breaking news
books and lessions
-
పుస్తకాలే తూనీగ రెక్కలు
పుస్తకం తెరిస్తే ఉన్న చోటు నుంచి మాయమైపోతాం. తూనీగల్లా మారిపోతాం. పుస్తకంలోని కథలు జరిగే చోటుకంతా రెక్కలాడిస్తూ ఎగిరెళ్లిపోతాం. ‘గుడ్ బాయ్’, ‘గుడ్ గర్ల్’ అనిపించుకోవాలని అందరూ అనుకుంటారు. మంచి నడవడిక ఉంటేనే గుడ్‌బాయ్, గుడ్‌గర్ల్ అయిపోరు. మంచి మార్కులు వస్తే అయిపోరు. ఆటలాడితే అయిపోరు. మంచి పుస్తకం కూడా చదవాలి. ఎన్ని పుస్తకాలు చదివితే అంత గుడ్ మనలోకి వచ్చేస్తుంది. నవంబర్ 14 ‘చిల్డ్రన్స్ డే’ సందర్భంగా మీ అమ్మానాన్నలతో వెళ్లి మీకు నచ్చిన పుస్తకాలు కొనుక్కోండి. ఈ 10 పుస్తకాల్లో నుంచి కూడా ఎంచుకోవచ్చు.పంచతంత్రంపంచతంత్ర కథల గురించి వినకపోయినా, తెలియకపోయినా మనం పిల్లలు అయినట్టే కాదు. అంత గొప్ప కథలు ఇవి. తన వద్దకు వచ్చిన రాజకుమారులకు విద్యాబుద్ధులు నేర్పే క్రమంలో ఒక గురువు చెప్పిన కథలే ఈ ‘పంచతంత్రం’. సంస్కృతంలో విష్ణుశర్మ రాసిన ఈ కథల్ని ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువదించారు. తెలుగులోనూ అనేకమంది వీటిని అనువదించారు. రచయిత, అనువాదకుడు సహవాసి (జంపాల ఉమామహేశ్వరరావు) నుంచి వచ్చిన పుస్తకం ఇది. ప్రతి కథలోనూ ఓ నీతిని గ్రహించేలా ఈ కథల్ని తీర్చిదిద్దారు.తెనాలి రామలింగని కథలు‘వికటకవి’ తెనాలి రామలింగడంటే తెలుగు పిల్లలకు తెగ ఇష్టం. ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని చెప్పిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో ఒకడు తెనాలి రామలింగడు. ఈయన చాలా తెలివైనవాడు. ఎన్నో జటిల సమస్యలను యుక్తితో పరిష్కరించాడు. అలా ఆయన జీవితం చుట్టూ అల్లుకున్న కథలు తెలుగు జనబాహుళ్యంలో విస్తృతమైన పేరు పొందాయి. అనేకమంది రచయితలు వీటిని రాయగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.మర్యాద రామన్న కథలుమర్యాద రామన్న కథలన్నీ తెలివితేటలు పెంచేవే. పేద కుటుంబంలో పుట్టి, రాజుగారి వద్ద గొప్ప పేరు సంపాదించి, ఊరంతటికీ ఉపకారం చేసిన వ్యక్తి మర్యాద రామన్న. సమస్యతో అతనివద్దకు వస్తే దానికి తప్పకుండా పరిష్కారం చూపుతాడు. ఆయన పరిష్కరించిన సమస్యలతో పాటు ఈ కథల్లో ఆనాటి జీవనం, వారి స్థితిగతులను చూడొచ్చు. వివేకం ఉంటే ఎంతటి సమస్యనైనా ఎదుర్కొని నిలబడవచ్చే విషయం ఈ కథల ద్వారా చిన్నారులకు చేరుతుంది.పురాణాల్లోని 35 నీతి కథలుపురాణాల ద్వారా పిల్లలు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మంచి నడవడికను పొందొచ్చు. ఈ అంశాలను క్రోడీకరించి ప్రముఖ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి రాసిన 35 నీతి కథలివి. ఇందులో కథలన్నీ చాలా సులభరీతిలో అర్థమవుతాయి. ఇవి చదవడం ద్వారా పిల్లలకు పురాణాల మీద అవగాహన ఏర్పడటంతోపాటు జీవితంలో ఎలా మెలగాలో తెలుస్తుంది.