breaking news
Beat constable
-
బీట్ కానిస్టేబుల్‌దే కీలక పాత్ర
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వాతంత్య్రం, ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛ అత్యంత కీలకమైనవని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. పోలీస్ వ్యవస్థకు వీటితో ప్రత్యక్ష సంబంధం ఉంటుందన్నారు. స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛను నిరంతరం మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పోలీసు వ్యవస్థలో కింది స్థాయిలో ఉండే బీట్ కానిస్టేబుల్ ప్రజలను రక్షించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడని కొనియాడారు. శనివారం బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్, డెవలప్మెంట్ (బీపీఆర్ అండ్‌డీ) 51వ వ్యవస్థాపక దినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడారు. సమాజంలో శాంతి భద్రతలు అదుపులో లేకపోతే ప్రజాస్వామ్యం విజయవంతం కాబోదని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్యం అనేది మనకు సహజసిద్ధమైందని వ్యాఖ్యానించారు. ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛ నేరుగా శాంతి భద్రతలతో ముడిపడి ఉంటుందన్నారు. -
ఇది నేరస్తుల నెట్వర్క్!
ఢిల్లీలో ‘సీసీటీవీ’ వ్యవస్థ ♦ పోలీసుల రాకను పసిగట్టేందుకు కెమెరాలు న్యూఢిల్లీ: శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు సీసీటీవీలను ఏర్పాటు చేసి నిరంతరం సమీక్షిస్తుంటే.. అదే సాంకేతికతను ఉపయోగించుకుని యథేచ్చగా అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఢిల్లీ గ్యాంబ్లర్లు. తమ డెన్ చుట్టుపక్కల పోలీసుల సంచారాన్ని పసిగట్టి జాగ్రత్తపడుతూ.. విచ్చలవిడిగా అక్రమ వ్యాపారం చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. దేశ రాజధానిలోని వసంత్ గావ్‌లో అక్రమ మద్యం, మత్తుపదార్థాలు అమ్ముతున్నారంటూ.. ఢిల్లీ పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. పోలీసులు ఆ ప్రాంతంలో రైడ్ చేయగా అక్రమ కార్యక్రమాలకు సంబంధించిన ఆనవాళ్లేమీ దొరకలేదు. మరో ప్రాంతం నుంచి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దీనిపై ఉన్నతాధికారులు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఈ బృందం పకడ్బందీగా వ్యవహరించి నాలుగైదు గ్యాంగులను పట్టుకున్నాక ఈ నేరస్తుల ‘సీసీటీవీ నెట్వర్క్’ వెలుగులోకి వచ్చింది. అక్రమ కార్యక్రమాలకు పాల్పడేవారు తమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఎలాంటి అనుమానం రాకుండా సీసీటీవీలను ఏర్పాటుచేసుకున్నారు. దీన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు ఓ వ్యవస్థను పెట్టుకున్నారు. తమ ప్రాంతంలో పోలీసులు, బీట్ కానిస్టేబుళ్ల సంచారంపై అనుమానం వస్తే వెంటనే అప్రమత్తమవుతున్నారు. దీంతో పోలీసులు పక్కా సమాచారంతో వెళ్లినా వీరిని పట్టుకోలేక పోయారు. -
ప్రియుడి కోసం వచ్చి మృత్యువాత
బాలిక అనుమానాస్పద మృతి మృతురాలిది నరసరావుపేట మండలం సింగరాయకొండ (ప్రకాశం జిల్లా) : పెద్దలు కుదిర్చిన వివాహం కాదని, ప్రియుడి చేతిలో మోసపోయి కన్నవారికి కడుపుకోత మిగిల్చి కానరానిలోకాలకు వెళ్లింది ఓ అభాగ్యురాలు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉలవపాడు గ్రామానికి చెందిన దాసరి అమరేశ్వరరావు (21)కి, గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిమర్రు గ్రామానికి చెందిన దొడ్డి అర్చన (16) మధ్య రెండేళ్ల క్రితం పరిచయమైంది. బాలిక కుటుంబం వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం తిరుమల వెళుతుండగా రైలు ప్రయాణంలో వీరిద్దరి మధ్య ప్రేమకు అంకురార్పణ జరిగింది. అమరేశ్వరరావు గతేడాది బీటెక్ పూర్తిచేశాడు. అర్చన రెండేళ్ల క్రితం 10వ తరగతితో చదువుకు స్వస్తిచెప్పింది. పెద్దలు ఆగస్టు 15వ తేదీ వివాహం నిశ్చయించడంతో 13వ తేదీ రాత్రి అర్చన ఇంట్లో నుంచి పారిపోయి అమరేశ్వరరావు వద్దకు చేరింది. ఆ తర్వాత వీరు ఒంగోలులో సినిమాకు కూడా వె ళ్లారు. ఈ నెల 15వ తేదీ అర్చనను అమరేశ్వరరావు సింగరాయకొండ బాలాజీనగర్‌లోని తన స్నేహితుడు చాట్ల సురేష్ ఇంట్లో ఉంచాడు. 16వ తేదీ అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో నోట్లో నుంచి నురగకక్కుకుంటుండగా అర్చనను తీసుకుని అమరేశ్వరరావు, కందుకూరుకు చెందిన మరో స్నేహితుడు రావినూతల ప్రతాప్ సహాయంతో మోటారు సైకిల్‌పై పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్థారించారు. అక్కడి నుంచి మోటారుసైకిల్‌పై మృతదేహాన్ని తీసుకెళుతుండగా బీట్ కానిస్టేబుల్ రమేష్ అనుమానించి పట్టుకున్నారు. విచారణ చేయగా వారిది ఉలవపాడు అని, ఆ అమ్మాయి ప్రియురాలని, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని తేలింది. వెంటనే సమాచారాన్ని ఉలవపాడు ఎస్ఐకి అందించి వీరు చెప్పింది నిజమేనని నిర్ధారించుకుని పోలీసులు అమరేశ్వరరావు, ప్రతాప్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కేసును జరుగుమల్లి ఇన్చార్జి ఎస్ఐ శ్రీరామ్ విచారణ చేస్తున్నారు. బాలిక మృతదేహాన్ని కందుకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై ఎస్ఐ శ్రీరామ్‌ను వివరణ కోరగా పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే వివరాలు తెలుస్తాయని తెలిపారు. మా బిడ్డను పొట్టనపెట్టుకున్నాడు అర్చన ఇష్టం మేరకే వివాహం కుదిర్చాం. అమరేశ్వరరావు మాయమాటలు నమ్మి ఇంట్లో నుంచి పారిపోయింది. మా అమ్మాయిని అప్పగించమని బతిమిలాడాం. అక్కడికి రండి, ఇక్కడికి రండి అని తిప్పించాడు. చివరికి మా బిడ్డను పొట్టనపెట్టుకున్నాడు. - పద్మావతి, అర్చన తల్లి మాయమాటలతో వంచించాడు.. మాది వ్యవసాయ కుటుంబం. కల్లాకపటం తెలియని నా కూతురిని అమరేశ్వరరావు మాయమాటలతో వంచించాడు. ఇటువంటి వాడిని టీవీలో ప్రజలందరికీ చూపించి కఠినంగా శిక్షించాలి. - వెంకటేశ్వర్లు, అర్చన తండ్రి