breaking news
basel
-
‘దశ ధీరుడు’ ఫెడరర్
బాసెల్: స్విస్ దిగ్గజం, ప్రపంచ మూడో ర్యాంకర్ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెడరర్ మరో రికార్డు సాధించాడు. స్వదేశంలో జరిగిన బాసెల్ ఏటీపీ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఫెడరర్ 6-2, 6-2 తేడాతో అలెక్స్ డి మినావుర్(ఆస్ట్రేలియా)పై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఇది ఫెడరర్‌కు 10వ బాసెల్ ఏటీపీ టైటిల్. ఫలితంగా ఈ టోర్నీలో రికార్డు టైటిల్స్ ఘనతతో ఫెడరర్ నయా రికార్డు నమోదు చేశాడు. తొలి సెట్‌ను అవలీలగా గెలిచిన ఫెడరర్.. రెండో సెట్లో కూడా అదే ఊపును కనబరిచి మ్యాచ్‌తో పాటు చాంపియన్‌షిప్ టైటిల్‌ను కూడా గెలుచుకున్నాడు. ఇది ఓవరాల్‌గా ఫెడరర్‌కు 103 సింగిల్స్ టైటిల్ కావడం మరో విశేషం. అయితే ఒక టోర్నమెంట్‌ను 10సార్లు సాధించడం ఫెడరర్ కెరీర్లో రెండోసారి. బాసెల్ ఏటీపీ చాంపియన్‌షిప్‌లో ఫెడరర్ దూకుడు ముందు మినావుర్ తేలిపోయాడు. కేవలం 68 నిమిషాలు జరిగిన పోరు ఏకపక్షంగా సాగింది. వరుస రెండు సెట్లలోనే ఫెడరర్ తన విజయాన్ని ఖాయం చేసుకుని తనలో జోరు తగ్గలేదని నిరూపించాడు. ఈ ప్రదర్శనపై ఫెడరర్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇదొక గొప్ప మ్యాచ్ అని పేర్కొన్న ఫెడరర్.. చాలా తొందరగా ముగిసిందని పేర్కొన్నాడు. నా సొంత గడ్డపై 10వసారి ఈ టైటిల్‌ను సాధించడం మరచిపోలేని అనుభూతిగా పేర్కొన్నాడు. కాగా, ఈ చాంపియన్‌షిప్‌లో తొలి మ్యాచ్ మాత్రం చాలా కఠినంగా సాగిందన్నాడు. ఐదు సెట్లకు దారి తీసిన ఆ మ్యాచ్‌లో సుదీర్ఘమైన ర్యాలీలు వచ్చాయన్నాడు. -
శ్రమించి... శుభారంభం
పురుషుల సింగిల్స్‌లో మూడున్నర దశాబ్దాల పతక నిరీక్షణ తెరదించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారులు తొలి రౌండ్ అడ్డంకిని శ్రమించి అధిగమించారు. శ్రీకాంత్, ప్రణయ్ ఒక్కో గేమ్ కోల్పోయి విజయాన్ని అందుకోగా... సాయిప్రణీత్ వరుస గేముల్లో గెలుపొంది రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. బాసెల్ (స్విట్జర్లాండ్): తమకంటే తక్కువ ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను ఓడించడానికి భారత బ్యాడ్మింటన్ స్టార్స్ చెమటోడ్చాల్సి వచ్చింది. ఒకదశలో ఊహించని ఫలితం వస్తుందేమోననే అనుమానం కలిగినా... సరైన సమయంలో ఫామ్‌లోకి వచ్చిన భారత ఆటగాళ్లు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తొలి రౌండ్‌ను విజయవంతంగా దాటారు. ప్రపంచ మాజీ నంబర్‌వన్, ప్రస్తుత పదో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్, ప్రపంచ 19వ ర్యాంకర్ భమిడిపాటి సాయిప్రణీత్, ప్రపంచ 30వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ ఈ మెగా ఈవెంట్లో రెండో రౌండ్లోకి ప్రవేశించారు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ శ్రీకాంత్ 66 నిమిషాల్లో 17–21, 21–16, 21–6తో ప్రపంచ 81వ ర్యాంకర్ ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)పై... సాయిప్రణీత్ 40 నిమిషాల్లో 21–17, 21–16తో 66వ ర్యాంకర్ జేసన్ ఆంథోని హో–షుయె (కెనడా)పై... ప్రణయ్ 59 నిమిషాల్లో 17–21, 21–10, 21–11తో 93వ ర్యాంకర్ ఈటూ హీనో (ఫిన్లాండ్)పై విజయం సాధించారు. గత ప్రపంచ చాంపియన్‌షిప్ తొలి రౌండ్లోనూ ఎన్‌హట్ ఎన్గుయెన్‌తోనే ఆడిన శ్రీకాంత్ నాడు రెండు గేముల్లో గెలుపొందగా... ఈసారి మాత్రం మూడు గేముల్లో గట్టెక్కాడు. తొలి గేమ్‌ను కోల్పోయిన శ్రీకాంత్ రెండో గేమ్‌లోనూ గట్టిపోటీ ఎదుర్కొన్నాడు. అయితే స్కోరు 17–16 వద్ద ఒక్కసారిగా విజృంభించిన ఈ ఆంధ్రప్రదేశ్ ఆటగాడు వరుసగా నాలుగు పాయింట్లు సాధించి గేమ్‌ను దక్కించుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో కోచ్ పుల్లెల గోపీచంద్ తొలి పాయింట్ నుంచే దూకుడుగా ఆడాలని శ్రీకాంత్‌కు సూచించాడు. తొలి పాయింట్ కోల్పోయాక... శ్రీకాంత్ తన జోరు పెంచాడు. స్మాష్‌లతో చెలరేగిపోయాడు. ఫలితంగా వరుసగా 11 పాయింట్లు గెలిచి 11–1తో ఆధిక్యంలోకి వెళ్లి ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్), చైనా దిగ్గజం లిన్ డాన్, నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా), ఆరో సీడ్ ఆంథోని జిన్‌టింగ్ (ఇండోనేసియా), ఐదో సీడ్ ఆంటోన్సెన్ (డెన్మార్క్), మూడో సీడ్ చెన్ లాంగ్ (చైనా) కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో మేఘన–పూర్వీషా (భారత్) జంట 21–10, 21–18తో డయానా–నిక్తె సోటోమేయర్ (గ్వాటెమాలా) జోడీపై గెలిచింది. -
కేఫ్‌లో కాల్పులు.. ఇద్దరు మృతి
జెనీవా: స్విట్జర్లాండ్‌లోని ఓ కేఫ్‌పై దుండగులు దాడి చేశారు. తుపాకులతో విచక్షణారహితంగ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డాడు. బాసిల్ పట్టణంలోని 'కేఫ్ 56'లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి 8:15 గంటల సమయంలో(స్థానిక సమయం) కేఫ్‌లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు వస్తూనే కాల్పులకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. కాల్పుల అనంతరం వారు రైల్వేస్టేషన్ వైపు పారిపోయారని తెలిపారు. అయితే.. ఈ దాడి వెనుకాల ఉగ్రకుట్ర ఉందా అనే విషయాన్ని మాత్రం పోలీసులు నిర్థారించలేదు. కాల్పులకు గల కారణాలు తెలియరాలేదని, విచారణ జరుగుతుందని బాసెల్ ప్రాసిక్యూటర్స్ ఆఫీస్ ఓ ప్రకటనలో తెలిపింది.