పేదరాశి పెద్దమ్మ కథలుఇప్పుడంటే రైళ్లు, విమానాలు వచ్చాయిగానీ ఒకప్పుడు కాలినడక మీదే ప్రయాణాలు చేసేవారు. అలాంటి బాటసారులకు తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చి, వారికి కమ్మటి భోజనం పెట్టి, చెవికింపుగా కథలు చెప్పే పాత్రే పేదరాశి పెద్దమ్మ. పేదరాశి పెద్దమ్మ చెప్పే ప్రతి కథలోనూ నీతితోపాటు మంత్రాలు, మాయలు, హాస్యం, జంతువులు ఉంటాయి. అవన్నీ చిన్నారులకు ఆసక్తి కలిగించి, వారి ఊహాశక్తిని పెంచుతాయి.రైలు బడి జపనీస్ భాషలో 1981లో వెలువడిన ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ముప్పై భాషల్లోకి అనువాదమై కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది. టెలివిజన్ వ్యాఖ్యాత టెట్సుకో కురొయనాగి బాల్యంలోని తన రైలు బడి, అక్కడి విశేషాల గురించి రాసిన విశేషాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ పుస్తకం విద్యాబోధనతో వినోదాన్నీ, స్వేచ్ఛనూ, ప్రేమనూ కలగలిపిన ఆదర్శవంతమైన టోక్యో పాఠశాల గురించి వివరిస్తుంది. ఎన్.వేణుగోపాల్ ఈ పుస్తకాన్ని అనువదించారు.అపూర్వ రష్యన్ జానపద కథలురష్యాలో బాలల సాహిత్యానికి చాలా ప్రాముఖ్యం ఇస్తారు. అక్కడి పెద్ద రచయితలు, చిత్రకారులు పిల్లల కోసం తప్పకుండా పుస్తకాలు సృష్టిస్తారు. అలా రష్యన్ భాషలో పిల్లల కోసం రాసిన 20 కథల తెలుగు అనువాదం ఈ పుస్తకం. రష్యన్ చిత్రకారులు వేసిన రంగుల బొమ్మలతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులోని సముద్రతీరంలో పిల్లవాడు, లెక్కల కుందేలు, అక్కాతమ్ముడు, చందమామ రొట్టె తదితర కథలన్నీ చదవడం చిన్నారులకు వివేకాన్ని, వినోదాన్ని అందిస్తుంది.చందమామ కథలుఒకప్పుడు కథలంటే చందమామ కథలే. పిల్లల పత్రికంటే చందమామే. ఒకనాడు ప్రతి నెలా వెలువడిన మాసపత్రిక ‘చందమామ’ కోసం ఇంటిల్లిపాదీ ఎదురుచూసేవారు. చిన్నారులు చందమామ చదివి ఎన్నో విషయాలు నేర్చుకునేవారు. ప్రస్తుతం ఆ మానపత్రిక అందుబాటులో లేకపోయినా, ఆ కథల్ని పదిలంగా ఉంచాలన్న సంకల్పంతో పుస్తకాలుగా మార్చి విడుదల చేశారు. వీటిలో ఆనాటి కథలతోపాటు రంగురంగుల బొమ్మలున్నాయి. పిల్లలు కథను చదివి అర్థం చేసుకునేందుకు అవి ఉపకరిస్తాయి.ఓ చిన్నారి డైరీ జర్మనీకి చెందిన అన్నా ఫ్రాంక్ అనే బాలిక రాసుకున్న డైరీలోని అంశాలే ఈ పుస్తకం. నాజీలు యూదులపై చేసిన అకృత్యాల కారణంగా తన కుటుంబంతో కలిసి రెండేళ్ల పాటు అన్నా ఫ్రాంక్ రహస్య జీవితం గడపాల్సి వస్తుంది. ఆ సమయంలో తను రాసిన డైరీలోని అంశాలు ప్రపంచాన్ని కదిలించాయి. అనారోగ్యంతో ఆమె మరణించినా ఆమె రాతలు నేటికీ ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి. ఈ పుస్తకం అనేక భాషల్లోకి అనువాదమైంది. పిల్లల ఊహల్లో ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో పిల్లలు ఈ ప్రపంచం నుంచి ఎంత మంచిని ఆశిస్తారో తెలుస్తుంది.లిప్తకాలపు స్వప్నంఏడేళ్ళకే నూరేళ్లు నిండిన క్లింట్ అనే కేరళ బాలుడి జీవిత కథ ఇది. ఆ కాసింత కాలంలోనే ఇరవయ్యైదు వేల బొమ్మలు గీసి, వాటిని తన జ్ఞాపకాలుగా వదిలి వెళ్ళాడు. అతని ఆసక్తులు, అతని వేళ్ళలోని ప్రతిభ, అతని ఆలోచనల్లోని పదును, అతని అమ్మానాన్నల మురిపెం, అతని చుట్టూ ఉన్న వాళ్ళ అపేక్ష..ఇవన్నీ వ్యక్తపరిచే పుస్తకమిది. క్లింట్ గీసిన బొమ్మలు ఈ పుస్తకంలో ఉన్నాయి. స్వర్ణ కిలారి ఈ పుస్తకాన్ని అనువదించారు. -
