breaking news
bio chemicals
-
రైతుబడి అగ్రి షో!
తెలుగు రైతుబడి యూట్యూబ్ ఛానల్ వ్యవస్థాపకులు రాజేంద్రరెడ్డి అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఆగస్టు 17, 18 తేదీల్లో నల్గొండలోని నాగార్జున గవర్నమెంటు కాలేజీ ఆవరణలో జరిగే తొలి వ్యవసాయ ప్రదర్శనలో వ్యవసాయం, డెయిరీ, పౌల్ట్రీ, ఆక్వా రంగాలకు చెందిన 150 దేశ విదేశీ కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 3 జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది రైతులు ఇందులో పాల్గొంటారని భావిస్తున్నారు. సందర్శకులు వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకొని ఉచిత పాస్‌లు పొందవచ్చు. ఇతర వివరాలకు.. rbagrishow.com28న అమలాపురంలో కొబ్బరి రైతుల సదస్సు..‘కలసి నడుద్దాం – కొబ్బరికి లాభసాటి ధర సాధిద్దాం’ నినాదంతో ఈ నెల 28 (బుధవారం) ఉ. 10 గం. నుంచి అమలాపురంలో భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత కొబ్బరి రైతుల సదస్సును నిర్వహించనుంది. దేశం నలుమూలల నుంచి కొబ్బరి రైతులు ఈ సదస్సులో పాల్గొంటారని నిర్వహకులు తెలిపారు. ఇతర వివరాలకు.. 94906 66659, 95425 9966629 నుంచి హైదరాబాద్‌లో నర్సరీ మేళా..హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో గల పీపుల్స్ ΄్లాజాలో ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 2 వరకు 16వ అఖిలభారత నర్సరీ మేళా జరగనుంది. 140 సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇతర వివరాలకు...98492 61710.15న తార్నాకలో సేంద్రియ సంత..గ్రామభారతి, సిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 15న సికింద్రాబాద్‌లోని తార్నాకలో మర్రి కృష్ణ హాల్లో ఉ. 10 గం. నుంచి సా. 6 గం. వరకు బ్యాక్ టు రూట్స్ మూలం సంత పేరిట సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారుల ఉత్పత్తుల సంతను నిర్వహించనున్నారు. ఇతర వివరాలకు.. 94908 50766, 63051 82620.17న హైదరాబాద్‌లో బయోచార్‌పై సెమినార్..హైదరాబాద్ యూసఫ్‌గూడలోని నిమ్స్‌మే ఆడిటోరియంలో ఈ నెల 17(శనివారం) ఉ. 9.30 నుంచి సా. 6 గం. వరకు బయోచార్ (కట్టెబొగ్గు)పై జాతీయ సదస్సు జరగనుంది. ్ర΄ోగ్రెసివ్ బయోచార్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్, నిమ్స్‌మే, రెయిన్బో బాంబూ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు.. 63051 71362.18న పెనుకొండలో..బయోచార్ (కట్టెబొగ్గు) ఉత్పత్తిపై ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్‌లోని పెనుకొండలో చార్ గోల్డ్ సంస్థ ఆవరణలో వర్క్‌షాప్ జరగనుంది. బయోచార్ నిపుణులు డాక్టర్ నక్కా సాయిభాస్కర్రెడ్డి, ప్రేమ్‌రాజ్ అవగాహన కల్పిస్తారు. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు.. వాట్సప్ – 92463 52018.11న సేంద్రియ చెరకు సాగు, 18న మట్టి సేద్యంపై శిక్షణ..‘రైతునేస్తం ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ‘కర్షక సేవా కేంద్రం’ నిర్వహణలో హైదరాబాద్ ఖైరతాబాద్ దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆవరణలో ఈ నెల 11,18 తేదీల్లో రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆగస్టు 11 (ఆదివారం)న ఉ. 10 గం. నుంచి ‘సేంద్రియ పద్ధతిలో చెరకు సాగు, చెరకుతో బెల్లం తయారీ విధానం’పై రైతు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు శిక్షణ ఇస్తారు.18(ఆదివారం)న ఉ. 10 గం. నుంచి ‘సేంద్రియ సాగులో మట్టి ద్రావణంతో పురుగులు తెగుళ్ళ నివారణ ఎలా?’ అనే అంశంపై రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి శిక్షణ ఇస్తారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. హాజరుకాగోరే వారు తప్పనిసరిగా ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలి. వివరాలకు.. 95538 25532, 70939 73999. -
నారాయణపేట జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
-
అనుమతిలేని బయోమందుల పట్టివేత
నల్లబెల్లి : అనుమతిలేని బయోమందులు, త్రీజీ గుళికలు టాటా ఏసీ వాహనంలో తిరుగుతూ రైతులకు అక్రమంగా విక్రయిస్తున్నారనే సమాచారంతో నల్లబెల్లి ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్స్ అసోసియేషన్ నాయకులు, రైతులు వాహనాన్ని పట్టుకొని వ్యవసాయాధికారులకు అప్పగించారు. ఈ సంఘటన మండలంలోని మామిండ్లవీరయ్యపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకొంది. ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు గొనే వీరస్వామి, ప్రధాన కార్యదర్శి మచ్చిక రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. బయో ఫర్టిలైజర్‌కు సంబందించిన గోల్డెన్ త్రీజీ గుళికలు, వేపపిండి బస్తాలను టాటా ఏస్ వాహనంలో ఓ వ్యాపారి తీసుకువచ్చి రైతులకు అక్రమంగా అంటగడుతున్నాడు. ఈ మందులను మండలంలోని మామిండ్లవీరయ్యపల్లి, నాగరాజుపల్లి గ్రామాలలో రైతులకు విక్రయిస్తున్నారనే సమాచారంతో నల్లబెల్లి ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్స్ అసోసియేషన్ నాయకులు మామిండ్లపల్లి గ్రామానికి చేరుకొని బయోమందుల విక్రయాలను పరిశీలించారు. అనుమతులు లేకుండా గ్రామాలలో బయోమందులు ఎలా విక్రయిస్తున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు వ్యవసాయాధికారి పరమేశ్వర్‌కు సమాచారాన్ని అందించారు. దీంతో గ్రామానికి చేరుకొన్న వ్యవసాయాధికారి వ్యాపారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బయోమందులతో పాటు టాటా ఏస్ వాహనాన్ని స్వాధీనం చేసుకొన్నారు. గ్రామాలలో తిరుగుతూ బయోమందులు రైతులకు విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. -
జీవ ఎరువుల పై రోమ్‌వాసి అధ్యయనం
బచ్చన్నపేట(వరంగల్): భారత దేశంలో వాడుకలో ఉన్న సేంద్రియ, జీవ ఎరువుల వాడకం గురించి అధ్యయం చేసేందుకు రోమ్ దేశీయుడు వరంగల్ కు వచ్చారు. అధ్యయనంలో భాగంగా రోమ్కు చెందిన ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సీనియర్ డెరైక్టర్ రోబ్‌బోస్ బుధవారం వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా రోబ్ సేంద్రియ, జీవ ఎరువుల వాడకంపై రైతులతో చర్చించారు. అలాగే మహిళా సంఘాల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. జీవ ఎరువుల వాడకం వల్ల సాగు చేస్తున్న కూరగాయల దిగుబడుల గురించి ఆరా తీశారు. రోబ్ తో పాటు ఎన్ఆర్ఎల్ఎమ్ డెరైక్టర్ రాయుడు, ఇక్రిసాట్ శాస్త్రవెత్త హోమ్ రూపేలా ఉన్నారు.