారు. స్పందించిన ఫేస్బుక్..! సీఎమ్ఏ విధించిన జరిమానాపై ఫేస్బుక్ స్పందించింది. సీఎమ్ఏ తీసుకున్న అన్యాయమైన నిర్ణయంతో మేము తీవ్రంగా విభేదిస్తున్నామని పేర్కొంది. సీఎమ్ఏ తీసుకున్న నిర్ణయంపై ఫేస్బుక్ సమీక్ష చేపడుతుందని ఒక ప్రకటనలో వెల్లడించింది. చదవండి: ఈ సెక్టార్లలోని ఉద్యోగులకు జీతాలు భారీగా పెరగడం ఖాయమేనా? -
టాటా సన్స్ కు వేల కోట్ల భారీ జరిమానా
టోక్యో: వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ మేజర్ ఆపరేటింగ్ ప్రమోటర్ టాటా సన్స్ లిమిటెడ్ కి లండన్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. జపాన్‌కు చెందిన టెలికాం కంపెనీ నిప్పాన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ కార్పొరేషన్ (ఎన్టీటీ) డొకోమో వివాదంలో సుమారు ఎనిమిదివేల కోట్ల రూపాయల బారీ జరిమానా విధించింది. 79 వేల 531 వేల కోట్ల రూపాయల(1.17 బిలియన్ డాలర్ల) నష్టపరిహారాన్ని చెల్లించాలని లండన్ లోని అంతర్జాతీయ వివాదాల పరిష్కారాల కోర్టు ఆదేశించింది. డొకొమో తో చేసుకున్న ఒప్పందాన్ని బేఖాతరు చేశారని ఆరోపణలపై సానుకూలంగా స్పందించిన కోర్టు ఈ మొత్తాన్ని డొకొమోకు నష్టపరిహారంగా చెల్లించాలంటూ టాటా సన్స్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని టాటా సన్స్ ప్రతినిధి కూడా ధృవీకరించారు.. కోర్టు ఆదేశాలకు తమకు చేరాయని దీనిని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. టాటా సన్స్ ఎల్లప్పుడూ చట్టానికనుగుణమైన పద్ధతిలో ఒప్పంద బాధ్యతలు నిర్వర్తించేందుకు కట్టుబడి ఉందని ..దీనిపై ఇపుడే వ్యాఖ్యానించలేమన్నారు. కాగా టాటా టెలిలో తనకున్న 26.5 శాతం వాటాను విక్రయించడం ద్వారా సంయుక్త భాగస్వామ్యం నుంచి బయటకు రావాలనుకుంటున్నట్లు 2014 ఏప్రిల్ లో డొకోమో ప్రకటించింది. ఈ వాటాలను రూ.7,250 కోట్లకు కొనుగోలు చేసేందుకు తొలుత అంగీకరించిన టాటా సన్స్ ఆ తరువాత వెనుకడుగు వేసింది. టాటా సన్స్ తో కలసి తాము ఏర్పాటు చేసిన టాటా టెలి సర్వీసెస్ లో వాటాల బదలీపై ముందు చేసుకున్న ఒప్పందాన్ని టాటా సన్స్ పాటించలేదని డొకోమో ఆరోపించింది ఈ వివాదంలో మధ్యవర్తిత్వం కోరుతూ డొకోమో లండన్‌లోని కోర్టులో గత ఏడాది జనవరి లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.