breaking news
basava punnaiah
-
మాజీ ఎంపీ బసవపున్నయ్య కన్నుమూత
-
మాజీ ఎంపీ బసవపున్నయ్య కన్నుమూత
రేపల్లె/ఆనందపేట(గుంటూరు): సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సింగం బసవపున్నయ్య(91) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో రేపల్లె ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కృష్ణా జిల్లా మోదుమూడి గ్రామంలోని ఓ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. ఒకసారి తెనాలి ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎంపిక య్యారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బసవపున్నయ్య భౌతికకాయాన్ని రేపల్లెలోని ఆయన స్వగృహానికి తరలించారు. వివిధ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పిం చారు. గురువారం ఉదయం 10 గంటలకు రేపల్లెలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. సింగం బసవపున్నయ్య మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. -
బసవపున్నయ్య ప్రపంచ నేత: ఏచూరి
హైదరాబాద్: మాకినేని బసవపున్నయ్య ప్రపంచ కమ్యూనిస్టు నేత అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఆయన మంగళవారం చిక్కడపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఏచూరి ప్రసంగించారు. హోచిమిన్, స్టాలిన్, ఫిడెల్క్యాస్ట్రో వంటి దేశాధినేతలతో బసవపున్నయ్యకు దగ్గరి సంబంధాలున్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీవీ రాఘవులు, ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు తదితరులు పాల్గొన్నారు.