ట్రంప్ కలం నుంచి జాలువారిన అక్షరాలు
డొనాల్డ్ ట్రంప్ అనగానే వెంటనే గుర్తొచ్చేది అమెరికా అధ్యక్షుడిగానే కదా. ఆయన మంచి రచయితని చాలామందికి తెలియకపోవచ్చు. డబ్బు ఎలా సంపాదించాలి.. అందుకు ఎన్ని మార్గాలున్నాయి.. సమకూరిన డబ్బును ఎలా సమర్థంగా నిర్వహించాలి.. అనే చాలా విషయాలను ప్రస్తావిస్తూ కొన్ని పుస్తకాలు రాశారు. ప్రముఖ పుస్తకం ‘రిచ్‌డాడ్ పూర్‌డాడ్’ రచయిత రాబర్ట్ టి కియోసాకీ వంటి వారితో కలిసి సహ రచయితగా కూడా ట్రంప్ కొన్ని పుస్తకాలు రాశారు. డబ్బుకు సంబంధించి ట్రంప్ రాసిన పుస్తకాల వివరాలు కింది విధంగా ఉన్నాయి.1. 1987: ది ఆర్ట్ ఆఫ్ ది డీల్ అనే పుస్తకాన్ని టోనీ ష్వార్ట్జ్ తో కలిసి రాశారు.2. 2004: హౌటు గెట్ రిచ్3. 2004: థింక్ లైక్ బిలియనీర్: ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో ఎబౌట్ సక్సెస్, రియల్ ఎస్టేట్ అండ్ లైఫ్.4. 2005: సర్వైవింగ్ ఎట్ ది టాప్5. 2006: ట్రంప్ 101: ది వే టు సక్సెస్.6. 2006: వై వి వాంట్ యు టు రిచ్ - రాబర్ట్ టి కియోసాకితో కలిసి రాశారు.7. 2007: థింక్ బిగ్ అండ్ కిక్ ఆస్ ఇన్ బిజినెస్ అండ్ లైఫ్8. 2011: ట్రంప్ నెవర్ గివప్: హౌ ఐ టర్న్డ్ మై బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఇన్టు సక్సెస్.9. 2012: మిడాస్ టచ్: వై సమ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గెట్ రిచ్-అండ్ వై మోస్ట్ డోన్ట్-రాబర్ట్ టి కియోసాకి, మార్క్ బర్నెట్లతో కలిసి రాశారు.10. 2015: క్రిపుల్డ్ అమెరికా: హౌ టు మేక్ అమెరికా గ్రేట్ అగేన్డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే చాలా వ్యాపారాను స్థాపించి సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఆయన దృష్టి సారించిన కొన్ని కీలక వ్యాపారాలు కింది విధంగా ఉన్నాయి.రియల్ ఎస్టేట్ట్రంప్ తండ్రికి చెందిన ట్రంప్ మేనేజ్మెంట్ కంపెనీతో రియల్ ఎస్టేట్‌లో తన వ్యాపార కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత దానికి ట్రంప్ ఆర్గనైజేషన్‌గా పేరు మార్చారు. న్యూయార్క్ నగరంలోని ట్రంప్ టవర్, మియామిలోని ట్రంప్ నేషనల్ డోరాల్, ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోతో సహా అనేక స్థిరాస్తులను అభివృద్ధి చేశారు.హోటల్స్ అండ్ రిసార్ట్స్వాషింగ్టన్ డీసీలోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్, మియామీలోని ట్రంప్ నేషనల్ డోరాల్ సహా పలు హోటళ్లు, రిసార్టులను ట్రంప్ నిర్వహిస్తున్నారు.