breaking news
Bollineni Rammohan Naidu
-
వైఎస్సార్సీపీలో చేరిన బొల్లినేని
సాక్షి, రాజాంపేట : వైఎస్సార్ జిల్లా తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఉన్న బొల్లినేని రామ్మోహన్నాయుడు శనివారం టీడీపీని వీడిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తీరుపై కినుక వహించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత తన అనుచరులతో చర్చించిన ఆయన సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి, సీనియర్ నాయకుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి సమక్షంలో బొల్లినేని పార్టీలో చేరారు. ఎంపీ మిథున్ రెడ్డి తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం తొలిసారి నియోజక వర్గంలో అడుగుపెట్టిన సందర్భంగా ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాజంపేట మండలం మిట్టమీదపల్లి నుంచి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. -
అవమానాలు భరించలేకే టీడీపీకి రాజీనామా
సాక్షి, రాజంపేట: వైఎస్సార్ జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి పార్టీని సర్వనాశనం చేస్తున్నాడని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బొల్లినేని రామ్మోహన్నాయుడు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా తన పదవికీ, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో జరుగుతున్న అవమానాలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. శనివారం రాజంపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా మల్లికార్జునరెడ్డి గెలవడానికి కమ్మ సామాజిక వర్గం కృషి చేసిందని, అయితే ఆయన నాలుగేళ్లుగా కమ్మ వర్గీయులను పూర్తిగా అణగదొక్కారని విమర్శించారు. అధికారుల నుంచి పనులు చేయించుకునేందుకు ఎమ్మెల్యే వర్గీయులు చేస్తున్న వ్యవహారాలు నియోజకవర్గంలో అందరికీ తెలిసిందేనన్నారు. ఎమ్మెల్యే పేరుతో కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, అలాగే భూదందా, కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజంపేట తహసీల్దారు నివసిస్తున్న అపార్టుమెంట్ అద్దె కూడా ఎమ్మెల్యే వర్గీయుల్లో కొందరు చెల్లిస్తున్నారంటే ఇక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు.