breaking news
bireddy rajasekhar reddy
-
'నారా అమరావతినాయుడు అని పెట్టుకోవాల్సింది'
శ్రీశైలం: రాష్ట్ర రాజధాని అమరావతిని సింగపూర్ తరహాలో తీర్చిదిద్దాలని కలలు కంటున్న నారా చంద్రబాబునాయుడు పేరు మార్చుకుని నారా అమరావతి నాయుడు అని పేరు పెట్టుకుంటే బాగుంటుందని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బెరైడ్డి రాజశేఖరరెడ్డి ఎద్దెవా చేశారు. ఆదివారం శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. గుంటూరు విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు చేస్తూ ఈ రోజు రాయలసీమకు వస్తున్న ఆదాయం కూడా అమరావతి నిర్మాణం కోసం ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. బాబుకు అమరావతి తప్ప వేరే ఆలోచన లేదా ? ప్రజలు ఆయన పార్టీని ఎన్నుకునది అమరావతి కోసమా అని సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీ సీట్లలో రాయలసీమలో 52 సీట్లు ఉన్నాయన్నారు. అయినప్పటికీ రాయలసీమను మజరా ప్రాంతంగా తయారు చేసి చిన్న చూపు చూస్తున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంపై తారస్థాయికి చేరుకుందని, రాష్ట్ర విభజన జరిగే సమయంలో కూడా రాయల తెలంగాణాను రాయలసీమ నాయకులే తెరపైకి తీసుకువచ్చారని, ఇది దుర్మార్గమైన ఆలోచన అని బెరైడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. అలాగే రాష్ట్రపతి ప్రణబ్‌ను కలిసి చాలాసేపు ఈ విషయంపై మాట్లాడామని, రాయలసీమలో ఉన్న రెండు జిల్లాలను తెలంగాణాలో కలిపితే ఆదిశేషుని తలగా భావిస్తున్న తిరుమల వెంకన్నను, తోకభాగంగా భావిస్తున్న శ్రీశైలం మల్లన్నను విడగొట్టినట్లవుతుందని వివరించినట్లు చెప్పారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు విడిపోకుండా ఉన్నాయంటే రాజకీయ శక్తుల నుంచి తప్పించుకుందంటే ఇది రాయలసీమ పరిరక్షణ సమితికి ఘనవిజయంగా పేర్కొన్నారు. ఒక పక్క కరువు, మరొక పక్క వర్షాలే లేవు. రైతులు విత్తనాలు వేసినా ఎండిపోతున్నాయన్నారు. ప్రధానితో 1.50 గంటలు మాట్లాడినట్లు ముఖ్యమంత్రి చెబుతున్నారని, అందులో కర్నూలు గురించి ఏ విషయమైనా మాట్లాడారా అన్ని ప్రశ్నించారు. రాయలసీమకు జరిగే అన్యాయాలపై రాయలసీమ పరిరక్షణ సమితి అనుక్షణం పోరాడుతుందని సీమకు నష్టం కలిగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
'కర్ణాటక జల దోపిడీని అడ్డుకోండి'
కర్ణాటక జల దోపిడీని తక్షణమే కేంద్ర ప్రభుత్వం, సీడబ్ల్యూసీ దృష్టికి తీసుకెళ్లాలని.. రాజకీయాలను పక్కనపెట్టి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజానీకం, వ్యవసాయానికి మేలు జరిగేలా ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన కర్నూలులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. "పూడికతో తుంగభద్ర డ్యాం సామర్థ్యం తగ్గింది. దీనికి తోడు చుట్టూ 62 ఎత్తిపోత పథకాల ద్వారా 15 టీఎంసీ నీటిని చోరీ చేస్తున్నారు. వాటికి ఆ ప్రభుత్వం అధికారికంగా విద్యుత్ సౌకర్యం కల్పించింది. సింగటలూరు ప్రాజెక్టు వల్ల మరో 40 టీఎంసీల నీటి దోపిడీ జరుగుతోంది. ఇక పరిశ్రమలకు 3.5 టీఎంసీలు వాడుకుంటున్నామంటూ ఏకంగా 15 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు. ఇవి కాకుండా తాజాగా భద్రపైన 30 టీఎంసీలు, తుంగపైన 30 టీఎంసీల చొప్పున 60 టీఎంసీల నీటి వినియోగంతో రెండు కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రూ.900 కోట్ల రుణం తీసుకున్నారు. ఇవి పూర్తయితే మనకొచ్చే 130 టీఎంసీల నీటిని తన్నుకుపోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు.. ప్రధానంగా రాయలసీమకు తీరని నష్టం జరుగుతంది" అని బెరైడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీయాలకు అతీతంగా ఈ గండం నుంచి బయటపడే మార్గాలను అన్వేషించాలన్నారు. సుప్రీంకోర్టులోనూ న్యాయపోరాటం చేయాలన్నారు.