కాసినోలుఅట్లాంటిక్ సిటీలోని ట్రంప్ ప్లాజా, ట్రంప్ తాజ్ మహల్ వంటి ప్రాపర్టీలతో ట్రంప్ క్యాసినో వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అయితే, వీటిలో కొన్ని వెంచర్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని చివరకు దివాలా పిటిషన్ దాఖలు చేశాయి.గోల్ఫ్ కోర్సులున్యూజెర్సీలోని బెడ్మినిస్టర్లోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్, స్కాట్లాంట్లోని ట్రంప్ టర్న్బెర్రీతో సహా ప్రపంచవ్యాప్తంగా ట్రంప్‌నకు అనేక గోల్ఫ్ కోర్సులు ఉన్నాయి.లైసెన్సింగ్, బ్రాండింగ్ట్రంప్ వోడ్కా, ట్రంప్ స్టీక్స్, ట్రంప్ బ్రాండెడ్ దుస్తులు, ఇతర ఉపకరణాలతో సహా వివిధ ఉత్పత్తులు, సర్వీసులకు ట్రంప్ తన పేరుతో లైసెన్స్ తీసుకున్నారు.టీవీ షో2004-2015 వరకు అమెరికాలో ప్రసారమైన రియాలిటీ టీవీ షో ‘ది అప్రెంటిస్’కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.ఇదీ చదవండి: తులం బంగారం ధర ఎలా ఉందంటే..ఇదిలాఉండగా, హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న నేషనల్ బుక్ ఫెస్టివల్‌కు నగరంలోని చాలా ప్రాంతాల నుంచి పాఠకులు వస్తున్నారు. ఈ పుస్తక ప్రదర్శన గడువు డిసెంబర్ 19 నుంచి 29 వరకు ఉందని నిర్వాహకులు తెలిపారు. -
లెట్స్ ఎంజాయ్
ఎప్పుడూ పుస్తకాలు, పాఠాలే కాదు... కాస్తంత వినోదం కూడా ఉండాలి. ఇప్పుడు కార్పొరేట్ కాలేజీల కాన్సెప్ట్ కూడా ఇదే. విద్యార్థుల్లోని క్రియేటివ్ థాట్స్‌ను ఎంకరేజ్ చేసేందుకు వినూత్న ఈవెంట్లు ప్రజంట్ చేస్తున్నాయి. అలాంటిదే ఈవారం లామకాన్‌లో ఐఎంటీ, హైదరాబాద్ విద్యార్థులు ప్రదర్శించిన ‘నైన్ మోర్ వేస్ టూ స్క్రూ ది కాలేజ్ ఇంటర్వ్యూ’. ఇయాన్ మోక్వెతీ రాసిన ‘14 మోర్ వేస్ టు స్క్రూ ది కాలేజీ ఇంటర్వ్యూ’నే విద్యార్థులు ఇలా మలిచారు. పన్నెండు పాత్రలున్న ఈ నాటకం కాలేజీ లైఫ్‌స్టైల్‌కు దగ్గరగా ఉంటుంది. కాలేజీలో చేర్చుకోవడానికి అవకాశం ఉన్న చివరి విద్యార్థిని ఎంపిక చేయాల్సిందిగా ఇద్దరు ఫ్యాకల్టీలకు చెబుతాడు డీన్. ఇక అక్కడి నుంచి కథనం రసవత్తరంగా సాగుతుంది. ఇంటర్వ్యూకి వచ్చే విద్యార్థులు, ఫ్యాకల్టీల మధ్య సంభాషణలు, వారి క్రేజీ ప్రవర్తన, మాట్లాడే తీరు నవ్వులు చిందించాయి. మధ్య మధ్యలో ఓ దొంగ, తొంభై ఏళ్ల వృద్ధురాలి పంచ్‌లు అదనం. కాలేజీ అంటే క్లాషెస్, ఇగోస్ వంటివి సహజం. అన్నింటినీ దాటి కోఆర్డినేట్ చేసుకోగలిగితేనే పర్ఫెక్ట్ ప్రొడక్ట్ వస్తుంది. మేం ప్రదర్శించిన నాటకాల అనుభవం ద్వారా ఈ విషయం తెలిసింది... అంటాడు ఈ ప్లే దర్శకుడు, ఐఎంటీ విద్యార్థి భూపేంద్ర. మొత్తానికి అంతా ఎంజాయ్ చేస్తూ, కమిట్మెంట్తో చేశామన్నాడు. రంగస్థలం గురించి ఓనమాలు ఇక్కడే నేర్చుకున్నామని, కలసి చేయడం వల్ల పెద్దగా కష్టం అనిపించలేదంటాడతడు. ఉపమన్యూ, రిథిమా, రుచిర్, అభిలాషి, రవితేజ, అంకిత్, అర్షదీప్, అంగద్, గోపిక, అనిరుధ్, ధృవ్, కౌశల్ తమ పాత్రలను అద్భుతంగా పోషించి మెప్పించారు. - ఓ మధు


