breaking news
Best And Worst Cities
-
ఉత్తమ ‘జీవన’ నగరం.. వియన్నా
న్యూఢిల్లీ: ప్రపంచంలో జీవించదగ్గ అత్యుత్తమ నగరాల జాబితాలో ఢిల్లీ ఆరు స్థానాలు దిగజారి 118వ స్థానంలో నిలచింది. గతేడాది మొదటి స్థానంలో నిలిచిన వియన్నా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. అత్యుత్తమ నగరాన్ని ఎంపిక చేసేందుకు ఎకనమిక్స్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా 140 నగరాల్లో సర్వే నిర్వహించింది. ఈ సర్వే వివరాలను బుధవారం వెల్లడించింది. నేరాలు పెరగడం, ప్రాణవాయువు నాణ్యత తగ్గడం వంటి కారణాల రీత్యా ఢిల్లీ ఆరు స్థానాలు దిగజారింది. సాంస్కృతిక విభాగంలో తక్కువ పాయింట్లు రావడంతో ముంబై రెండు స్థానాలు దిగజారి 119వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రియా రాజధాని వియన్నా జీవించదగ్గ ఉత్తమ నగరంగా ఎంపికై మొదటి స్థానంలో నిలిచింది. కెనాడాలోని సిడ్నీ, జపాన్లోని ఒసాకాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఫస్ట్ వియన్నా.. లాస్ట్ డమాస్కస్ నివాసానికి ఆమోదయోగ్య నగరాల జాబితాలో 99.1 పాయింట్లతో వియన్నా తొలిస్థానంలో నిలిచింది. ఇందులో న్యూఢిల్లీకి 56.3 పాయింట్లు రాగా, ముంబైకి 56.2 పాయింట్లు వచ్చాయి. చివరి స్థానంలో నిలిచిన సిరియాలోని డమాస్కస్ పట్టణానికి 30.7 పాయింట్లు లభించాయి. పాకిస్తాన్లోని కరాచీ 136వ స్థానంలో నిలవగా, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా 138వ స్థానంలో నిలిచింది. చైనా రాజధాని బీజింగ్ 76వ స్థానంలో నిలవగా, లండన్ 48, న్యూయార్క్ 58వ స్థానాల్లో నిలిచాయి. మీడియా స్వేచ్ఛ విషయంలో కూడా భారత్ మరింత దిగజారిందని నివేదిక తెలిపింది. -
సాల్ట్ లేక్ నగరమే బెస్ట్.. డెట్రాయిట్ వరస్ట్
చాలామంది యువత గ్రాడ్యుయేట్లు పూర్తి చేసుకుని, తమ జీవితాలను ఉన్నత శిఖరాలకు చేర్చుకోవడానికి కెరీర్ ప్రారంభానికి ఓ మంచి ప్రాంతాన్ని ఎంచుకొంటుంటారు. ఎక్కడ పెరుగుదలకు అవకాశం ఎక్కువగా ఉంటుందో అక్కడ తమ జీవితాన్ని ఆరంభిస్తారు. అయితే అలాంటి వారి ఉద్యోగ భవిష్యత్ కోసం, వాలెట్ హబ్ అనే సైట్ "ఉత్తమ, చెత్త నగరాల(బెస్ట్ అండ్ వరస్ట్ సిటీ)' జాబితాను తయారుచేసింది. అమెరికాలో 150 ప్రముఖ సిటీలను విశ్లేషించి ఈ వివరాలను తయారుచేసింది. ఇందులో సాల్ట్ లేక్, ఉతాహ్ నగరాలు ఉద్యోగ కెరీర్ ప్రారంభించడానికి అనువైన స్థలాలుగా మొదటి స్థానాలను దక్కించుకున్నాయి. డెన్వర్, కొలరాడో రెండో స్థానంలో ఆస్టిన్, టెక్సాస్ లు మూడు, సూ ఫాల్స్, సౌత్ డకోటాలు నాలుగో స్థానంలో నిలిచాయి. 25 ఏళ్ల నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సు కల్గిన జనాభా కల్గిన వారిలో మినియాపాలిస్, మిన్నెసోటా టాప్-5లో నిలిచాయి. అయితే డెట్రాయిట్ నగరం కెరీర్ ను ప్రారంభించడానికి అత్యంత చెత్త ప్రాంతంగా ఈ జాబితా పేర్కొంది. కాలిఫోర్నియా, ఫ్రెస్నో లు చివరి ఐదు స్థానాల్లో ఉన్నాయి. జీవన నైపుణ్యాల్లో ఫ్లొరైడ్ సిటీ వరస్ట్ నగరంగా ఈ అధ్యయనంలో తేలింది. ఉద్యోగుల జీవితం ఆ సిటీల్లో ఎలా ఉంటుంది? కెరీర్ ప్రారంభించడానికి చేరే కొత్త ఉద్యోగులు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? వారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఆ నగరాలు అనువైనవా? కావా? అనే విషయాలకు అనుగుణంగా ఈ అధ్యయనం చేపట్టింది. 16సంవత్సరాల నుంచి ఎక్కువ వయస్సున్న ప్రతి లక్ష మంది జీవించే ప్రాంతాల్లో ఎంతమంది ఉద్యోగ అవకాశాలు అవకాశాలు పొందుతున్నారు? ప్రారంభ జీతం, వార్షిక వృద్ధి రేటు, నిరుద్యోగుల రేటు, సొంత వ్యాపారాలు ఎలా ఉన్నాయి? జీవన నైపుణ్యం, మధ్యతరగతి వార్షిక ఆదాయం కలవారికి గృహాలధరలు, జనాభా వృద్ధి, డిగ్రీలు పూర్తిచేసిన వారి సంఖ్య వంటి అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ జాబితాను వాలెట్ హబ్ రూపొందించింది.